Wednesday, February 18, 2009

చిన్ని చిన్ని ఆశ... చిన్ననాటి ఆశ...

కొద్దిసేపటి క్రితం పప్పుశ్రీను గారి బ్లాగు చదివనప్పుడు నాక్కూడా నా చిన్ననాటి సంగతులన్నీ రింగులు రింగులుగా గుర్తొచ్చాయి... వాటితో పాటే అప్పట్లో తీరని నా చిన్న చిన్న(అప్పట్లో పెద్దగా అనిపించేవి) కోరికలు కూడా ఒక్కొక్కటిగా గుర్తొచ్చాయి...
సరదాగా అవన్నీ ఒకసారి బ్లాగుదామనిపించింది...

చాలా చిన్నప్పుడు, అంటే నేను 2nd class అలా చదివేప్పుడు పెద్ద జడ కావాలని అనిపించేది... రోజూ చాలా పూలు పెట్టుకోవాలి... పూల జడలు వేసుకోవాలి అని అనిపించేది... కానీ అప్పుడు తిరుపతి మొక్కు వలన కొద్ది కొద్దిగా వచ్చిన జుట్టుతో బాబ్ కట్ ఉండేది. తర్వాత మెల్లిగా పెద్ద జడ వచ్చేసింది కాని... మళ్లీ కాలేజీలో చేరిన కొత్తలో మా పక్కంటి అమ్మాయిని, ఆమె పొట్టి జుట్టుని చూసి inspire అయి నేను కూడా నా జుట్టు కట్ చేసేసుకున్నాను... అదేంటో అప్పటి నుండి అందరూ పొడుగు జుట్టు వాళ్ళే కనిపించేవారు. తర్వాత రోజూ నుండే నాక్కూడా మళ్లీ పెద్ద జడ కావాలనిపించేది... hmm...!

మా స్కూల్ లో, class లో చాలా మంది వాళ్ళ బుక్స్ ని ఒక స్టీల్ బాక్స్ లో తెచ్చుకునేవారు... నాకు మాత్రం బాగ్ ఉండేది. నాక్కూడా అలా బాక్స్ లో బుక్స్ తీసుకెళ్లాలని కోరిక. అన్నకి మాత్రం బాక్స్ ఉండేది... ఎన్నిసార్లు అడిగినా నాకు మాత్రం బాక్స్ కొనివ్వలేదు మా అమ్మ. అన్న కూడా ఒక్కరోజు ఇవ్వమన్నా ఆ బాక్స్ ఇచ్చేవాడు కాదు. వాడు వాడినన్ని రోజులు వాడేసి పక్కన పడేసాడు. అప్పుడు మనం ఆ డొక్కు అయిపోయిన బాక్స్ ని మళ్లీ కొన్ని రోజులు వాడుకుని ఆ కోరిక అలా తీర్చేసుకున్నాం.

అప్పట్లో సైకిల్ మీద స్కూల్ కి వెళ్ళాలనే కోరిక కూడా ఉండేది... కానీ నాకేమో సైకిల్ తొక్కటం రాదు... 7th class లో ఒక స్నేహితురాలి సైకిల్ తీసుకుని కష్టపడి నేర్చుకున్న. అప్పటికే మా అన్నకి సైకిల్ ఉండేది, మరి వాడు అప్పుడు 10th class కదా. అదేంటో నేను సైకిల్ నేర్చుకోగానే మా నాన్నగారికి హైదరాబాద్ transfer అయిపొయింది. ఇక్కడేమో మేము ఉండే కాలనీకి స్కూల్ 10KM దూరంలో ఉండేది... ఇంక సైకిల్ ఎలా వేసుకేల్తం స్కూల్ కి... చచ్చినట్టు బస్ లో వెళ్ళేదాన్ని. ఆ సైకిల్ కోరిక ఇప్పటికీ తీరలేదు...hmm!

ఇంక ఇలాంటి చిన్న(పెద్ద) కోరికలు చాలా ఉండేవి.... లంచ్ బాక్స్ ని స్కూల్ బాగ్ లో కాకుండా ఒక బాస్కెట్ లో పెట్టుకుని తీసుకెళ్లాలని.... ఇంకా మంచి డిజైన్లు ఉన్న స్వెటర్లు వేసుకోవాలని (మరి మా స్కూల్ లో మరూన్ కలర్ తప్ప వేరేది వేసుకోనివ్వరు)... మా అన్నని నేను కొడితే వాడు ఏడవాలి కానీ తిరిగి నన్ను కొట్టకూడదని... ఇలా ఏవేవో కోరికలుండేవి...
వాటిలో కొన్ని అప్పుడు తీరాయి... చాలా ఇప్పటికీ తీరలేదు!

11 comments:

నాగప్రసాద్ said...

:))). good one.

చైతన్య.ఎస్ said...

>>మా అన్నని నేను కొడితే వాడు ఏడవాలి కానీ తిరిగి నన్ను కొట్టకూడదని...

ఇది మరీ అన్యాయం కదా :)

చైతన్య.ఎస్ said...

అన్నట్టు చెప్పడం మరిచా నాకు ఒక స్టీల్ బాక్స్ ఉండేది కొన్ని రోజులు తీసుకెళ్ళాక క్లాస్లో శబ్ధం వస్తోందని ...బాక్స్ లేకుండా వస్తే క్లాస్కు రా లేదంటే రావద్దు అనేసాడు మా లెక్కల మాస్టారు :(

లక్ష్మి said...

కొన్ని ఇప్పుడు తీరతాయేమో వెరైటీ గా ట్రై చేసి చూడండి :) అన్నయ్యని ఒక సారి కొట్టి పారిపొండి, ఖచ్చితంగా తిరిగి మాత్రం కొట్టరు, అలానే ఆఫీసు(కాలేజు) కి సైకిలు మీద వెళ్ళటానికి ప్రయతించండి, ఎవరేమనుకుంటే మనకేంటి అనుకుంటే అన్ని కోరికలూ తీర్చేసుకోవచ్చు, ఏమంటారు?

kiraN said...

అన్నని నేను కొడితే వాడు ఏడవాలి కానీ తిరిగి నన్ను కొట్టకూడదని, ఈ కోరిక ఎన్నిసార్లు తీరింది??

- కిరణ్
ఐతే OK

కొత్త పాళీ said...

good one

చైతన్య said...

@కిరణ్
ఆ కోరిక అసలు ఒక్కసారి కూడా తీరలేదండి :(

@లక్ష్మి
ఆఫీసుకి సైకిల్ మీదా :O
అప్పుడంటే స్కూల్ 10KM ఏ, కానీ ఇప్పుడు ఆఫీసు ఇంటి నుండి 15KM... సైకిల్ మీద వెళ్ళాలంటే alternate days మాత్రమే వేల్లగాలనేమో :D
ఇప్పుడు అన్నని కొడితే తిరిగి కొట్టడు నిజమే... కానీ వాడు ఏడవడు కూడా... hmm...
ఏం చేస్తాం... అంతే!

@చైతన్య.ఎస్
అన్యాయం ఏముందండి... ప్రతిసారీ నేనే ఓడిపోవాలా(ఏడవాలా)... ఒకసారి గెలవాలనుకోవటం అన్యాయం ఎలా అవుతుంది :)

@నాగప్రసాద్
:)

Padmarpita said...

బాగున్నాయి మీ చిన్ని చిన్ని ఆశలు..
కాని అప్పుడు తీరి ఉంటే ఇప్పుడు మీరు మాకు చెప్పేవారు కారు కదా!!

asha said...

హ..హ..హ!!
నాకు క్రింద కొంచం జుట్టు వదిలి జడలు వేసుకోవాలని ఉండేది. కానీ మా మమ్మీ ఒప్పుకునేవారు కాదు. రోజూ స్కూలుకి వెల్లగానే అలా వేసుకొని ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ అల్లుకునేదాన్ని. అదేమంత పెద్ద కోరికని. అయినా మా మమ్మీ ఏంటో ఒప్పుకునేవారు కాదు. వాళ్ళ ఆంక్షలు వాళ్ళకుంటే మన ఉల్లంఘనా విధానాలు మనకుంటాయి. అర్ధం చేసుకోరూ.
నాకూ నా లంచ్ బాక్స్ ఇష్టముండేది కాదు. నాకొకసారి అమ్మవారు(చికెన్ పాక్స్) వచ్చినప్పుడు ఏదైనా కోరుకోమన్నారు. కొత్త లంచ్ బాక్సూ, వాటర్ బాటిలూ కావాలని అడిగాను. ట్విస్ట్ ఏంటంటే నన్ను తీసుకు వెళ్ళకుండా తేవడం వల్ల నేను ఊహించుకున్నది తేలేదు. ఏం చేస్తాం. ప్చ్.

చైతన్య said...

@కొత్తపాళీ
thanks

@పద్మార్పిత
నిజమే :)

చైతన్య said...

@భవాని
హ హ్హ..
నాక్కూడా కింద కొంచం జుట్టు వదిలి జడ వేసుకోవాలని ఉండేది... మా అమ్మ కూడా ఒప్పుకునేది కాదు... ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు కూడా ఒప్పుకునేది కాదు...హుహ్...
మీ లంచ్ బాక్స్ కోరిక కోరుకున్నా తీరలేదన్నమాట! :)