Monday, March 23, 2009

భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ - 78వ వర్ధంతి


పేరు: భగత్ సింగ్
పుట్టిన తేది: 27 సెప్టెంబర్, 1907
సొంత ఊరు: ల్యాల్ పూర్, పంజాబ్
మరణం: 23 మార్చ్, 1931




పేరు: శివ రాం హరి రాజ్ గురు
పుట్టిన తేది: 24 ఆగష్టు, 1908
సొంత ఊరు: మహారాష్ట్ర
మరణం: 23 మార్చ్, 1931




పేరు: సుఖ్ దేవ్ థాపర్
పుట్టిన తేది: 15 మే, 1907
సొంత ఊరు: లుథియానా, పంజాబ్
మరణం: 23 మార్చ్, 1931



భగత్ సింగ్ ... స్వాతంత్రోద్యమ కాలంలో యువతకి స్ఫూర్తినిచ్చి వారిలో చైతన్యాన్ని కలిగించిన ఒక అమరజీవి.
స్వాతంత్రోద్యమంలో చివరి దాకా పాల్గొనే అవకాశం లేకపోయినా... భగత్ సింగ్ పోరాటం మాత్రం చాలా కీలకమైనది. అలాంటి వ్యక్తికి తగ్గ గుర్తింపు లభించిందా? గాంధీ గారి జయంతికి సెలవు ఉంది... కానీ భగత్ సింగ్ లాంటి నిజమైన హీరో జయంతి, వర్ధంతి ఎపుడో అసలు మనలో ఎంతమందికి తెలుసు?
అప్పుడెప్పుడో భగత్ సింగ్ జీవితం పైన ఒకేసారి మూడు సినిమాలు వచ్చినప్పుడు తప్ప అతని గురించి జనం మాట్లాడుకున్న సందర్భాలు ఎన్ని?

భగత్ సింగ్ ని ఆరాధించే వాళ్ళలో ఎక్కువ శాతం మంది గాంధీ గారిని ద్వేషిస్తారు. దానికి కారణం... భగత్ సింగ్ చావుకి గాంధీ గారు కుడా ఒక రకంగా కారణం అనే నమ్మకం. ఆ నమ్మకంలో ఎంత వరకు నిజం ఉందో నాకు మాత్రం తెలీదు. కానీ ఎక్కడో నాలో కుడా ఆ నమ్మకం ఉంది. అలా అని గాంధీ గారిని ద్వేషించే వాళ్ళ లిస్టులో మాత్రం నేను లేను.

భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లని ఉరి తీయాలని నిర్ణయించే ముందే బ్రిటిష్ అధికారులు గాంధీ గారితో సంప్రదింపులు జరిపారు. గాంధీ గారు కూడా దానికి అంగీకరించారు అనేది కొంత మంది వాదన. దాని గురించిన వివరాలు మాత్రం నాకు స్పష్టంగా తెలియవు.
కానీ గాంధీ గారు తలుచుకుని ఉంటే తప్పకుండా భగత్ సింగ్ చావుని ఆరోజు ఆపగలిగి ఉండేవారు అని నా నమ్మకం. భగత్ సింగ్ లాంటి యువకులు 'అహింసా' మార్గాన్ని అనుసరించలేరు. వారికి తెలిసిన దారిలో వారు పోరాడుతున్నారు. అలాంటప్పుడు కలిసి ముందుకు సాగలేకపోయినా... ఒకరికి ఒకరు సపోర్ట్ ఇవ్వటంలో మాత్రం తప్పు లేదు కదా! అందరూ పోరాడే లక్ష్యం ఒక్కటే అయినప్పుడు... నా మార్గమే ఒప్పు... మిగిలినవి తప్పు... అని వేరేవాళ్ళని అణగదొక్కాలని చూడటం ఎంత వరకు సమంజసం!

అప్పట్లో యువతలో భగత్ సింగ్ కి చాలా మంచి ఆదరణ లభించేది. యువత మొత్తం భగత్ సింగ్ నే ఆదర్శంగా తీసుకునే వారు. భగత్ సింగ్ పోరాటాం కొనసాగి ఉంటే దేశానికి స్వాతంత్ర్యం ఇంకా త్వరగానే వచ్చేదని కొంత మంది నమ్మకం.
తన కంటే భగత్ సింగ్ కి ఎక్కువ పేరు వస్తుందనే భయం, ఈర్ష్య గాంధీ గారిలో ఉండేవా!?
దేశ స్వాతంత్ర్యం తన వల్లనే సాధ్యం అయిందనే పేరు తనకి మాత్రమే రావాలనే స్వార్ధం ఆయనలో ఉందా!?
భగత్ సింగ్, రాజ్ గురు మరియు సుఖ్ దేవ్ ల జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోవటానికి కారణం 'ఈర్ష్య', 'స్వార్ధాలే'నా!?

మీకు తెలుసా!?
భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లని ఉరి తీసిన తర్వాత... ఆ శవాలని జైలు వెనక గోడలని పగలుకొట్టి రహస్యంగా అటు నుండి బయటకి తరలించారు. లాహోర్ నుండి కొద్ది దూరం తీసుకెళ్ళి అక్కడ కాల్చేసారు. త్వరగా కాలటం కోసం కాల్చే ముందు శవాలని ముక్కలు ముక్కలుగా చేసి కాల్చారట.

12 comments:

Vinay Chakravarthi.Gogineni said...

mee blog chadivanu..........ippatidaka baga anipinchindi.especialli meeru fallow ayye blogs ekkuvaga nachhinavi...........

manaki teliyani daani gurinchi inka koncham manakunna anumaanam jodinchi raayadam baagaledemo anipinchindi.............

శ్రీనివాస్ said...

23 సంవత్సరాల వయసులో ఉరి కంబం ఎక్కారంటే .. పాపం వాళ్ళ కోసం కాదుగా దేశం కోసమే కాని ఎవరు పట్టించుకోలేదేందుకో .. .. గుర్తు చేస్కునే అవకాశం కల్పించారు .. ధన్యవాదములు

చైతన్య.ఎస్ said...

వైషమ్యం, స్వార్థపరత్వం ,
కౌటిల్యం , ఈర్ష్యలు , స్పర్థలు
మాయలతో మారుపేర్లతో
చరిత్ర గతి నిరూపించబడింది.
(దేశ చరిత్రలు - మహాప్రస్థానం )

చంద్రశేఖర్ ఆజాద్ ,నేతాజీ ఇలా ఎందరో మరెందరో... అందరి త్యాగం తెరమరుగైపోయింది.

భగత్ సింగ్, రాజ్ గురు మరియు సుఖ్ దేవ్ లకు ఘనమైన నివాళి అర్పిద్దాం.

సోదరి said...

భగత్ సింగ్ నాకు నచ్చిన స్వాతంత్ర్య సమరయోధుడు .. ఆయన తరువాత అల్లూరి సీతారామరాజుగారు.. భగత్ ,రాజ్ , సుఖ్ దేవ్ లకు యావత్ భారతావని ఆజన్మాంతం రుణపడి ఉండాలి.. వారికివే నా ఘన నివాళులు

కన్నగాడు said...

భగత్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల వర్ధంతి సందర్బంగా వారికి నా నివాళులు

anveshi said...

very good post Chaitanya :) :)

Indian freedom struggule was carried by bunch of brave freedom fighters....
revolutionists and no of moderaters like mahadev govind ranade gokale surendra nath benerjee,Tilak ,Bhagat singh ,bose,savarkar all those had different
notions helped to get independece !every one played their extrodinary role !!

unfortunately in India younger generation were taught more on gandhi not on other great leaders !!

anyway ..bhagat singh rajguru,sukhdev amar rahe

vende mataram !

Hima bindu said...

నిజానికి మనకు ఇండిపెండెన్స్ రావటానికి కారణం ఈ అతివాదులే {ఎక్స్త్రీమిస్ట్}.వీరి కృషి మరువరానిది ,గాంధీ గారు చివరలో మాస్ మొవెమెంట్ కి వెళ్లారు . నాకు ఇష్టమైన తలుచుకుని దిగులు పడే వ్యక్తుల్లో భగత్సింగ్ ఒకరు .అతని స్నేహితులు యశ్పాల్ ,రాజ్గురు ,సుఖ్దేవ్ అందరి పోరాటం మరువలేనిది .తెలియని వారికి మంచి పరిచయం.గుడ్ పోస్ట్.

]

చైతన్య said...

@వినయ్ చక్రవర్తి
నా బ్లాగ్ మీకు నచ్చినందుకు సంతోషం!
నాకు తెలిసిన దానికి... నా అభిప్రాయాలు జోడించి వ్రాసాను... అవే నిజాలని... అందరూ ఒప్పుకోవాలని మాత్రం నా ఉద్దేశం కాదు... ఎవరి అభిప్రాయలు వాళ్ళవి కదా :)

@శ్రీనివాస్
అవును... 23 సంవత్సరాల వయస్సులోనే నేల రాలిపోయిన తారలు... వారి త్యాగం మరువ రానిది!

@చైతన్య
మంచి కవిత గుర్తు చేసారు. నేను కూడా ఈ మధ్యే శ్రీ శ్రీ గారి మహా ప్రస్థానం చదవటం మొదలుపెట్టాను.

@సోదరి, కన్నాగాడు
నిజం... మనమంతా వాళ్లకి ఎంతో రుణ పడి ఉన్నాము!

@అన్వేషి
అవును నిజమే... చిన్నప్పటి నుండి గాంధి గారి గురించే చదువుతున్నారు పిల్లలు, కానీ భగత్ సింగ్ లాంటి హీరోల గురించి కూడా తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
స్వాతంత్ర్యం అంటే గాంధీ గారు మాత్రమే కాదు... వీరి లాంటి ఎంతో మంది!

@చిన్ని
పోస్ట్ మీకు నచ్చినందుకు సంతోషం!

మురళి said...

బాగా రాశారు

kiraN said...

భగత్ సింగ్, రాజ్ గురు మరియు సుఖ్ దేవ్ లకు ఘనమైన నివాళి అర్పిద్దాం.

మరిచిపోయిన మరో స్వాతంత్ర్య సమర వీరుడు అల్లూరి సీతారామ రాజు - చిన్న వయసులోనే రాలిపోయిన మరో తార.
http://en.wikipedia.org/wiki/Alluri_Sitaramaraju



- కిరణ్
ఐతే OK

చైతన్య said...

@మురళి
థాంక్స్!

@కిరణ్
అవును సరైన గుర్తింపు పొందని మరొక హీరో అల్లూరి.
ఆయన గుర్తున్నా... ఈ సందర్భానికి సంబంధం లేకపోవటం వలన ప్రస్తావించలేదు.

Unknown said...

గ్రేట్ మిత్రమా వల్ల జ్ఞాపకలను తిరిగి గుర్తు చేసారు