అబ్బా... ఏంటి ఈ ఎండలు అప్పుడే మొదలయ్యాయి అనుకుంటుంటే... ఉన్నట్టుండి ఈరోజు వర్షం కురిసింది. కానీ అదేదో పాటలో చెప్పినట్టు చుట్టంలా వచ్చి చూసెళ్లిపోయింది. ఆ కురిసే వానేదో ఎంచక్కా ఫుల్లుగా కురిసేయోచ్చు కదా!
"వర్షం" - ఆ పదంలోనే ఏదో తెలియని ఆకర్షణ ఉందేమో అనిపిస్తుంది. మరి పేరే అలా ఉంటే వర్షం ఇంకెలా ఉంటుంది.
వర్షం కురిసినప్పుడు వచ్చే కమ్మని మట్టి వాసన నచ్చని మనిషి ఉంటాడా అసలు!
నీరెండలో వర్షం కురిసినప్పుడు వచ్చే ఇంద్రధనుసు ఎంత అందంగా ఉంటుంది!
అందుకే వర్షానికి అంతమంది ఫాన్స్. నేనయితే ఏ సి.
ఏంటో... దాన్ని ఎంత చూసినా తనివి తీరదు.
నాకు వానలో తడవటం అంటే భలే సరదా. కానీ చలేసేస్తుంది. వర్షం కొంచం వెచ్చగా పడొచ్చుకదా! అప్పుడు ఎంచక్కా ఎంతసేపైనా తడవొచ్చు! ఏం చేస్తాం... అనుకుంటే జరిగిపోదు కదా!
ఈ దేవుడికి కుళ్ళు అనుకుంట. తనేమో మేఘాల కంటే పైనెక్కడో ఉంటాడు మరి... తను తడవలేడు కదా వర్షంలో. అందుకే నన్ను కూడా(మిమ్మల్ని కూడానా?) తడవకుండా చేస్తున్నాడు. తడిస్తే చలి వేయటం, జలుబు, జ్వరం రావటం లాంటి reactions పెట్టాడు. హుహ్.
అందుకే ఆ కురిసే వర్షాన్ని అలా చూస్తూ సంతోషపడటమే!
వర్షం గురించి ఎవరో ఎక్కడో చెప్పిన ఒక విషయం గుర్తొస్తుంది... "వర్షం ఎలాంటి భావాన్నైనా ప్రతిబింబించగలదు" అని. నిజమే కదా! మనం సంతోషంగా ఉన్నప్పుడు వర్షాన్ని చూస్తుంటే... ఇంకా సంతోషంగా అనిపిస్తుంది... మన ఆనందం రెట్టింపు అయిందేమో అనిపిస్తుంది. అదే బాధలో ఉన్నప్పుడు వర్షాన్ని చూస్తుంటే మన మనసులోని బాధే అలా వర్షంలా కురుస్తుందేమో అనిపిస్తుంది!
నిజంగానే వర్షం ఏ భావాన్నైనా పలికించగలదు! అందుకే అదంటే నాకు బోలెడు ఇష్టం.
***
"వర్షం" మీద నాకిష్టమైన కొన్ని పాటలు: (వరసక్రమంతో సంబంధం లేదు)
> ఈ వర్షం సాక్షిగా (వర్షం)
> ఆకాశ గంగ దూకావే పెంకితనంగా (వాన)
> స్వాతి ముత్యపు జల్లులలో (ప్రేమ యుద్ధం)
> జల్లంత కవ్వింత కావాలిలే (గీతాంజలి)
> ఓ ఓ ఓ వానా వానా వందనం (అడవి దొంగ అనుకుంట)
> వర్షించే మేఘంలా నేనున్నా (చెలి)
> గాలివానలో వాననీటిలో పడవ ప్రయాణం (స్వయమ్వరం)
ప్రస్తుతానికి ఇవే గుర్తొచ్చాయి. ఖచ్చితంగా ఇంకా ఉండే ఉంటాయి.
Photo Courtesy: Internet
15 comments:
చైతన్య గారూ ! తొలకరి జల్లు , మట్టివాసనా నాకూ చాలా ఇష్టం .కాని ఉరుములంటే మహాభయం .ఉరుముల్లేని వర్షాన్ని , పిడుగులు పడని మెరుపుల్ని ఇవ్వమని ఎప్పుడూ దేవుడ్ని కోరుకుంటూ ఉంటా .... :)
weekend cricket match ki rain padakunda eppudu paDinaa naaku istame :p
btw..pencil sketch chala bavundi :)
oh my gosh what to do with this younger generation? They pick such pale tasteless bland "dry" songs .. what to do?
కాస్త పాత రోజులకి వెడితే
ఆకు చాటు పిందె తడిసె,
మరి కాస్త పాతరోజులకి వెడితే
చిటపట చినుకులు పడుతూ ఉంటే
స్వాతి ముత్యపు జల్లులలో ....సూపర్ సాంగ్.
ఇంకొన్ని ...
వాన వాన వెల్లువాయే.. కొండ కోన తుళ్ళిపోయే.. (గ్యాంగ్ లీడర్)
వాన జల్లు గిల్లు తుంటే (చిరు, విజయశాంతి) సినిమా పేరు తెలీదు :(
వర్షం ఇష్టపడని వాళ్ళెవరుంటారు నిజమే మరి. ఇంక వేడి వర్షం ఎంత టెపరేచర్ లో కావాలో(లేకపోతే వొళ్ళు కాలుతుంది కదా మరి)చెపితే దరఖాస్తు చేద్దాము ఆ పైవాడికి.స్నేప్స్ బాగున్నాయ్.
అవును నాకు వర్షం అంటే ఇష్టం మా ఊర్లో అసలు పడదు అదేంటో
మరో వాన పాట
వానొచ్చే వరదొచ్చే .. వయసంటే తెలిసోచ్చే
నాకైతే వర్షంలో తడుస్తూ బండి వేస్కుని వెళ్ళడమంటే ఇష్టం :)
నాక్కూడా బాగా ఇష్టం వర్షం అంటే. పిల్లలని కూడా ప్రోత్సహిస్తాను వర్షమ్లో ఆడుకోమని. చలి ప్రాంతాలలో నివసిస్తున్నాను కాబట్టి వర్షాన్ని అంతగా ఎంజాయ్ చేయలేకపోతున్నాను - చలిపెడుతుంది కాబట్టి. అందుకే నాకు ఇండియాలోని వర్షమే ఇష్టం. అంతగా చలి వుండక హాయిగా తడవవచ్చు.
@పరిమళం
ఉరుములు, పిడుగులు అంటే నాక్కూడా భయమే!
@అన్వేషి
నేనయితే క్రికెట్ మ్యాచ్ రోజు పెద్ద వర్షం పడాలని కోరుకుంటా... క్రికెట్ వస్తే మా ఇంట్లో నాన్నగారు, అన్నయ్య నన్ను టీవీ దగ్గరకి కుడా రానివ్వరు మరి...
థాంక్స్... స్కెచ్ నాది కాదు :)
@కొత్తపాళీ
పాత పాటలు నేను కుడా వింటాను. కానీ మీరు చెప్పిన పాటలు మరీ ఇష్టమని చెప్పలేను.
పాత తరం వాళ్ళు పాత పాటలు ఇష్టపడినట్టే... ఈ తరం వాళ్ళు కొత్త పాటలు ఇష్టపడతారు... అందులో వింతేముంది :) పాత పాటలే మంచివి... కొత్తవన్ని 'dry songs' అని చెప్పలేం... కొత్త వాటిలో కూడా మంచి పాటలు ఉన్నాయి :)
అన్నట్టు 'గాలి వానలో' పాట కొత్తదేమీ కాదు :)
@చైతన్య
'వాన జల్లు గిల్లుతుంటే' - సినిమా 'యముడికి మొగుడు'
మీరు చెప్పిన పాటలు కూడా బాగుంటాయి కానీ... నాకు మరీ అంత ఇష్టమేమి కాదు :)
@శ్రీనివాస్ పప్పు
అలా అంటారా... సరే అయితే temparature mention చేస్తూ ఒక దరకాస్తు తయారు చేస్తాను.... పైవాడి అడ్రస్ పంపించండి నాకు :)
@శ్రీనివాస్
హ్హ అది కుడా వాన పాటే కానీ.. నాకు నచ్చిన పాటల లిస్టు లో లేదు :)
@కిరణ్
వర్షంలో డ్రైవింగ్ ఆ.... బాగానే ఉంటుంది కానీ... చాలా డేంజర్... జాగ్రత్తండి!
@శరత్
పిల్లల్ని వర్షంలో తడవమని ప్రోత్సహించే తండ్రి అందరికి ఉంటె భలే ఉంటుంది :)
మొన్న చాలా రోజుల తర్వాత పడింది కదా వాన...మధ్యలో ఎండ కూడా కాసింది మీకోసమేనేమొ:) ఎండలో వర్షం పడింది కదా హరివిల్లు కనిపిస్తుందనుకున్నాను కానీ కనిపించలా :( పై పాటలలో స్వాతీముత్యపు జల్లులలో...నాకు బా ఇష్టం మధ్యలో టి టి టా టీ టి టా టి టి టా.. అని music భలే వుంటుంది..నిన్న గాలికి వర్షం మళ్ళీ పడుతుందేమొ అనిపించింది ...వర్షం లో కొన్ని ఫొటొలు
http://naachitraalu.blogspot.com/
వర్సం గురించి బాగ రాసారు.బొమ్మలు చాలా బాగున్నాయి.
@నేను
అవును... రెండు రోజుల నుండి గాలి వస్తుంది కాని... వర్షం పడటం లేదు సరిగా... చూద్దాం ఎన్ని రోజులు ఇలా ఊరిస్తుందో :)
మీ బ్లాగ్ అద్భుతంగా ఉంది... అన్ని ఫొటోస్ సూపర్!
@అరుణాంక్
థాంక్స్! ఆ ఫొటోస్ ఇంటర్నెట్ నుండి సేకరించనవి!
నిజమేనండి.. వర్షాన్ని ఇష్టపడని వాళ్ళు ఎవరూ ఉండరు.. బాగుంది టపా.. వేడి వర్షం ఆలోచన నాక్కూడా వచ్చేది చిన్నప్పుడు. మీరు గమనించారో లేదో కాని, మనం వర్షంలో పూర్తిగా తడిసిపోయాక, వణుకుతూ ఉంటాం కదా అప్పుడు కురుస్తున్న వర్షం వెచ్చగా అనిపిస్తుంది.. అబ్బా..ఆ అనుభూతిని ఎలా వర్ణించడం..?
"వర్షం ఎలాంటి భావాన్నైనా ప్రతిబింబించగలదు"
ఖతర్నాక్ quotation కొట్టిన్రు సార్.. ఫస్టు టైం ఇంటున్న.. సూపర్ మె డూపర్ ఉంది. quotation కి తగ్గట్టు పోస్ట్ భీ అదిరింది.
హైదరాబాద్ ల ఉన్నప్పుడు వానా కాలం నాక్ మస్త్ ఇష్టం ఉంటుండె.. మీరు చెప్పిన తొలకరి వర్షాలు, మట్టి వాసన, అట్లనే, కుండపోత monsoon వర్షాలు - జాకీర్ హుస్సేన్ తబల కొట్టినట్టు.. మస్త్ రింగులు తిప్పిన్రు :)
ఇగ వాన పాటలకొస్తె, నాక్ జట్న గుర్తొచ్చిన పాటలు ఇవ్వి
ఓహో మేఘమొచ్చెనే - మౌన రాగం
వాన మేఘం - డాన్స్ మాస్టర్
సందె పొద్దు మేఘం - నాయకుడు
కురిసేను విరి జల్లులే - ఘర్షణ (ఈ పాట తోటి కొంచెం cheating చేష్న.. మాఫ్ చెయ్యాలె.. but the imminent rain is so palpable in the song!!
మంచు కురిసె వేళలో - అభినందన (మంచు, వాన అడ్జస్ట్ ఐపొండ్రి బాంచన్ :D )
మబ్బే మసకేసిందిలే - వయసు పిలిచింది
స్వాతి చినుకు సందె వేళలో - ఆఖరి పోరాటం
andi mazhai pozhigirathu - raaja parvai (సుందరమో సుమధురమో - అమావాస్య చంద్రుడు. తెలుగు పాటల తెల్వదు గని, తమిల్ పాట సాహిత్యం ఇది - andi mazhai - తొలకరి వర్షం, pozhigirathu - loosely translated to పడుతుంది, ovvoru tuliyulum - ప్రతి ఒక్క చినుకు లో, un mugam terigiradhu - నీ మొహం తెలుస్తుంది/కనపడుతుంది/తాకుతుంది)
చిన్న చిన్న చినుకుల్లోన - అమ్మ కొడుకు (ఈ సినిమా సంగీతం గురించి ఒక పిట్ట కథ, మీక్ తెల్సే ఉంటది అంకుంట, ఫిర్ భీ చెప్తా, నాక్ తెల్సన్న విషయం చెప్పుకోవాలె కద :D .. ఈ సిన్మాకి ట్యూన్ లు కట్టింది MSV ఐతే, ఆర్కెస్ట్రేషన్ IR.. సొ కొంచెం IR stamp కనిపిస్తది పాటలల్ల. వీల్లిద్దరు ఇంకో సినిమాకి కూడ almost ఇట్లనె చేష్నరు - ఏ సిన్మానో తెల్సా?!! )
ఆకాశం మేఘాలు - కోకిల
Non-IR పాటలకొస్తె,
కురిసింది వాన నా గుండె లోనా - బుల్లెమ్మ బుల్లోడు
చిటా పటా చినుకులతో కురిసింది వాన, మెరిసింది జాణ - అక్కా చెల్లెల్లు
మబ్బులో ఏముంది - లక్షాధికారి
ముత్యాల జల్లు కురిసే - కథానాయకుడు
చిటపటా చునికులు, మన కోసం కురిసాయి - Agent Gopi (అనుకుంట - సూపర్ స్టార్ సిన్మా)
చిటపట చినుకుల మేళం, తడి పొడి తపనల తాళం - ముద్దుల కొడుకు (మహదేవన్ పాట)
ఇది మేఘ సందేశమో - ఏడంతస్థుల మేడ
మేఘమా దేహమా - మంచు పల్లకి
చినుకులా రాలి, నదులుగా సాగి - నాలుగు స్థంభాలాట
చినుకు చినుకు - సిరివెన్నెల
ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలో - సిరివెన్నెల again!
వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా - ఆనంద్
వర్షం మీద పాటలు లిస్ట్ చేషి ఈ పాట చెప్పక పోతే, the music Gods will punish me!
రిం ఝిం గిరె సావన్ - మంజిల్ uffff kishore and RD - magical!!
ఇప్పటికే చానా వాగిన అన్న ఫీలింగ్ ఒస్తుంది.. మూజిక్ గురించి టాపిక్ ఒస్తె ఫ్లో ఆపుకొనుడు జర్రంత కష్టం.. ఇంక సైలెంట్ ఐపొత :)
హైదరబాద్ తోటి మస్త్ పాటల్ భీ గుర్తు చేష్నరు.. టంకులే టంకులు!!
Post a Comment