ఎందుకో తెలీదు కానీ... ఈ పాట వినగానే బాగా నచ్చేసింది. రెండు రోజుల నుండి అదే పనిగా వింటూనే ఉన్నాను. విన్నకొద్దీ వినాలనిపిస్తుంది.
సిరివెన్నెల గారి మహత్యం ప్రతి పదంలోనూ కనిపిస్తుంది. కార్తీక్ గొంతులో ఉన్న మేజిక్ కూడా తోడయింది.
పాట వింటుంటే... చాలా చెప్పాలనిపిస్తుంది కానీ... ఏమని చెప్పగలం, ఎంతని చెప్పగలం సిరివెన్నల గారి గురించి!
ఒక ఇళయరాజా... ఒక ఏసుదాస్... ఒక సిరివెన్నెల.
అంతకన్నా ఏం చెప్పగలం!
***
ఎందుకు ఎందుకు ఎందుకు నను పరిగెత్తిస్తావెందుకు
ఆకలి తీర్చని విందుకు నన్నాకర్షిస్తావెందుకు
దరికి రానీక నింగి శశిరేఖ
పొదువుకోనీక వదులుకోనీక
ఇంతగా చితిమంటలా నన్నంటుకోవాలా
సౌందర్య జ్వాలా సౌందర్య జ్వాలా సౌందర్య జ్వాలా || ఎందుకు ||
పాలనవ్వుల రూపమా నను తాళనివ్వని తాపమా
దారి చూపని దీపమా జత చేరనీయని శాపమా || పాలనవ్వుల ||
తళతళ తళతళ కత్తుల మెరుపై కళ్ళను పొడిచేలా
తెరవని తలుపై తెలియని మలుపై కలవరపరిచేలా
నువ్వు నా సొంతమనే అత్యాశ అలిసేలా
నేనెంత ఒంటరినో ఒట్టేసి తెలిపేలా
జంటగాని జంటలా నా వెంట నడవాలా
సౌందర్య జ్వాలా సౌందర్య జ్వాలా సౌందర్య జ్వాలా || ఎందుకు ||
నీవు నింపిన ఊపిరే నా గుండె దహిస్తుంటే ఎలా
నీవు పెంచిన ఆశలే నరనరాన్ని కోస్తుంటే ఇలా || నీవు నింపిన ||
సలసల మరిగే నిప్పుల మడుగై నెత్తురు ఉడికేలా
నిలువున నీలో కరగని కోరిక విలవిలలాడేలా
ఒక్క పుట్టుకలోనే ఇన్నిన్ని మరణాలా
ఎంత దగ్గర ఉన్నా దక్కని వరమాల
నన్నిలా ఉరితాడుతో ఉయ్యాలలూపాలా
సౌందర్య జ్వాలా సౌందర్య జ్వాలా సౌందర్య జ్వాలా || ఎందుకు ||
చిత్రం: నేను (2004)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్ర్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: కార్తిక్
Showing posts with label నాకిష్టం. Show all posts

Friday, February 19, 2010
Friday, March 20, 2009
వానా వానా వల్లప్ప
అబ్బా... ఏంటి ఈ ఎండలు అప్పుడే మొదలయ్యాయి అనుకుంటుంటే... ఉన్నట్టుండి ఈరోజు వర్షం కురిసింది. కానీ అదేదో పాటలో చెప్పినట్టు చుట్టంలా వచ్చి చూసెళ్లిపోయింది. ఆ కురిసే వానేదో ఎంచక్కా ఫుల్లుగా కురిసేయోచ్చు కదా!
"వర్షం" - ఆ పదంలోనే ఏదో తెలియని ఆకర్షణ ఉందేమో అనిపిస్తుంది. మరి పేరే అలా ఉంటే వర్షం ఇంకెలా ఉంటుంది.
వర్షం కురిసినప్పుడు వచ్చే కమ్మని మట్టి వాసన నచ్చని మనిషి ఉంటాడా అసలు!
నీరెండలో వర్షం కురిసినప్పుడు వచ్చే ఇంద్రధనుసు ఎంత అందంగా ఉంటుంది!
అందుకే వర్షానికి అంతమంది ఫాన్స్. నేనయితే ఏ సి.
ఏంటో... దాన్ని ఎంత చూసినా తనివి తీరదు.

నాకు వానలో తడవటం అంటే భలే సరదా. కానీ చలేసేస్తుంది. వర్షం కొంచం వెచ్చగా పడొచ్చుకదా! అప్పుడు ఎంచక్కా ఎంతసేపైనా తడవొచ్చు! ఏం చేస్తాం... అనుకుంటే జరిగిపోదు కదా!
ఈ దేవుడికి కుళ్ళు అనుకుంట. తనేమో మేఘాల కంటే పైనెక్కడో ఉంటాడు మరి... తను తడవలేడు కదా వర్షంలో. అందుకే నన్ను కూడా(మిమ్మల్ని కూడానా?) తడవకుండా చేస్తున్నాడు. తడిస్తే చలి వేయటం, జలుబు, జ్వరం రావటం లాంటి reactions పెట్టాడు. హుహ్.
అందుకే ఆ కురిసే వర్షాన్ని అలా చూస్తూ సంతోషపడటమే!
వర్షం గురించి ఎవరో ఎక్కడో చెప్పిన ఒక విషయం గుర్తొస్తుంది... "వర్షం ఎలాంటి భావాన్నైనా ప్రతిబింబించగలదు" అని. నిజమే కదా! మనం సంతోషంగా ఉన్నప్పుడు వర్షాన్ని చూస్తుంటే... ఇంకా సంతోషంగా అనిపిస్తుంది... మన ఆనందం రెట్టింపు అయిందేమో అనిపిస్తుంది. అదే బాధలో ఉన్నప్పుడు వర్షాన్ని చూస్తుంటే మన మనసులోని బాధే అలా వర్షంలా కురుస్తుందేమో అనిపిస్తుంది!
నిజంగానే వర్షం ఏ భావాన్నైనా పలికించగలదు! అందుకే అదంటే నాకు బోలెడు ఇష్టం.
***
"వర్షం" మీద నాకిష్టమైన కొన్ని పాటలు: (వరసక్రమంతో సంబంధం లేదు)
> ఈ వర్షం సాక్షిగా (వర్షం)
> ఆకాశ గంగ దూకావే పెంకితనంగా (వాన)
> స్వాతి ముత్యపు జల్లులలో (ప్రేమ యుద్ధం)
> జల్లంత కవ్వింత కావాలిలే (గీతాంజలి)
> ఓ ఓ ఓ వానా వానా వందనం (అడవి దొంగ అనుకుంట)
> వర్షించే మేఘంలా నేనున్నా (చెలి)
> గాలివానలో వాననీటిలో పడవ ప్రయాణం (స్వయమ్వరం)
ప్రస్తుతానికి ఇవే గుర్తొచ్చాయి. ఖచ్చితంగా ఇంకా ఉండే ఉంటాయి.

Photo Courtesy: Internet

Subscribe to:
Posts (Atom)