Monday, May 3, 2010

ఎవరి లైఫ్ వాళ్ళది కాదా!?

చిరంజీవి "ఇద్దరు మిత్రులు" సినిమా చూసినప్పుడు ఇంకెప్పుడూ సినిమాలు చూడకూడదు అనిపించింది. చిరంజీవి ఏంటి ఇంత చెత్త సినిమా చేసాడు అనుకున్నాను. స్టొరీ మరీ ఓవర్ గా చెప్పాడు అని కూడా అనిపించింది.
కానీ ఈ మధ్య ఎదురవుతున్న కొన్ని సంఘటనలు, అనుభవాలు చూసాక... ఆ సినిమా ఒకసారి మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఎంతైనా బయట అందరి జీవితాల్లో జరిగేదే కదా సినిమాల్లో చూపిస్తారు. అంతా కాకపోయినా చాలా వరకు!

ఆ సినిమాలో ఒక అమ్మాయి, అబ్బాయి స్నేహితులుగా ఉంటే వచ్చే చిక్కుల గురించి చూపించారు. ఒకప్పుడు అది అంతా ఓవర్ గా అనిపించినా..ఇప్పుడు అది చాలా వరకు నిజమే అనిపిస్తుంది నాకు. సినిమాలో అంటే వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ కూడా వాళ్ళని, వాళ్ళ స్నేహాన్ని అర్థం చేసుకోలేదని చూపించారు. వాళ్ళు అర్థం చేసుకోగానే కథ సుఖాంతం అయిపోతుంది.
కానీ నిజానికి బయట అలా ఉండదు. ఇలాంటి స్నేహాలు కొనసాగాలంటే కేవలం భార్య భర్తల మధ్య understanding ఉంటే సరిపోదు... చుట్టూ ఉండే జనాలు కూడా అర్థం చేసుకోవాలి.



ఒకప్పుడు కాలేజిలో అమ్మాయి, అబ్బాయి కలిసి నాలుగు సార్లు కనిపిస్తే సరదాగా ఏడిపించటం చూసాను. కానీ ఎంతో చదువుకున్న వాళ్ళు, పెద్ద వాళ్ళు కూడా... ఏమీ తెలుసుకోకుండా అలా కాస్త చనువుగా కనిపించే అమ్మాయి, అబ్బాయిని కలిపి రకరకాల రూమర్స్ ప్రచారం చేయటం ఇప్పుడు చూస్తున్నాను. ఆ అబ్బాయికి ఆల్రెడీ పెళ్ళైనా... లేదా ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళైనా అది వాళ్లకి అనవసరం. కళ్ళతో ఏదో చూస్తారు... నోటి దగ్గరకి వచ్చేసరికి దాన్ని మార్చేసి ప్రచారం చేస్తారు. అది ఎదుటి వారి చెవులని చేరేసరికి మరో రకంగా మారిపోతుంది. ఒక మనిషికి తన లైఫ్ కంటే ఎదుటి వారి లైఫ్ అంటేనే ఎక్కువ ఆసక్తి అని ఇలాంటివి చూసినప్పుడు అర్థమవుతుంది! ఎంత కార్పోరేట్ ఆఫీసులు అయినా... ఎంత చదువుకున్న వాళ్లైనా... ఎంత పెద్ద హోదాల్లో ఉన్నా... వాళ్ళు ఆలోచించే నైజం మారదుగా!

నిజానికి వాళ్ళ family వాళ్ళ స్నేహాన్ని అర్థం చేసుకున్నా కూడా... ఇలా పిచ్చి పిచ్చి ప్రచారాలు చేసే పనిలేని జనాల వలన... అటువంటి ప్రచారాల వల్ల కలిగే ఇబ్బందుల వలన... మంచి స్నేహాన్ని వదిలేసుకుంటారు కొంతమంది. ఎవరేమనుకుంటే ఏంటి... తను చేసేది తప్పు కాదని తనకి తెలిసినప్పుడు, అర్థం చేసుకోగల భార్య, లేదా భర్త ఉన్నప్పుడు... ఇలాంటివన్నీ పట్టిచుకోనక్కర్లేదని వదిలేస్తారు మరి కొంతమంది. నా అభిప్రాయంలో అదే కరెక్ట్.

ఆడ, మగ కలిసి కనిపిస్తే చాలు... తప్పుగా అనుకునే వాళ్ళ చీప్ థింకింగ్ కి అంత ఇమ్పార్టన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటారు. కానీ మంచి స్నేహితులు ఎప్పుడో కానీ దొరకరు. అలాంటి పని పాట లేని జనం కోసం అరుదుగా దొరికే విలువైన స్నేహాన్ని వదులుకోవలసిన అవసరం లేదు. After all, we have only one life! Why let someone else decide how should it be?


--

ఈమధ్య ఒక కొత్త చట్టం వచ్చింది కదా. ఇకనుండి ఆడ, మగానే కాదు... ఇద్దరు ఆడవాళ్ళూ లేదా ఇద్దరు మగవాళ్ళు కాస్త చనువుగా కనిపించినా కూడా ఇలాంటి రూమర్స్ వస్తే ఆశ్చర్యపోనక్కర్లేదు. మన జనానికి ఇంకో పనేమీ లేదు కదా మరి.

17 comments:

Hima bindu said...

చుట్టూ వుండే జనాలు అర్ధం చేసుకోకపోతే నాకేం .............నా లైఫ్ నా ఇష్టం ,సమాధానం చెప్పవలసినవారికి మాత్రమె చెబుతాను :-):)

శ్రీనివాస్ said...

well ఇలాంటి కామెంట్స్ వల్ల ఒక మంచి స్నేహితురాలిని దూరం చేసుకున్న బాధాకరమైన ఫ్లాష్ బ్యాక్ నాకూ ఉంది. చిన్ని గారికి ఉన్న ధైర్యం అందరికీ ఉండదు కదండీ .మొత్తానికి మంచి టపా వేశారు

karthik said...

>>ఇద్దరు ఆడవాళ్ళూ లేదా ఇద్దరు మగవాళ్ళు కాస్త చనువుగా కనిపించినా కూడా ఇలాంటి రూమర్స్ వస్తే ఆశ్చర్యపోనక్కర్లేదు.
Already start ayyayi.. may be you didnt come across!

@vikatakavi:
Sad to know someone like you becoming a victim :(

-Karthik

Malakpet Rowdy said...

Tell me about it -

హీహీహీ - ఇలాంటి విషయాల్లో నాకు తల పండిపోయింది. Third Parties వల్ల ఎన్ని వివాదాల్లో ఇరుక్కున్నానో లెక్కే లేదు. కానీ My luck is that - My wife knows what I am - బయట వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోదు. ( నా మీద గుడ్డి నమ్మకం కాస్త ఎక్కువనుకోండి హీహీ)

ఆ.సౌమ్య said...

ఎవరేమనుకుంటే మనకేమండీ. మనకోసం ఎవరూ జీవించరు. మనం ఎవరికోసమో జీవించట్లేదు. మన జీవితం మనకి నచ్చినట్టు గడిపితే అదే ధన్యత. ఇక్కడ బ్లాగ్లోకంలో మాత్రం అందరూ, అందరు గురించి అన్ని రకాలుగా అనుకోవట్లేదూ. అయినా ఎవరైనా బ్లాగులు రాయడం ఆపేస్తున్నారా, లేదు కద. ఎవరి జీవితాలు వాళ్ళవి.

తెలుగు వెబ్ మీడియా said...

నేను నాస్తికుడిని. పెళ్ళి, తద్దినాలు లాంటి సంప్రదాయ కార్యక్రమాలకి వెళ్ళను. అందువల్ల నా బంధువులు నన్ను తిడుతుంటారు. అయినా నేనేమీ సిగ్గు పడలేదే. ఇంకా చాలా విషయాలలో నన్ను తిట్టేవాళ్ళు ఉన్నారు. మహేష్ గారిపై రామరాజు గారు వ్యక్తిగత విమర్శలు చేసిన టైమ్ లో మహేష్ గారు, నేను గూగుల్ చాట్ లో మాట్లాడుకున్నాం. తనని ఎంత మంది విమర్శించినా తాను పట్టించుకోనని మహేష్ గారు కూడా అన్నారు.

శ్రీనివాస్ said...

అడ మగ స్నేహాలకి తద్ధినాలకి ముడిపెట్టిన తమ జిజ్ఞాస కి జోహార్

చైతన్య said...

@చిన్ని
కరెక్ట్. అలాగే ఉండాలి.

@శ్రీనివాస్
పిటి యు.

@కార్తీక్
అవునా... ఇది నాకు తెలీదు!

@మలక్పేట్ రౌడీ
nice to know that your wife is understanding. చుట్టూ ఉండే జనాలంతా కూడా అలా ఉంటే ఎంత బాగుంటుంది!

@సౌమ్య
కరెక్ట్. అవన్నీ పట్టిచుకోము కానీ... జనాలు ఎందుకు ఇంత చీప్ గా ఆలోచిస్తారని అనుకుంటాను!

@చెరసాల శర్మ
నా పోస్ట్ కి, మీ కామెంట్ కి సంబంధం అర్థం కాలేదు. మీ ఉద్దేశం 'ఎవరేమనుకున్నా పట్టించుకోనక్కర్లేదు' అనే అయితే... ఎస్ ఐ అగ్రీ.

తెలుగు వెబ్ మీడియా said...

నేను చెప్పాలనుకున్నది అదే. ఎవరు ఏమన్నా నేను ఎవరి ముందూ తల వంచను అని.

మధురవాణి said...

@ చైతన్య గారూ,
అసలు నాకేమనిపిస్తుందో తెలుసా! ఇలాంటివన్నీ మాట్లాడే వాళ్లకి అలా మాట్లాడటం వల్ల జరిగే పరిణామాలు కూడా తెలుసు. కాకపోతే వేరే వాళ్ళ గురించి అలా మాట్లాడుకోడంలో చాలా ఆనందం దొరుకుతుంది వాళ్లకి. గాసిప్ చేయడం చాలా మందికి హాబీ లాంటిది. వేరే వాళ్ళ సొంత విషయాల గురించి తెలుసుకోవడం, చూసినవీ విన్నవీ కలిపేసి ఎదుటి వాళ్ళ గురించి ఏదో ఒకటి ప్రచారం చేయడం.. ఇవన్నీ వాళ్లకి సంతోషం కలిగిస్తాయి. కాకపోతే, మంచి విషయాల గురించి మాట్లాడరు. కేవలం దుష్ప్రచారమే ఇష్టంగా ఉంటుంది. కాబట్టి.. ఇలాంటి వాళ్ళ గురించి అనుకోడమే దండగ. కానీ, మీరన్నట్టు వీటిని ఇగ్నోర్ చేయగలడం కూడా అంత సులభం కాదు అన్ని సందర్భాల్లోనూ! కొన్నిసార్లు అనవసరంగా మంచి స్నేహితుల్ని కోల్పోతుంటాం..అదే చిక్కు :-(

సమైక్యవాది said...

@Sarma

సిగ్గెప్పుడో చిన్నప్పుడే వదిలేసుంటావులే....ఇంకా ఉంటుందని ఆశించడం మా అత్యాశే

తిరిగే కాలు,ఆడే నోరు ఊరకే ఉండవని సామెత. నీకు, ఆ కత్తి గాడికి అప్పుడప్పుడూ ఎవరిచేతనో దొబ్బించుకునేదాకా నిదరపట్టదేమో...

చైతన్య said...

@చెరసాల శర్మ
గుడ్.

@మధురవాణి
నిజం. అదొక రకమైన పైశాచిక ఆనందమేమో వాళ్లకి!

@సమైక్యవాది (& others)
మీరు పర్సనల్ కామెంట్స్ చేయాలనుకుంటే వాళ్ళ వాళ్ళ బ్లాగ్స్ లో చేస్తే బాగుంటుంది.
దయచేసి నా బ్లాగ్ లో నా పోస్ట్ మీద మాత్రమే స్పందించండి.

Praveen Mandangi said...

నేను సెవెంత్ క్లాస్ చదివే రోజుళ్ళో కూడా ఇలాగే జరిగింది. అప్పట్లో సెవెంత్ కి కూడా పబ్లిక్ ఎక్సామినేషన్స్ ఉండేవి. ఎక్సామినేషన్ హాల్ లో నంబర్ అలాట్మెంట్ ప్రకారం ఇద్దరు అమ్మాయిల మధ్య కూర్చుని పరీక్ష వ్రాయాల్సి వచ్చింది. అమ్మాయిల మధ్య కూర్చున్నందుకు నా ఫ్రెండ్స్ నన్ను అనుమానించారు.

నేను said...

ఆకాశం వైపు రాయి వేస్తే పడేది నెత్తి మీదే కదా, చిన్నపట్నుంచీ విని, తెగ అదైపోయి, తెగ ఇదైపోయి, చివరికి జ్ఞనోదయం ఐంది, కొత్త rumour దొరికే వరకు ఎదోటి వాగుతూనే ఉంటారు జనాలు అని... ఈగ కధలా ఉంటుంది విషయం, ఇద్దరు కలిసి ఉనప్పుడే కాదు, ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినప్పుడు కూడా వీళ్ళు భలే చేరవేస్తారు, నీ గురించి తను ఇలా అన్నాడు, అలా అన్నడు అని...

తెలుగు వెబ్ మీడియా said...

సంస్కారం లేనివాళ్ళు తల వెంట్రుకల లెక్కంత మంది కనిపిస్తారు. ఒకసారి ట్రైన్ లో TTEకి నాకు మధ్య 45 రూపాయల విషయంలో గొడవ జరిగింది. TTE సంస్కారం లేకుండా అమ్మ పేరుతో బూతులు తిట్టాడు. ఆడ-మగ స్నేహం గురించి చెడుగా మాట్లాడేవాళ్ళు కూడా ఆ TTE లాంటివాళ్ళే అనుకోండి.

చైతన్య said...

@ప్రవీణ్ శర్మ
exam వ్రాస్తేనే అందులో అనుమానించటానికి ఏముంది? నాకు అర్థం కాలేదు!

@నేను
నిజం. వాళ్ళ (అ)జ్ఞానానికి వాళ్ళని వదిలేయటం తప్ప ఎం చేయలేం.

@చెరసాల శర్మ
!!

Unknown said...

చైతన్య గారూ...,

నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

- హారం ప్రచారకులు.