Monday, March 23, 2009

మహిళల బ్లాగింగు పై సాక్షి పత్రికలో వచ్చిన ఆర్టికల్

ఈరోజు సాక్షి పేపర్ లో మహిళల బ్లాగింగ్ గురించి వచ్చిన వ్యాసం...
నాకైతే ఈ ఆర్టికల్ అంత ఆకట్టుకునే రీతిలో ఉందని అనిపించలేదు. ఏదో పై పైన వ్రాయాలి కాబట్టి వ్రాసినట్టు అనిపించింది. బహుశా స్థల పరిమితి వలన వ్యాసాన్ని కుదించి ముద్రించారేమో!

7 comments:

kiraN said...

బ్లాగ్ అనేది డైరీ అనే అంటున్నారు కాని అది పబ్లిక్ డైరీ అంటే అందరూ చూసి తమ అభిప్రాయాలను మాత్రమే చెప్పాలి. అంతే గాని జ్యోతి గారు చెప్పినట్టు విమర్శలు చేయకూడదు. ఇప్పుడు కొంతమంది "మీరు ఇప్పుడు ఇలా ఆలోచిస్తున్నారు, పూర్వం వేరేలా ఉండేది కాబట్టి మీ ఆలోచనా విధానమే తప్పు" అని కొందరు అంటున్నారు. ఇలా అనడానికి ప్రయత్నించేకన్నా మీ అభిప్రాయం ఏంటో సూటిగా, స్పష్టంగా చెప్పి ఊరుకోండి. మీకు అంతగా నచ్చకపోతే బ్లాగుని దర్శించడమే మానేయ్యండి. ఎందుకంటే బ్లాగు ఒక వ్యక్తిగత పబ్లిక్ డైరీ.


- కిరణ్
ఐతే OK

శ్రీనివాస్ said...

విమర్శించడం జన్మ హక్కు అని ఫీల్ అవకుండా పోరబాట్లని సరిదిద్దే పెద్ద మనసు అందరికి ఉంటె . ఏ బాద ఉండదు

Praveen Mandangi said...

ఒకావిడ బ్లాగ్ లో తన కుటుంబం గురించి ఎక్కువ రాయడం వల్ల ప్రైవసీ తగ్గి బ్లాగ్ చూసే వాళ్ళ సంఖ్యని లిమిట్ చేశారని ఆ వ్యాసంలో వ్రాసి ఉంది. నా ఫొటోగ్రఫీ బ్లాగ్ లో నేను ఫొటోలు ఎక్కువ పెట్టలేకపోవడానికి కారణం కూడా అదే. మా బంధువులు కొండలు, గుట్టలు, అడవులు, నదీ తీరాలు, సముద్ర తీరాలు వగైరా చోట్ల ఉండగా నేను వాళ్ళకి తీసిన ఫొటోలు ఎక్కువ ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే నా ఫొటోగ్రఫీ బ్లాగ్ లో పెట్టాను. ప్రైవసీ ప్రోబ్లమ్ రాకుండా నేను ముందు జాగ్రత్త తీసుకోగలిగాను కానీ ఆవిడ జాగ్రత్త తీసుకోలేకపోయింది. Prevention is better than cure. This logic even applies to the issue of privacy.

చైతన్య said...

@కిరణ్
కరెక్ట్ గా చెప్పారు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పటంలో తప్పు లేదు కానీ... "నేననుకున్నదే కరెక్ట్...నువ్వు తప్పు" అని చెప్పటం సరైన పద్ధతి కాదు.

@శ్రీనివాస్
పోరబట్లని మాత్రమే విమర్శిస్తే కుడా పరవాలేదు. కానీ ప్రతిదాన్ని పనికట్టుకుని విమర్శించేవాళ్లని ఏమనాలి?

@ISP Administrator
అది కూడా ఒక రకంగా కరక్టే. privacy లేదని తర్వాత బాధపడే బదులు... ప్రైవేటు విషయాలని బహిర్గత పరచకుండా జాగ్రత్త పడటం ఉత్తమం.

శ్రీనివాస్ said...

ప్రతి దాన్ని పని గట్టుకు విమర్శిస్తే ... వయసైపోయ్యి చాదస్తం అనుకోవాలి

జ్యోతి said...

కిరణ్ గారు,
ఎవరు ఎవరి బ్లాగులో అలా రాసారు??

krishna rao jallipalli said...

ప్రతిదానికీ ఈకలు పీకి విమర్శిస్తే విమర్శించే వాళ్ళు బయట పడిపోతారు కాని... శ్రీనివాస్ గారు అన్నట్లు అది చాదస్తం కాదేమో... శాడిజం అనేది కరెక్ట్ పదం.