Friday, March 6, 2009

బోడి చదువులు వేస్టు.. మీ బుర్రంతా భోంచేస్తూ

BCA కోర్సు మొదలుపెట్టాక మొదటి batch మాది. సరైన lecturers కూడా ఉండేవారు కారు. సబ్జక్ట్స్ అన్ని MCA వి కావటం వలన ఎక్కువగా ఎవరు దొరికేవారు కారు. MCA చదివినవాళ్ళు సాఫ్ట్వేర్ జాబులకి వెళ్తారు కాని మాకు పాఠాలు చెప్పటానికి ఎందుకు వస్తారు. మాకేమో సబ్జక్ట్స్ అన్ని కొత్తాయే... management, operating systems ఇలాంటి సబ్జక్ట్స్ ఏవి ఇంటర్ వరకు చూడనేలేదు... అసలు కంప్యూటర్ చూసిందే ఇప్పుడు... ఇంకా సబ్జక్ట్స్ ఏం అర్థం అవుతాయి... ఒక్కసారిగా అంతా ఏదో ఫ్రెంచో జపనీసో నేర్చుకుంటునట్టు ఉండేది మాకు.

ప్రతిసారీ ఎగ్జామ్స్ అప్పుడు ఒకే దెగ్గర కలిసి చదువుకోవటం మా ముగ్గురికి (హేమ, సుమ, నేను) అలవాటు.
నాలుగో సెమిస్టరు నుండి అనుకుంటా... ఒక optional సబ్జెక్టు ఉండేది... అందులో ప్రతి చాప్టర్ లోను బోలెడు సైడ్ headings ఉండేవి...
నాకు, హేమకి కొంచం పర్లేదు.. ఎలాగో బట్టి కొడితే గుర్తుండేవి... కానీ మా సుమ కి మాత్రం సరిగా గుర్తుండేవి కాదు... రెండో చాప్టర్ లో headings బట్టి కొట్టేసరికి... మొదటి చాప్టర్ లో నేర్చుకున్నవి మర్చిపోయేది...
ఒకరోజు చాలా ఆనందంగా మా దగ్గరకి వచ్చి 'నాకు అన్ని headings వచ్చేసయిగా' అంది...
మేము 'నిజమా ఏది ఇది చెప్పు చూద్దాం' అని ఏదో ప్రశ్న అడిగాం... కొన్ని క్షణాలు తనలో తనే ఏదో నెమరవేసుకుని... చెప్పేసింది...
తనకి ఏదో టెక్నిక్ తెలిసిందని అర్థమయిపోయింది మాకు... మేము కూడా 'ఎలా ... ఎలా చెప్పేసావ్... మాక్కూడా చెప్పవా... ప్లీజ్...' అని వెంటపడ్దాం..
అది కాసేపు పోస్ కొట్టి... తర్వాత మమ్మల్ని కొట్టి... ఇంకా రెండు chocolates కొట్టేసి అప్పుడు చెప్పింది... ' ఏం లేదు చాలా సింపుల్... అన్ని headings మొదటి అక్షరాలతో ఒక పదం తయారు చేసుకుని అది గుర్తుఉంచుకుంటే సరిపోతుంది... మొదటి అక్షరం గుర్తురాగానే ఆటోమాటిక్ గా heading అదే గుర్తోచ్చేస్తది' అని చెప్పింది.
ఇది మాకు బాగా నచ్చింది... ఇదేదో సులువైన మార్గంలా ఉందని... మేము కూడా అలాగే చదవటం మొదలు పెట్టాం... ఈ టెక్నిక్ హేమ కి కూడా వర్క్ ఔట్ అయింది కానీ నాకు కాలేదు... ఎంత ప్రయత్నించినా అలా మొదటి అక్షరాలతో చేసిన పదం నుండి headings గుర్తుతెచుకోవటం కష్టంగానే అనిపించింది. ఎందుకొచ్చిన రిస్క్ అనుకుని నేను మాములుగానే చదువుకున్నాను.

పరీక్ష రోజు రానే వచ్చింది...
exam రాసి బయటకి రాగానే ఎలా రాసాం అన్నదే మొదటి చర్చ కదా...
మొదట నేను, హేమ బయటకి వచ్చాం...
నేనేమో 'పర్లేదు ఓ మోస్తరుగా రాసాను... కొన్ని headings మర్చిపోయాను, మిగిలినవి రాసాను' అన్నాను.
హేమ 'అవును నేను కూడా అంతే... నాకు ఆ మొదటి అక్షరాల పదం గుర్తురాలేదు... మాములుగా headings గుర్తున్నాయి కొన్ని... అవే రాసాను' అంది.
ఇంతలో మా సుమ వచ్చింది... ఇది ఖచ్చితంగా అన్నీ రాసేసి ఉంటుంది అని ఉత్సాహంగా దాని దగ్గరకి వెళ్లి అడిగాం...
అదేమో అంత ఉత్సాహంగా కనిపించలేదు...
'ఏమైందే... అన్నీ రాసావా లేదా...' అని అడిగాం
'లేదు' అంది సింపుల్ గా
'అదేంటి ఆ మొదటి అక్షరాల పదాలు గుర్తురాలేదా నీక్కూడా నాలాగే' అంది హేమ
'అవన్నీ గుర్తున్నాయి...'
'మరింకా ఏంటి... ఎందుకు రాయలేదు' ఏం అర్థంకాక అడిగాను
'ఆ పదాలే గుర్తున్నాయి... ఆ మొదటి అక్షరాలతో వచ్చే headings గుర్తురాలేదు' అంది సుమ
!!

7 comments:

kiraN said...

హహ్హహ్హా.....
ఈ ట్రిక్కు నాక్కూడా తెలుసు.. కాని నేను కూడా మీ ఫ్రెండ్ లానే అసలు హెడ్డింగ్ మర్చిపోయేవాడ్ని.
కాబట్టి ఆ ట్రిక్కుని కూడా మర్చిపోయా.


- కిరణ్
ఐతే OK

సుభద్ర said...

good one,
nenu chadavaledu kani bca,chadivite naadi 1st beach.
by the way naa peru suma(petname)

నేస్తం said...

హ హ హ మీ ఫ్రెండుకి ఈ విషయం లో నా పోలికలే

చైతన్య.ఎస్ said...

నేను B.C.A, మాకు మీలాంటి కష్టాలే :)
S/W పేపర్ కూడ అలాంటిదే :(

Brahmi said...

ఇంకా మీ హెమ చాల బెటర్.
మా ఫ్రండ్ ఒకడున్నాడు. ఎగ్జాం టైం లొ కాపి పెట్టెవాడు.
ఉదాహరణకి ఇలా..
హెడ్డింగ్ 1 (5)
హెడ్డింగ్ 2 (2)
హెడ్డింగ్ 3 (6)
సరె... ఎగ్జాం లొ సీరియస్ గా రాసేస్తున్నాడు, కాపి పేపరు చూసుకుంటూ.
వీడ్ని చూసి వీడి వెనకాల వాడికి ఆశ పుట్టింది..
"ఎరా నాకు చూపించరా" అంటె చూపించాడు..
వెనకల వాడికి బుర్ర తిరిగి "అరెయ్.. ఈ బ్రాకేట్ లొ నంబర్లు ఎంటి బె?" అని అడిగాడు.
ఎమి లెదు రా... నంబరు ఎంత ఉంటె అన్ని లైన్లు రాయలి.. అని అర్ధం..
అది వినేసరికి వెనకాల వాడికి వొళ్ళు మండింది.. "నీ యబ్బ.. దీన్ని కాపి అంటార్ర.." అని చెప్పి ఆ పేపరు వాడి మొహన కొట్టాడు..

అంటె లెంత్ చూసి కరక్షన్ చెసే వాళ్ళకు అది కరక్టేనెమొ.

చైతన్య said...

@కిరణ్, సుమ
:)

@పార్ధు
హ హ్హ బాగుంది మీ ఫ్రెండ్ తెలివి :)

చైతన్య said...

@నేస్తం
:)
@చైతన్య
హ్హ అవును ఆ పేపర్ కుడా అలాంటిదే :(