Tuesday, January 12, 2010

బేరాలు - సారాలు

గమనిక: టైటిల్ లో ఉన్నట్టు... పోస్ట్ 'బేరాల' గురించే. కానీ సారం (సారంశం) నేనేమి చెప్పలేదు...ఎవరికి వారు అర్థం చేసుకోండి.

మొన్న సాయంత్రం ఆఫీసు నుండి త్వరగా బయట పడ్డాను. ఎలాగు త్వరగానే వెళ్తున్నాను కదా... ఈవెనింగ్ స్నాక్స్ కింద తినటానికి ఏమైనా తీసుకెళ్దామని మెక్ డొనాల్డ్స్ కి వెళ్లాను. నాకు, నాతో ఉండే నా ఫ్రెండ్ కి (actually నేనే తనతో ఉంటున్నాను :D) అని... రెండు burgers, fries తీసుకున్నాను.
అవి తీసుకుని ఇంటికి వెళ్తుంటే... దారిలో కొబ్బరి బొండాలు కనిపించాయి.
ఆ బండి దగ్గరకి వెళ్ళి.. "బొండం ఎంత?" అని అడిగాను.
ఆ అబ్బాయి ఒక్క క్షణం మౌనంగా ఉండి... "పది" అన్నాడు. అవి చూస్తే చాలా చిన్నగా, ఎండిపోయినట్టుగా ఉన్నాయి.
"ఏంటి... ఇంత చిన్నగా ఉన్నాయి వీటికి పది రూపాయలా... ఎనిమిది తీసుకోండి" అన్నాను.
అతనేమి మాట్లాడలేదు. సరే అన్నట్టుగా... రెండు బొండాలు కొట్టి ఇచ్చాడు.



అతనికి డబ్బులిచ్చేసి వస్తుంటే... బుర్రలో ఒకటే ఆలోచన. అక్కడేమో మెక్ లో పెద్దగా ఏమి కొనకపోయినా... అంత బిల్ అయింది... ఏం? అక్కడ కూడా అడిగి ఉండొచ్చుగా... ఇంత చిన్నగా ఉన్నాయి burgers... వీటికి అంత డబ్బులా అని... అక్కడ మాత్రం నోరు మెదపకుండా... ఎంత అడిగితే అంత సమర్పిస్తాం. ఏదో మనం వాళ్ళకి అప్పున్నట్టు!
ఇంకా tax లు గట్రా అంటూ వాయించేస్తారు. అయినా ఒక్క మాట కూడా అడగము. ఎంతైనా ఇచ్చేస్తాము.
కానీ పాపం ఇక్కడ వీళ్ళు రోడ్ మీద ఎండలో రోజంతా నిలబడి అమ్ముతుంటే... వీళ్ళ దగ్గర రెండు రూపాయల కోసం బేరమాడాను.... ఛి ఛి. ఎంత తప్పు. ఆ రెండు రూపాయల్లో నేనేమైనా మేడలు కట్టేస్తానా. పాపం వాళ్ళకి మిగిలేదే రూపాయో రెండు రూపాయలో. అది కూడా బేరమాడేసి ఏదో గెలిచేసినట్టు ఫీలింగ్. హ్మ్...
పొద్దున్నుండి అలా అమ్ముతున్నా పెద్దగా ఎవరూ కొనలేదేమో... పాపం అందుకే నాకు అడగ్గానే తగ్గించి ఇచ్చేసాడేమో! నేను మాత్రం ఏదో గొప్పగా బేరమాడి సాధించేసినట్టు ఫీల్ అయిపోయి... అతనికొచ్చే రెండు రూపాయల లాభం కూడా లాగేసుకున్నాను. ఛా.
ఇలా రకరకాల ఆలోచనలతో వెళ్తుంటే... కాస్త ముందుకి వచ్చాక... అక్కడ ఇంకో కొబ్బరి బోండాల బండి కనిపించింది. ఇవి నేను కొన్నవాటి కంటే కొంచం మంచిగా ఉన్నాయి. ఆ బండికి ఒక బోర్డు తగిలించి ఉంది...
"5 Rs/-"

11 comments:

శ్రీనివాస్ said...

ఇందు మూలముగా మీరేం చేపదలుచుకున్నారు. బేరం చేయమనా వద్దనా

Anonymous said...

yes! its true. for that reason only i wont do barging

చైతన్య said...

@ శ్రీనివాస్
నేను చెప్పదల్చుకున్నది మొదటి లైన్ లోనే చెప్పెసానండి :)

చైతన్య.ఎస్ said...

హ హ :)
దిన్ని బట్టి నాకు అర్థం అయింది... మీకు 6 రూపాయలు నష్టం వచ్చింది అని :)
>>ఆ రెండు రూపాయల్లో నేనేమైనా మేడలు కట్టేస్తానా.
హ్మం ..చాలా సార్లు ఇలా నేను అనుకుంటా కాని ... మళ్ళి ఏంటో బేరమాడేస్తా :(

Unknown said...

మంచి రోజులు కావండీ, కానీ మనం మంచిగానే ఉండాలి......రెండు రూపాయలతో మనం బిల్డింగ్ కట్టనట్టే, మూడు రూపాయలతో వాడు బిల్డింగ్ కట్టలేడు. మనకు చేతనయితే ఉంటే అర్హులకు ఏదో రూపేణా సహాయం చేయడంలో తప్పు లేదు.

Anonymous said...

ఇలా కొన్ని రూపాయలు కలిసి వందలు కొన్ని వందలు కలిసి వేలు కొన్ని వేలు కలిసి ... అవుతాయి మాస్టారు.

DD లో "జాగో గ్రహాక్ జాగో" అని advertisement వస్తుంది చూడండి.

మీరు MRP మీద కూడా బేరమాడవచ్చు, అది Maximum Retail Price అనే కానీ అదే fixed price అని కాదు. నేను ఈ విషయం ప్రస్తావించగానే ప్రతి shop వాళ్ళు కనీసం Rs2/Product తగ్గించారు .

మీరు Staples కి వెళ్లి ఏదైనా item కొంటె MRP మీద కొంటారు, కానీ SP road లో అదే product 50% takkuvaki వస్తుంది పైగా 5Years warranty తో పాటు bill ఇస్తాడు, ఇవన్ని information తెలియక జరిగే నష్టాలు. Information is wealth. Know it Use it. Save money.

ఐన ఇంట్లో పెరిగే నిమ్మకాయలకి rate ఎవరు decide చేస్తారు? ఎవడు తయారు చేస్తున్నారు కొబ్బరికాయలు, నిమ్మకాయలు, ఎక్కడ చూసినా నిమ్మకాయ 3 rupees. ఎందుకో అలోచించి మీరే decide చేసుకోండి.

India లో Arvind mills వాళ్ళ చేత clothes కుట్టించి Allensolly, Louis phillippe, Wrangler అని tag తగిలిస్తే ఎగబడి కొంటున్నాం. price US ది, సరుకు india ది, అదే quality clothes బయట దొరికితే కొంటున్నారా?

amma odi said...

:)

కొత్త పాళీ said...

true.

మురళి said...

good twist..

చైతన్య said...

@ manosri
think you didn't understand the post completely! anyway thanks for dropping by :)

@ చైతన్య ఎస్
అదేంటో... ఇలాంటివి చూసినప్పుడే అస్సలు అర్థం కాదు... బేరమాడాలో వద్దో... హ్మం

@ MY DIARY
అవును...అర్హులైనవారికి సాయం చేయటంలో తప్పు లేదు. అపాత్రదానం మాత్రం మంచి కాదు!

చైతన్య said...

@ abhimatam
MRP మీద కూడా బేరమాడొచ్చని నాకు నిజంగా తెలీదు!
ఇంత వివరంగా మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు.

@ AMMAODI , కొత్తపాళి, మురళి
thanks for your comments :)