Friday, February 19, 2010

ఒక్క పుట్టకలోనే... ఇన్నిన్ని మరణాలా!

ఎందుకో తెలీదు కానీ... ఈ పాట వినగానే బాగా నచ్చేసింది. రెండు రోజుల నుండి అదే పనిగా వింటూనే ఉన్నాను. విన్నకొద్దీ వినాలనిపిస్తుంది.
సిరివెన్నెల గారి మహత్యం ప్రతి పదంలోనూ కనిపిస్తుంది. కార్తీక్ గొంతులో ఉన్న మేజిక్ కూడా తోడయింది.
పాట వింటుంటే... చాలా చెప్పాలనిపిస్తుంది కానీ... ఏమని చెప్పగలం, ఎంతని చెప్పగలం సిరివెన్నల గారి గురించి!
ఒక ఇళయరాజా... ఒక ఏసుదాస్... ఒక సిరివెన్నెల.
అంతకన్నా ఏం చెప్పగలం!

***




ఎందుకు ఎందుకు ఎందుకు నను పరిగెత్తిస్తావెందుకు
ఆకలి తీర్చని విందుకు నన్నాకర్షిస్తావెందుకు
దరికి రానీక నింగి శశిరేఖ
పొదువుకోనీక వదులుకోనీక
ఇంతగా చితిమంటలా నన్నంటుకోవాలా
సౌందర్య జ్వాలా సౌందర్య జ్వాలా సౌందర్య జ్వాలా || ఎందుకు ||

పాలనవ్వుల రూపమా నను తాళనివ్వని తాపమా
దారి చూపని దీపమా జత చేరనీయని శాపమా || పాలనవ్వుల ||
తళతళ తళతళ కత్తుల మెరుపై కళ్ళను పొడిచేలా
తెరవని తలుపై తెలియని మలుపై కలవరపరిచేలా
నువ్వు నా సొంతమనే అత్యాశ అలిసేలా
నేనెంత ఒంటరినో ఒట్టేసి తెలిపేలా
జంటగాని జంటలా నా వెంట నడవాలా

సౌందర్య జ్వాలా సౌందర్య జ్వాలా సౌందర్య జ్వాలా || ఎందుకు ||

నీవు నింపిన ఊపిరే నా గుండె దహిస్తుంటే ఎలా
నీవు పెంచిన ఆశలే నరనరాన్ని కోస్తుంటే ఇలా || నీవు నింపిన ||
సలసల మరిగే నిప్పుల మడుగై నెత్తురు ఉడికేలా
నిలువున నీలో కరగని కోరిక విలవిలలాడేలా
ఒక్క పుట్టుకలోనే ఇన్నిన్ని మరణాలా
ఎంత దగ్గర ఉన్నా దక్కని వరమాల
నన్నిలా ఉరితాడుతో ఉయ్యాలలూపాలా

సౌందర్య జ్వాలా సౌందర్య జ్వాలా సౌందర్య జ్వాలా || ఎందుకు ||

చిత్రం: నేను (2004)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్ర్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: కార్తిక్

8 comments:

Subbu said...

thanks for the lyrics :)

మురళి said...

Don't miss the movie 'Nenu.' I had watched it twice in a gap of just one day.. Thanks for sharing the beautiful song..

anveshi said...

బావుంది పాట.సిరివెన్నెల గారు గురించి చెప్పేది ఎం వుంది?కత్తి lyrics.
"నువ్వు నా సొంతమనే అత్యాశ అలిసేలా
నేనెంత ఒంటరినో ఒట్టేసి తెలిపేలా
జంటగాని జంటలా నా వెంట నడవాలా

ఒక్క పుట్టుకలోనే ఇన్నిన్ని మరణాలా
ఎంత దగ్గర ఉన్నా దక్కని వరమాల
నన్నిలా ఉరితాడుతో ఉయ్యాలలూపాలా "

wah wa wah wa...:)

నిషిగంధ said...

మంచి పాట చైతన్య గారు! ఈ సినిమాలో ఇంకో రెండు పాటలు కూడా (కార్తీక్ పాడినవి) నాకు చాలా చాలా ఇష్టం.. ఈ మూడు పాటల్లో లిరిక్స్ చాలా బావుంటాయి..

చూస్తూ చూస్తూనే ఏదో చిత్రం జరిగిందే...
http://www.ragalahari.com/jukeboxv3/ragaplayer.asp

దిక్కుల్నే దాటిందీ ఆనందతాండవం..
http://www.ragalahari.com/jukeboxv3/ragaplayer.asp

ఈ సినిమాలో నాకు నరేష్ నటన కూడా నచ్చింది :-)

శివ చెరువు said...

one of the greatest songs I have ever heard...

పరిమళం said...

అవునండీ... మంచిపాట !సినిమా కూడా బావుంటుంది కొన్ని సినిమాలు హిట్టు , ఫ్లాపులకతీతంగా చూడాలి వాటిలో ఇదొకటి !

anveshi said...

knock knock..

blog update లేదు, ఏమయ్యారు?

విశ్వ ప్రేమికుడు said...

నా నోట్లో ఎప్పుడూ నానే పాటల్ల్లో ఇది ఒకటి. ఈ సినిమా లో పాటలు చాలా బాగుంటాయి. అందులో నాకు బాగా నచ్చింది ఈ పాట. మరో సారి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.