BCA కోర్సు మొదలుపెట్టాక మొదటి batch మాది. సరైన lecturers కూడా ఉండేవారు కారు. సబ్జక్ట్స్ అన్ని MCA వి కావటం వలన ఎక్కువగా ఎవరు దొరికేవారు కారు. MCA చదివినవాళ్ళు సాఫ్ట్వేర్ జాబులకి వెళ్తారు కాని మాకు పాఠాలు చెప్పటానికి ఎందుకు వస్తారు. మాకేమో సబ్జక్ట్స్ అన్ని కొత్తాయే... management, operating systems ఇలాంటి సబ్జక్ట్స్ ఏవి ఇంటర్ వరకు చూడనేలేదు... అసలు కంప్యూటర్ చూసిందే ఇప్పుడు... ఇంకా సబ్జక్ట్స్ ఏం అర్థం అవుతాయి... ఒక్కసారిగా అంతా ఏదో ఫ్రెంచో జపనీసో నేర్చుకుంటునట్టు ఉండేది మాకు. ప్రతిసారీ ఎగ్జామ్స్ అప్పుడు ఒకే దెగ్గర కలిసి చదువుకోవటం మా ముగ్గురికి (హేమ, సుమ, నేను) అలవాటు. నాలుగో సెమిస్టరు నుండి అనుకుంటా... ఒక optional సబ్జెక్టు ఉండేది... అందులో ప్రతి చాప్టర్ లోను బోలెడు సైడ్ headings ఉండేవి... నాకు, హేమకి కొంచం పర్లేదు.. ఎలాగో బట్టి కొడితే గుర్తుండేవి... కానీ మా సుమ కి మాత్రం సరిగా గుర్తుండేవి కాదు... రెండో చాప్టర్ లో headings బట్టి కొట్టేసరికి... మొదటి చాప్టర్ లో నేర్చుకున్నవి మర్చిపోయేది... ఒకరోజు చాలా ఆనందంగా మా దగ్గరకి వచ్చి 'నాకు అన్ని headings వచ్చేసయిగా' అంది... మేము 'నిజమా ఏది ఇది చెప్పు చూద్దాం' అని ఏదో ప్రశ్న అడిగాం... కొన్ని క్షణాలు తనలో తనే ఏదో నెమరవేసుకుని... చెప్పేసింది... తనకి ఏదో టెక్నిక్ తెలిసిందని అర్థమయిపోయింది మాకు... మేము కూడా 'ఎలా ... ఎలా చెప్పేసావ్... మాక్కూడా చెప్పవా... ప్లీజ్...' అని వెంటపడ్దాం.. అది కాసేపు పోస్ కొట్టి... తర్వాత మమ్మల్ని కొట్టి... ఇంకా రెండు chocolates కొట్టేసి అప్పుడు చెప్పింది... ' ఏం లేదు చాలా సింపుల్... అన్ని headings మొదటి అక్షరాలతో ఒక పదం తయారు చేసుకుని అది గుర్తుఉంచుకుంటే సరిపోతుంది... మొదటి అక్షరం గుర్తురాగానే ఆటోమాటిక్ గా heading అదే గుర్తోచ్చేస్తది' అని చెప్పింది. ఇది మాకు బాగా నచ్చింది... ఇదేదో సులువైన మార్గంలా ఉందని... మేము కూడా అలాగే చదవటం మొదలు పెట్టాం... ఈ టెక్నిక్ హేమ కి కూడా వర్క్ ఔట్ అయింది కానీ నాకు కాలేదు... ఎంత ప్రయత్నించినా అలా మొదటి అక్షరాలతో చేసిన పదం నుండి headings గుర్తుతెచుకోవటం కష్టంగానే అనిపించింది. ఎందుకొచ్చిన రిస్క్ అనుకుని నేను మాములుగానే చదువుకున్నాను.
పరీక్ష రోజు రానే వచ్చింది... exam రాసి బయటకి రాగానే ఎలా రాసాం అన్నదే మొదటి చర్చ కదా... మొదట నేను, హేమ బయటకి వచ్చాం... నేనేమో 'పర్లేదు ఓ మోస్తరుగా రాసాను... కొన్ని headings మర్చిపోయాను, మిగిలినవి రాసాను' అన్నాను. హేమ 'అవును నేను కూడా అంతే... నాకు ఆ మొదటి అక్షరాల పదం గుర్తురాలేదు... మాములుగా headings గుర్తున్నాయి కొన్ని... అవే రాసాను' అంది. ఇంతలో మా సుమ వచ్చింది... ఇది ఖచ్చితంగా అన్నీ రాసేసి ఉంటుంది అని ఉత్సాహంగా దాని దగ్గరకి వెళ్లి అడిగాం... అదేమో అంత ఉత్సాహంగా కనిపించలేదు... 'ఏమైందే... అన్నీ రాసావా లేదా...' అని అడిగాం 'లేదు' అంది సింపుల్ గా 'అదేంటి ఆ మొదటి అక్షరాల పదాలు గుర్తురాలేదా నీక్కూడా నాలాగే' అంది హేమ 'అవన్నీ గుర్తున్నాయి...' 'మరింకా ఏంటి... ఎందుకు రాయలేదు' ఏం అర్థంకాక అడిగాను 'ఆ పదాలే గుర్తున్నాయి... ఆ మొదటి అక్షరాలతో వచ్చే headings గుర్తురాలేదు' అంది సుమ !!
కొద్దిసేపటి క్రితం పప్పుశ్రీను గారి బ్లాగు చదివనప్పుడు నాక్కూడా నా చిన్ననాటి సంగతులన్నీ రింగులు రింగులుగా గుర్తొచ్చాయి... వాటితో పాటే అప్పట్లో తీరని నా చిన్న చిన్న(అప్పట్లో పెద్దగా అనిపించేవి) కోరికలు కూడా ఒక్కొక్కటిగా గుర్తొచ్చాయి... సరదాగా అవన్నీ ఒకసారి బ్లాగుదామనిపించింది... చాలా చిన్నప్పుడు, అంటే నేను 2nd class అలా చదివేప్పుడు పెద్ద జడ కావాలని అనిపించేది... రోజూ చాలా పూలు పెట్టుకోవాలి... పూల జడలు వేసుకోవాలి అని అనిపించేది... కానీ అప్పుడు తిరుపతి మొక్కు వలన కొద్ది కొద్దిగా వచ్చిన జుట్టుతో బాబ్ కట్ ఉండేది. తర్వాత మెల్లిగా పెద్ద జడ వచ్చేసింది కాని... మళ్లీ కాలేజీలో చేరిన కొత్తలో మా పక్కంటి అమ్మాయిని, ఆమె పొట్టి జుట్టుని చూసి inspire అయి నేను కూడా నా జుట్టు కట్ చేసేసుకున్నాను... అదేంటో అప్పటి నుండి అందరూ పొడుగు జుట్టు వాళ్ళే కనిపించేవారు. తర్వాత రోజూ నుండే నాక్కూడా మళ్లీ పెద్ద జడ కావాలనిపించేది... hmm...!
మా స్కూల్ లో, class లో చాలా మంది వాళ్ళ బుక్స్ ని ఒక స్టీల్ బాక్స్ లో తెచ్చుకునేవారు... నాకు మాత్రం బాగ్ ఉండేది. నాక్కూడా అలా బాక్స్ లో బుక్స్ తీసుకెళ్లాలని కోరిక. అన్నకి మాత్రం బాక్స్ ఉండేది... ఎన్నిసార్లు అడిగినా నాకు మాత్రం బాక్స్ కొనివ్వలేదు మా అమ్మ. అన్న కూడా ఒక్కరోజు ఇవ్వమన్నా ఆ బాక్స్ ఇచ్చేవాడు కాదు. వాడు వాడినన్ని రోజులు వాడేసి పక్కన పడేసాడు. అప్పుడు మనం ఆ డొక్కు అయిపోయిన బాక్స్ ని మళ్లీ కొన్ని రోజులు వాడుకుని ఆ కోరిక అలా తీర్చేసుకున్నాం.
అప్పట్లో సైకిల్ మీద స్కూల్ కి వెళ్ళాలనే కోరిక కూడా ఉండేది... కానీ నాకేమో సైకిల్ తొక్కటం రాదు... 7th class లో ఒక స్నేహితురాలి సైకిల్ తీసుకుని కష్టపడి నేర్చుకున్న. అప్పటికే మా అన్నకి సైకిల్ ఉండేది, మరి వాడు అప్పుడు 10th class కదా. అదేంటో నేను సైకిల్ నేర్చుకోగానే మా నాన్నగారికి హైదరాబాద్ transfer అయిపొయింది. ఇక్కడేమో మేము ఉండే కాలనీకి స్కూల్ 10KM దూరంలో ఉండేది... ఇంక సైకిల్ ఎలా వేసుకేల్తం స్కూల్ కి... చచ్చినట్టు బస్ లో వెళ్ళేదాన్ని. ఆ సైకిల్ కోరిక ఇప్పటికీ తీరలేదు...hmm!
ఇంక ఇలాంటి చిన్న(పెద్ద) కోరికలు చాలా ఉండేవి.... లంచ్ బాక్స్ ని స్కూల్ బాగ్ లో కాకుండా ఒక బాస్కెట్ లో పెట్టుకుని తీసుకెళ్లాలని.... ఇంకా మంచి డిజైన్లు ఉన్న స్వెటర్లు వేసుకోవాలని (మరి మా స్కూల్ లో మరూన్ కలర్ తప్ప వేరేది వేసుకోనివ్వరు)... మా అన్నని నేను కొడితే వాడు ఏడవాలి కానీ తిరిగి నన్ను కొట్టకూడదని... ఇలా ఏవేవో కోరికలుండేవి... వాటిలో కొన్ని అప్పుడు తీరాయి... చాలా ఇప్పటికీ తీరలేదు!