Monday, February 15, 2010

కేడి

మా నాగార్జున సినిమా రిలీజ్ అయింది... పండగ :D
ఎలా అయినా సరే రిలీజ్ రోజే చూడాలని చాలా రోజుల నుండి వెయిట్ చేసాను.

చిన్నప్పుడైతే... అంటే నేను ఏ 3rd or 4th క్లాసులోనో ఉన్నప్పుడు... అప్పట్లోనే శివ సినిమా రెండు సార్లు చూసాను ధియేటర్ లో(అప్పట్లో ఒకే సినిమా రెండు సార్లు చూడటమే గొప్ప మరి!)
ఆ తర్వాత కాలేజీలో ఉన్నప్పుడు నాగార్జున సినిమా ఫస్ట్ డే చూడాలని నేను, మా ఫ్రెండ్ తెగ పోటీ పడే వాళ్ళం. అలా తనకంటే ముందు చూడాలని ఒకసారి ఎదురులేని మనిషి సినిమాకి ఫస్ట్ డే వెళ్లాను, ఇంట్లో గోల గోల చేసి. మా కజిన్స్ ఇంటికి వస్తే, వాళ్ళ దగ్గర గొడవ గొడవ చేసి... నన్ను ఇప్పుడు ఆ సినిమాకి తీసుకెళ్తారా లేదా అని గోల చేసి మరీ ఆ సినిమాకి వెళ్లాను. తర్వాత ఎప్పుడూ వాళ్ళు నాతో ఏ సినిమాకి రాలేదు!

ఇంకోసారి... మన్మధుడు రిలీజ్ డే. ఎలా అయినా సరే ఫస్ట్ డే చూడాల్సిందే. ఫ్రెండ్స్ అందరం కలిసి ఈవెనింగ్ షో కి వెళ్ళాము. టికెట్స్ దొరకలేదు :(. అప్పుడు ఇంటికి వెళ్లి మళ్ళీ సెకండ్ షో టైంకి వద్దామంటే మా జనాలంత కదిలేసరికి మళ్ళీ ఆ టికెట్స్ కూడా అయిపోతాయి. అందుకే ఇంటికి వెళ్ళకుండా... అక్కడే ధియేటర్ పక్కన రోడ్ కి అవతల ఏదో స్కూల్ ఉంటే... వెళ్లి దాని మెట్ల మీద కూర్చున్నాం... సెకండ్ షో టైం వరకు. ఆరోజు సినిమా చూసాకే ఇంటికి వెళ్లాం.

అలా ఆ రోజులన్నీ రింగులు రింగులుగా గుర్తు తెచ్చుకుంటూ 'కేడి' కోసం ఎదురుచూసాను.



అనుకున్నట్టే రిలీజ్ రోజే వెళ్లాను.
ధియేటర్ బిగ్ సినిమా.
సినిమా మొదలయింది. హుహ్... ఇలాంటి పెద్ద theaters కి రాకూడదు అందుకే. పేరు పడినప్పుడు కానీ, నాగార్జున కనపడగానే కానీ ఒక్కడూ అరవడే. అంతా ఏదో పోగొట్టుకున్నట్టు సైలెంట్ గా చూస్తున్నారు. చ చ. అదే మా కాలనీ దగ్గర ధియేటర్ లో ఐతేనా అరుపులు, కేకలు... హబ్బో! అప్పుడు కదా సినిమా చూసిన ఫీలింగ్ వచ్చేది.
సరేలే... ఏం చేస్తాం అని నేను కూడా కామ్ గా చూస్తున్నాను.

హబ్బ... నాగార్జున ఎంత బాగున్నాడో! అసలు వేరే వాళ్ళంతా సినిమా promotion కోసం హీరోయిన్స్ ని వాడుకుంటారు... అమ్మాయిల ఫొటోస్ వేస్తారు పోస్టర్స్ మీద. కానీ నాగార్జున సినిమా పోస్టర్స్ మీద మాత్రం నాగార్జుననే ఉంటాడు! ఎంతైనా మన్మధుడు కదా!
అలా నాగార్జునని చూస్తూ... సినిమా కూడా చూస్తున్నాను.
టైటిల్ సాంగ్ బాగుంది. నాకైతే నచ్చింది. అబ్బాయిలకి కూడా పండగే... అనుష్క కొత్తగా కనిపిస్తుంది ఆ సాంగ్ లో.
కాస్త సినిమా అయింది. ఏంటిది... ఏం జరగటం లేదు... హ్మం ఏమోలే... ఇంటర్వల్ లో ఏం ట్విస్ట్ ఉందో ఏంటో... అనుకుంటూ చూస్తున్నాను.
ఒక గంట సినిమా అయ్యేవరకు కూడా హీరోయిన్ కనిపించలేదు. of course ఆ హీరోయిన్ కనిపిస్తే ఎంత కనిపించకపోతే ఎంత... మమతనే కదా.
ఇంటర్వల్ వచ్చింది. ఇప్పటి వరకు పెద్ద ఇంటరెస్టింగ్ గా ఏమి లేదు సినిమా. మా నాగార్జున సినిమా నాకే ఇలా అనిపిస్తే ఇంకా మిగిలిన వాళ్ళకి ఏమనిపిస్తుందో ఏంటో! ప్చ్.
ఇంటర్వల్ తర్వాత కూడా అలా 'సాగుతుందే' కానీ, పెద్ద ఇంటరెస్టింగ్ గా ఏమీ అవటం లేదు.
ఇంకో అరగంటలోనో ముప్పావుగంటలోనో సినిమా అయిపోతుంది అనగా... ఈ పాట... "ఎందుకో ఎంతకీ తేలదే మరి ఈ కథ ఏంటో". సినిమా సంగతి ఎలా ఉన్నా... భలే టైమింగ్ ఆ సాంగ్ మాత్రం. చూసేవాళ్ళంతా ఆ పాటే పాడుకుంటారు.
మొత్తానికి సినిమా అయిపోయింది.
హాల్ నుండి బయటకి వస్తుంటే... ఎవరో అంటున్నారు... బాస్ కంటే దారుణంగా ఉందిరా బాబు అని. హ్మం :(

సినిమాలో నాకు నచ్చినవి:
నాగార్జున :D
రెండు, మూడు పాటలు
కెమెరా వర్క్ (ఎక్కువ శాతం మూవీ సెపియా టోన్ లో ఉంటుంది)
నీవేనా నీవేనా పాటలో locations
నాగార్జున చిన్నతనంలో చేసిన అబ్బాయి
ఫారిన్ అమ్మాయి (భలే బాగుంది)

నాకు నచ్చనివి:
మమత మోహన్దాస్
కామెడీ లేకపోవటం (హర్షవర్ధన్, బ్రహ్మానందంలని చూసి చాలా expect చేస్తాం కానీ, చెప్పుకో తగ్గ కామెడీ ఏమీ లేదు.)
స్టొరీ (అస్సలు ఇంటరెస్టింగ్ గా లేదు, at least డైరెక్టర్ ఇంటరెస్టింగ్ గా చెప్పలేకపోయాడు.)
విల్లన్ (లిప్ మూమెంట్ చాలా చోట్ల సింక్ కాలేదు. అలా ఉంటే డబ్బింగ్ సినిమా చూస్తున్నట్టు అనిపిస్తుంది.)
నీవేనా నీవేనా పాటలో కాస్ట్యూమ్స్ (locations ఎంత బాగున్నాయో, కాస్ట్యూమ్స్ అంత బాలేదు)
ఎందుకో ఎంతకీ .. పాట అనవసరం అనిపిస్తుంది.

మొత్తానికి సినిమా నాకైతే అస్సలు నచ్చలేదు. బాస్, డాన్ సినిమాలని మించిపోయింది.

నాగార్జున ఇంత దారుణంగా మోసం చేస్తాడని అనుకోలేదు :(.

8 comments:

kiraN said...

నేను కూడా మొదటి రోజే వెళ్లి మోసపోయా.. హుహ్..


- కిరణ్
ఐతే OK

చైతన్య.ఎస్ said...

మాకు ముందే తెలుసు అందుకే వెళ్ళ లేదు :)

>>బాస్, డాన్ సినిమాలని మించిపోయింది.
:)

నాగప్రసాద్ said...

హహహ. నిన్న పరుగు పవన్ ఈ సినిమాకి వెళ్ళి, ఇంటర్వెల్‌ అవంగానే హాల్ బయటికి పరుగెత్తుకుంటూ వచ్చాడంట తలనొప్పి భరించలేక. :))).

అయినా ఇంకా నాగార్జున లాంటి ముసలి హీరోల సినిమాలు ఎవరు చూస్తారండి ఈ కాలంలో. :)))

ప్రభాకర్ said...

ముందు గానే చెప్పి మమ్మల్ని రక్షించారు..దన్యవాదములు..(లేకపోతే మేము మీలాగే మోసపోయి ఉండేవాళ్ళం..)

Indian Minerva said...

మీ సంగతేమోగానీ నేను మాత్రం సేఫబ్బా... నాగార్జున ఆకురౌడీగా నటించిన ఒక సినిమా, సైడ్ క్యారక్టరుగా నటించిన ఇంకొక సినిమా చూసిన "ఖసితో" ఇక చూడకూడదని ఒట్టేసుకొన్నాను. ఇప్పట్లో దాన్ని గట్టుమీదపెట్టే ఆలోచన నాకులేదు. చెప్పొద్దూ.. అంతకు ముందు నేనుకూడా ఓ మోస్తరు పంకానే.

శరత్ కాలమ్ said...

సో, మీరు నాగ్ వీరాభిమానన్నమాట.

కేడీ బారిన పడకుండా రక్షించారు మమ్మల్ని కూడా. మమతా మోహందాస్ నాకూ నచ్చదు కానీ ఆమె పాటలు బావుంటాయి.

చైతన్య said...

@kiraN
కెమెరా వర్క్, పాటలు కొన్ని బాగానే ఉన్నాయి కదా... సరిపెట్టుకోండి.

@ చైతన్య.ఎస్
ఎప్పుడు తెలిసినా వెళ్ళాలి. నాగార్జున సినిమా ఒక్కసారైనా చూడాలి.

@ నాగప్రసాద్
ఆ పవన్ పరిగెత్తింది అందుకు కాదులెండి... అక్కడ ఎవరో కిషోర్ అనే పేరు వినపడింది అంట ;)

>>అయినా ఇంకా నాగార్జున లాంటి ముసలి హీరోల సినిమాలు ..
మీరు మా మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు... మీ మీద కేసు వేస్తాను :X

@ ప్రభాకర్
అలా కాదులెండి. నా అభిప్రాయం నేను చెప్పాను. నాకు నచ్చనిది మీకు నచ్చకుడదని రూల్ ఏమీ లేదుగా. మీరు చూసి మీ అభిప్రాయం చెప్పండి.

@ Indian minerva
మీరలా ప్లేట్ మార్చేస్తే ఎలా మరి? పంకాలు ఎప్పుడు పంకాలుగానే ఉండాలి. సినిమా చూసిరండి ఒకసారి.

@ శరత్ 'కాలం'
మీరు చూసి మీ అభిప్రాయం చెప్పాలి కాని, ఎవరో చూసి ఏదో చెప్తే అది నమ్మేసి impressions form చేసేసుకుంటే ఎలాఅండి?

మురళి said...

ప్చ్.. మీకే నచ్చలేదంటే... ('సినిమా ఎలా ఉండి ఉంటుందో' అని మనసులో అనుకున్నానండి, మళ్ళీ మీ మనో భావాలు దెబ్బ తినకుండా :))