మాయబజార్ రంగుల్లో తీస్తున్నారని తెలియగానే మీకేమైనా అనిపించిందా?
నాకైతే పెద్దగా ఏమీ అనిపించలేదు. ఆ... అందులో ఏముందిలే అనుకున్నాను.
అంటే... ఆ పని అంత తేలిక కాదని నాకు తెలుసు. దాని వెనక సంవత్సరాల నుండి ఎంతో మంది పడిన కష్టం ఉందని తెలుసు. కానీ ఎందుకు అంత కష్టపడటం అనిపించింది.
మా అన్న అయితే దానికి సంబంధించిన ప్రోగ్రాం టీవీలో ఎప్పుడు వచ్చినా వదలకుండా చూస్తాడు. ఎంటబ్బా అంత పిచ్చి అనుకునేదాన్ని. తెలిసిన సినిమానే, ఎన్నోసార్లు చూసిన సినిమానే కదా... కాకపోతే కలర్ లో... అంతే కదా అనిపించేది.
సినిమా రిలీజ్ అవుతుందని తెలిసి... రిలీజ్ రోజే చూద్దామని టికెట్స్ బుక్ చేస్తా అన్నాడు. మూడు గంటలు ధియేటర్ లో ఆ సినిమా చూడగలమా... బోర్ కొడుతున్దేమోరా అన్నాను. ఏం కొట్టదు... ఇంతకు ముందు ఎన్నిసార్లు చూసినా బ్లాకు అండ్ వైట్ లోనే కదా చూసింది.. కలర్ లో బాగుంటుంది. ఇంకా dts కూడా ఉంది కదా... అన్నాడు. అయినా నాకేమి exciting గా అనిపించలేదు.
ఈరోజు మాయబజార్ కలర్ ఫొటోస్ వచ్చాయి మెయిల్ లో. అంతే!
అందులో సావిత్రి గారిని చూడగానే డిసైడ్ అయ్యాను... ఈ సినిమా ఎలా అయినా ధియేటర్ లో చూసి తీరాల్సిందే అని.
మరిన్ని ఫోటోలు ఇక్కడ.
11 comments:
కలర్లో కూడా చూడాల్సిందే..
- కిరణ్
ఐతే OK
మాయాబజార్ ... కలర్ లో .. హ్మం
తప్పకుండా చూడాల్సిందే ..
అబ్బ ఎంత బావున్నాయి ఫొటోలు. సావిత్రి కి కొత్త అందం వచ్చినట్టుంది. ఫొటోలు పెట్టినందుకు ధన్యవాదాలు.
Mayabazar is my all time favorite movie. I shall watch it as soon as it gets released!
నేనూ 30 తారీఖు కోసం ఎదురుచూస్తున్నా.......
అయితే త్వరలో ఈ సినిమా చూసేద్దాం
నేనూ తప్పక చూసేస్తానండీ. మా దగ్గర రిలీజ్ అవుతుందో లేదో తెలియదు.
@ కిరణ్
అంతే కదా మరి :)
@ చైతన్య ఎస్
అవును :)
@ సౌమ్య, పరిమళం
:-)
@ శ్రీనివాస్
చుసేయండి చుసేయండి
@ శరత్
అలాగే :)
అయ్యబాబోయ్ ఫ్రేమ్ అంతా ఎంత కలర్ఫుల్ గా వుందో ఎంటోడూ సావిత్రి ఎంత అందం గా వున్నారో సూర్య కాంతం కూడా బాగుంది, ఇక ఎస్.వీ రంగారావు గారి గురించి చెప్పాలా.. అబ్బ బలే వున్నాయి. మాకు ఇక్కడ రెలీజ్ ఐతే బాగు చూసెయ్యాలని వుంది. థ్యాక్స్ చైతన్య పిక్చర్స్ చూపెట్టినందుకు.
నమ్మ బెంగళూరు లో ఎక్కడైనా విడుదల ఐనచో వివరాలు తెలుపగలరు,..
Post a Comment