Monday, February 1, 2010
'నయా' బజార్
నే చూసేసానోచ్చ్!!
హమ్మయ్యా... నేను చూసేసాను. మాయా బజార్ కలర్ ఫొటోస్ లో సావిత్రి గారిని చూడగానే ఎలా అయినా సరే ఈ సినిమా చూసి తీరాల్సిందే అనుకున్నాను. చూసేసాను.
నిన్న సాయంత్రం ఫస్ట్ షో కి వెళదామనుకుంటే టికెట్స్ దొరకలేదు. ఎంత పెద్ద క్యు నో! కానీ ఎందుకో టికెట్స్ దొరక్కపోయినా ఆ ధియేటర్ అలా జనాలతో నిండిపోవటం చూసి ఆనందమేసింది. మళ్ళీ సెకండ్ షోకి ట్రై చేస్తే దొరికాయి. ఆ షో కూడా హౌస్ ఫుల్. భలే సంతోషమేసింది. ఇప్పుడు వచ్చే చెత్త సినిమాల మధ్య, మన జనాలు ఇంకా ధియేటర్ కి వచ్చి మాయ బజార్ చూస్తున్నారంటే... సంతోషమేగా మరి!
టైటిల్ పడగానే అరుపులు... ఈలలు! అస్సలు ఊహించలేదు నేను. ఈ సినిమాని కూడా జనం ఇలా ఎంజాయ్ చేస్తారని.
చిన్నారి శశిరేఖ ఎంత బాగుందో! ఆ అమ్మాయిని అంతగా ఎప్పుడూ గమనించలేదు నేను. ఎంత బాగా పెట్టిందో భావాలు ముఖంలో!
ఎన్ టి ఆర్ గారు కనపడగానే మళ్ళీ అరుపులు, ఈలలు. కృష్ణుడంటే ఆయనే కదా! ఎంతటి ప్రశాంతత ఆ వదనంలో! చూస్తుంటే నిజంగానే దేవుణ్ణి చూసిన భావన కలుగుతుంది!
సావిత్రి గారూ కనపడగానే మళ్ళీ అ...లు, ఈ...లు! కానీ సావిత్రి గారిని చూడటానికి మాత్రం రెండు కళ్ళూ సరిపోలేదు. హబ్బబ్బా ఎంత అందంగా ఉన్నారో! నా దిష్టే తగులుతుందేమో అనిపించింది. అసలే ఆవిడ ఆ వయసులో నటించిన ఏ సినిమా కూడా కలర్ లో లేదేమో... మొదటిసారి ఆవిడని అలా కలర్ సినిమాలో చూస్తుంటే... అలా చూస్తూనే ఉండాలనిపించింది.
ఇంతలో ఏ ఎన్ ఆర్ గారు వచ్చి "నీవేనా..." అని పాట అందుకోగానే మళ్ళీ అ...లు, ఈ...లు!
మేక్ అప్ కూడా చాలా నీట్ గా చేసారు. చూడముచ్చటగా ఉన్నారు అందరూ. కాకపోతే చూడగానే ఆ బంగారు ఆభరణాల రంగు కాస్త ఎక్కువయ్యిందేమో అనిపించింది... అన్నీ మెరుస్తూ dominating గా కనిపించాయి. కానీ కాసేపు అలా చూడగానే కంటికి అలవాటయిపోయింది. సినిమాలో మునిగిపోయి ఇంకా అవేమీ గమనించే స్థితి లేదు.
"భళి భళి భళి భళి దేవా" పాట కట్ అయిపోయింది... కానీ ఎడిటింగ్ నీట్ గా చేసారు. అక్కడ ఆ పాట ఉంటుందని తెలియని వాళ్ళకి కట్ చేసినట్టు తెలియదు. ఫిలిం negative పాడయిపోయి ఆ పాట మూవీ లో కట్ చేయాల్సి వచ్చిందని ముందే తెలుసు కాబట్టి, పెద్దగా ఏమి అనిపించలేదు. కానీ దానితో పాటు ఇంకో పాట కూడా అలాగే కట్ చేసాము అన్నారు... అదేంటో మరి... అనుకుంటూ చూసాను. తర్వాత అర్థమయ్యింది...అది "చూపులు కలిసిన శుభవేళ" పాట అని :( .
ఇంతలో మన ఘటోత్కచుడు గారు రానే వచ్చారు. మళ్ళీ అ...లు, ఈ...లు. హబ్బ... ఎస్ వి ఆర్ గారిని చూడాలంటే మళ్ళీ రెండు కళ్ళూ సరిపోలేదు! అసలు మాయ బజార్ కి సావిత్రి గారు, ఎస్ వి ఆర్ గారు రెండు కళ్ళు.
మాయా శశిరేఖ రూపంలో సావిత్రి గారి నటన, హావభావాల గురించి ఎంతని చెప్పగలం!
ఇంతలో మళ్ళీ అ...లు, ఈ...లు... మన లక్ష్మణ కుమారుడు వచ్చారు మరి. "సుందరి నీ వంటి" పాటలో రేలంగి గారిని చూస్తుంటే భలే అనిపించింది.
చివరి భాగంలో మన ఘటోత్కచ సైన్యం తసమదీయులకి చేసే మర్యాదలు చూసి... హాలంతా చిన్నపిల్లలా నవ్వులతో నిండిపోయింది.
మొత్తం సినిమాని పెద్దలు, పిల్లలు బాగా ఎంజాయ్ చేసారు. ఇది ఒక కామెడీ సినిమా అని అప్పుడే బాగా అర్థమయ్యింది నాకు!
ఆ సినిమాలో నటించిన మెయిన్ ఆర్టిస్టూల్లో ఎ ఎన్ ఆర్ గారు మాత్రమే ఉన్నారు ఇప్పుడు. కానీ సినిమాలో నటించిన సైడ్ ఆర్టిస్ట్స్, జునియర్ ఆర్టిస్ట్స్ లో ప్రస్తుతం ఎంత మంది ఉన్నారో మనకి తెలిదు. వాళ్ళంతా ఈ సినిమా చూస్తూ ఎంత సంతోషించి ఉంటారో కదా!
70 mm చేయటం వలన... బొమ్మ పైన, క్రింద కొద్దిగా కట్ అయింది. కొన్ని frames లో ఆ లోపం క్లియర్ గా తెలుస్తున్నా... ఓవరాల్ గా చాలా బాగా maintain చేసారు.
1957 నాటి అద్భుతాన్ని మళ్ళీ ఇంత చక్కగా, అద్భుతంగా రంగుల్లో మన ముందు ఉంచిన గోల్డ్ స్టోన్ టెక్నోలజీస్ వారికి నిజంగా కోటి దండాలు!
కొ.మె: "విజయా" వారి చిత్రాల్లో చంద్రుడికి ఉండే ప్రాముఖ్యత గురించి అందరికీ తెలుసు. కాకతాళీయమైనా... ఈ నయా మాయా బజార్ రిలీజ్ అయిన 30 తారీఖు నాడు, ఆకాశంలో చంద్రుడు పెద్దగా కనిపిస్తూ 15 రెట్లు అధికంగా వెన్నెల వెలుగులు విరజిమ్మటం నిజంగా అద్భుతం. (ఈ వార్త "సాక్షి" దినపత్రిక లోనిది.)
Subscribe to:
Post Comments (Atom)
10 comments:
మరో మారు తెలుగు ప్రేక్షకుల్ని రంగుల పారవశ్యంలో ముంచిన గోల్డ్ స్టోన్ టెక్నోలజీస్ వారికి జేజేలు.
మాకు ఇన్ని విషయాలు తెలిపినందుకు మీకు ధన్యవాదాలు.
- కిరణ్
ఐతే OK
:) నేను కూడా చూసేద
తప్పకుండా చూడాల్సిందన్న మాట!! అవునండీ...ఆ రిలీజ్ రోజు ఆకాశంలో చంద్రుడు పెద్దదిగా కనపడ్డాడు...నేనూ చూశాను...
హ్మం ...
ఇంకా చూడలేదు నేను ...ఇక్కడ విడుదల కాలేదు అనుకుంటా :(
అబ్బో! ఎన్ని అరుపులు, ఈలలో...
ఇక్కడ రిలీజ్ కాలేదు కాబట్టి, ఎప్పుడెప్పుడు పైరసీ ప్రింటు వస్తుందా అని వెయిటింగ్ నేనైతే. :)
"సుందరి నీ వంటి" the best comedy song ever with a very good melody.. nenoo vinnanandee .. chalaa baaga theesarani.. inkaa choodadam kudaraledu.. mee vivarana maathram urgentu gaa choosi vaccheyaalani pinchettu undi.. good. Ee movie ni "super good films" vaallanukuntaa kadaa color lo produce chesindi? 5 crores cost ani vinnanu.. ee chitraniki dorikina manchi aadarana tho..marinni thelugu classics color lo vasthaayani anukuntunnannu..
మొన్న వీకెండ్ కి ఐనాక్స్ లో టికెట్స్ దొరకలేదు చైతన్యా! కానీ రోడ్ల పక్కన, బస్ స్టాప్ ల మీద కలర్ మాయా బజార్ పోస్టర్లు, హోర్డింగులు చూసి చిత్రమైన ఫీలింగ్ కలిగింది. మొదటి సారి మాయా బజార్ రిలీజ్ అయినపుడు మనం ఈ జన్మలో లేము! సెకండ్ రిలీజ్ లు వగైరాలు జరిగినపుడు పోస్టర్లు చిన్నవి, బ్లాక్ అండ్ వైట్ లోవీ కదా! హోర్డింగ్ సైజులో మాయా బజార్ పోస్టర్లు చూస్తుంటే గతంలోకి జారిపోయిన ఫీలింగ్ వచ్చేసింది.
భళి భళి పాట నాకు చాలా ఇష్టం! ఆ పాట తీసేశారంటే కొంచెం నిరుత్సాహంగా ఉంది.
ఈ వీకెండ్ అయినా సరే చూసేస్తానని శపథం చేస్తున్నా!
చిన్న పిల్లల కి కనువింది అన్నమాట. ఎన్నాళ్ళకెన్నాళ్ళకి శుభవార్త చెప్పారు ? ఏనిమేషన్ సినిమాలు తప్ప ఇలాంటి ఎపిక్ సినిమాలు చూసే అద్రుష్టం ఈ తరం పిల్లలకి లేకపోయె అనిపించేది. మా చిన్నప్పుడు బాల భారతం, లవకుశ, నర్తన శాల, శ్రీ కృష్ణార్జున యుద్ధం లాంటి సిన్మాలకి మా అమ్మ తప్పకుండా హాలు కి తీస్కెళ్ళి చూపించేది. అలానే మా చెల్లెలి టైం కి చందమామ వారి భైరవ ద్వీపం చూపించేను. అదీ మంచి సినిమానే ! ఇపుడలాంటి జ్ఞాపకాలు ఈ తరం పిల్లలకి మిగలబోతున్నాయన్న మాట. చాలా ఆనందం.
"నే చూసేసానోచ్చ్!!హమ్మయ్యా... నేను చూసేసాను."
చూస్తే చూసారు యిలా మళ్ళీ ఒక పోస్ట్ కుడా వెయ్యలా :( ఏం చేస్తాం ఖండిస్తాం!
ఎంత చెప్పినా మాయాబజార్ (ఇది వరకు లేదు-ఇక మీద రాదు)
నేనూ చూశానండీ.. "చూపులు కలిసిన.." లేకపోవడం కొంచం ఎక్కువగానే నిరాశ పరిచింది..
'లాహిరి లాహిరి..' పాట మాత్రం అద్భుతం..
Post a Comment