
పేరు: నిర్మలమ్మ
పుట్టిన తేది: 1927
పుట్టిన స్థలం: బందరు
మరణం: 19th Feb, 2009
వృత్తి: నటి (1950 - 2002)
మొదటి చిత్రం: గరుడ గర్వభంగం (1950)
చివరి చిత్రం: ప్రేమకు స్వాగతం (2002)
నిర్మలమ్మగారు సినిమాలో కనపడగానే మా బామ్మని చూసినట్టే అనిపించేది. ఆవిడ సినిమాల్లో నటించటం మానేసాక కూడా ఎన్నోసార్లు ఇంకా తను నటించగలిగితే బాగుండు అనుకున్నాను. అంత సహజమైన నటన ఇంకెవరు కనబరచలేరేమో! ఆవిడ సినిమాల్లో హీరోలని ముద్దుగా తిడుతున్నా మన బామ్మ తిడుతున్నట్టే అనిపించేది. దాదాపు మూడు తరాలతో, 700 పైగా సినిమాల్లో నటించిన ఆవిడ నటన తెలుగు వారెవ్వరూ మర్చిపోలేరు. తెలుగు చిత్రసీమకి ఆవిడ లేని లోటు ఎప్పటికీ ఎవ్వరూ భర్తీ చేయలేరు.
ఆవిడ బామ్మగా నటించిన చిత్రాల్లో నాకు నచ్చిన కొన్ని మచ్చుతునకలు:
యమగోల (Sr.NTR)

గ్యాంగ్ లీడర్ (చిరంజీవి)
స్నేహం కోసం (చిరంజీవి)
బిగ్ బాస్ (చిరంజీవి, రోజా)
కిల్లర్ (నాగార్జున, నగ్మా)
సుందరకాండ (వెంకటేష్, మీనా)
దళపతి (రజనికాంత్)
శుభసంకల్పం (కమల్ హస్సన్)
స్వాతిముత్యం (కమల్ హస్సన్)

మాయలోడు (రాజేంద్రప్రసాద్)
ఆ ఒక్కటి అడక్కు (రాజేంద్రప్రసాద్)
నాకు పెళ్ళాం కావాలి (రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్)
శంకరాభరణం (చంద్రమోహన్)
పదహారేళ్ళ వయసు (చంద్రమోహన్, శ్రీదేవి)
శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ (నరేష్)
రాత్రి (రామ్ గోపాల్ వర్మ)
Photo Courtesy: Internet
3 comments:
నాక్కూడా నిర్మలమ్మ అంటే చాలా ఇష్టం. సినిమాలో ఎవరినైనా తిట్టేప్పుడు మా అమ్మమ్మ తిట్లు గుర్తొచ్చేవి.
- కిరణ్
ఐతే OK
"ఆవిడ లేని లోటు ఎప్పటికీ ఎవ్వరూ భర్తీ చేయలేరు."
ముమ్మాటికి నిజం.
ఎంతో సహజత్వం ఆమె నటనలొ.
ఆమె స్థానాన్ని బర్తీ చేయడానికి మరెవరూ లేరు అనిపిస్తుంది.
బామ్మ చూపించె ప్రేమ, ఒకింత చాదస్తం, చలాకితనం, ఒక్కొసారి అలగటం..
ఎంత సహజత్వం అంటె.... మన ఇంట్లొ ఉన్న బామ్మగారె అనిపిస్తుంది..
"స్నేహం కొసం" చిత్రంలొ... పెద్ద చిరంజీవి వచ్చి "అమ్మ ఆకలేస్తుందే.." అన్నప్పుడు.. ఆమె నటన నాకింక కళ్ళ ముందు ఉంది...
తెలుగు ప్రజల మనసుల్లొ ఆమె ఎప్పటికి నిలిచిపొతుంది...
రాష్ట్ర ప్రభుత్వం కూడ ఆమెకి తగిన గుర్తింపు ఇవ్వాలని ఆశిస్తున్నాను...
- పార్ధు
Post a Comment