మూడు రోజుల క్రితం కిడ్నాప్ కి గురైన వైష్ణవి చనిపోయిందని తెలియగానే చాలా బాధనిపించింది. కానీ తనని ఎలా చంపారో తెలిసాక చాలా కోపమొచ్చింది. అసలు వాళ్ళు మనుషులేనా అని అనుమానమొచ్చింది. మరీ ఇంత దారుణమా! మనం బ్రతుకుతుంది మనుషల మధ్యా లేక మృగాల మధ్యా? అడవిలో తిరిగే మృగాలు కూడా ఆకలేస్తేనే మరో జంతువుని చంపుతాయి. కానీ వీళ్ళు? కేవలం ఆస్తి తగాదాల వలన నిండా పది ఏళ్ళు కూడా నిండని పసిపాపని అంత దారుణంగా... ఛా. అసలు వాళ్లకి చేతులెలా వచ్చాయో! తనని ఎవరు ఎందుకు హింసిస్తున్నారో కూడా తెలియని ఆ చిన్నారి చివరి క్షణాల్లో ఎంత నరకం అనుభవించి ఉంటుందో తలుచుకుంటేనే కన్నీళ్లు ఆగటం లేదు. ఆ పాపని అంత దారుణంగా చంపటం వలన వాళ్ళు ఏం సాధించారు? వాళ్ళ గొడవలుతీరిపోయాయా? వాళ్ళ ఆస్తి వాళ్లకి వచ్చేసిందా? అసలు ఇలాంటి వాళ్ళని ఏమనాలి?
పాపం... ఆ పాప గురించిన వార్త తెలియగానే ఆ తండ్రి కుప్ప కూలిపోయారు. పాప మరణ వార్త విని షాక్ లోకి వెళ్ళిన ఆ తల్లికి మరో షాక్... ఆ తండ్రి మరణ వార్త. ఇంతటి దారుణాన్ని చేసిన ఆ దుర్మార్గులకి (ఈ పదం సరిపోదు) ఎలాంటి శిక్ష వేయాలి? కేవలం ఉరి తీస్తే సరిపోదు. క్షణక్షణం నరకం అనుభవించే శిక్ష వేయాలి. ప్రతి క్షణం వాళ్లు చేసిన తప్పు గుర్తొచ్చి నరకం అనుభవించేలా శిక్షించాలి.
కేవలం డబ్బు కోసం ఇంతటి హేయమైన పని చేయించిన, చేసిన వాళ్ళని అస్సలు వదలకూడదు. నాలుగు రోజులు దీని గురించి మాట్లాడి, తర్వాత మర్చిపోకుండా ఆ మృగాలకి తగిన శిక్ష వేసే వరకు వదిలిపెట్టకూడదు.
ఇంత దారుణాన్ని కూడా వ్యాపార దృష్టితో చూసే ఈ న్యూస్ చానల్స్ ని ఏం చేయాలి? వైష్ణవి మరణం పై sms కాంటెస్ట్ పెడుతున్న వీళ్ళు మాత్రం మనుషులా? ఆ హంతకులకి, వీళ్ళకి ఏంటి తేడా?
వైష్ణవి అన్న ఆ కిరాతకుల భారిన పడకుండా తప్పించుకోగాలిగాడు. ఆ బాబు కోసం, కనీసం వైష్ణవి తల్లైనా షాక్ నుండి తేరుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆశ.
17 comments:
మీ ఆవేదన అర్ధం చేసుకోగలను కానీ వైష్ణవి మరణించినప్పుడు ... కిరాయి హంతకులను, అలాగే మహేష్ బోరు బావిలో పడి మరణించినపుడు బావి తవ్విన వాళ్ళని మాత్రమె విమర్శిస్తూ మనం పెద్ద తప్పే చేస్తున్నాం.
చూడండి వైష్ణవి చనిపొయినప్పుడు వచ్చిన స్పందన ముందు రోజు ఆమె కార్ డ్రైవర్ చనిపోయినప్పుడు రాలేదు. ఏం కార్ డ్రైవర్ ది ప్రాణం కాదా?? అలాగే పలగాని ప్రభాకర్ ఆగర్భ శ్రీమంతుడు అయన కుమార్తె ను కిడ్నాప్ చేస్తే మీడియా చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. రాష్ట్రంలో శనివారం ఒక్క వైష్ణవి మాత్రమే కిడ్నాప్ అయి ఉంటుంది అని భావిస్తున్నారా ? ఇంకా తండాలలో గిరిజన వాడల్లో ఎందరో బిడ్డలు అపరణకు గురి అవుతున్నారు.
పర్లేదు వైష్ణవి మరణం పట్ల చాలా సానుభూతి వచ్చింది .... కొంతవరకు నయం ... కానీ ప్రజల్లో ఈ ఆవేశం ఎన్నాళ్ళు ఉంటుంది ???? ....20-20 ఫైనల్స్ వరకు లేదా టీం లీడర్ తిట్టే దాక? .....
వైష్ణవి హంతకులను చంపితెనో లేక వరంగల్ లో స్వప్నిక మీద యాసిడ్ పోసిన వాడిని కాల్చి చంపితే సమస్య తీరిపోదు. రోగానికి మందు వేస్తె కుదరదు రోగ లక్షణానికి మందు వేయాలి. డబ్బులిస్తే యెంత కిరాతకానికి అయినా ఒడిగట్టే నరహంతకులను ఎరివేయాలి. కిరాయి గూండాలు లేకుండా చేయాలి. ఇంకా కింది స్థాయిలో పోలీసుల అసమర్ధత ఒక కారణం. వారు ఎందుకూ పనికి రాకుండా తయారవ్తున్నారు. వాళ్ళలో చైతన్యం నింపడం లాంటి ఎన్నో చేయాలి. వైష్ణవి హత్య ఒక్కటే వెలుగులోకి వచ్చింది ...... ప్రపంచానికి తెలియని చీకటి కిడ్నాపులు హత్యలు ఎన్నో ఆ ప్రాంతంలో జరుగుతున్నాయి. ప్రజలందరూ కలిసి కట్టుగా వ్యవస్తని బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేక పోతే ఏదో ఒకరోజు టీవీ చూస్తూ మనం గుండెపోటుకి గురి అవడం ఖాయం.
పౌర సమాజం లో మార్పు రావాలి లేదా .. ఈ కుళ్ళిన సమాజంలో కంపు భరిస్తూ బతకాల్సిందే
ఒకళ్లది ఆస్తి గోల, ఒకళ్లది కక్ష , మరి కొంతమందిది డబ్బు కోసం ఎంతటిది దారుణం అయినా చెయ్యగలిగే మనస్తత్వం.అందరు కలిసి అభం శుభం తెలియని చిన్న పాపను అమానుషంగా హత్య చేసారు. ఇక కోర్టులు, కేసులు...
(అ)'న్యాయ వాదులు' ఉండనే ఉన్నారు. తిమ్మిని బమ్మి చెయ్యగలరు. ఎంత దారుణం చేసి అయిన తప్పించుకోవచ్చు.
ఇక మీడియా ... మాట్లాడకపోవటం మంచిది మీడియా గురించి.
వైష్ణవి కుటుంబానికి ఎలా ధైర్యం చెప్పాలో తెలియటం లేదు. కానీ వైష్ణవిని దారుణంగా చంపిన దుర్మార్గులను మాత్రం పాస్ట్ ట్రాక్ కోర్టుకు తీసుకువచ్హి, ఆ కిరాతకులని ప్రజలందరి సమక్షంలో ఉరి తీయాలని నేను కోరుకుంటున్నాను.
చిలకలపూడి సత్యనారాయణ
http://meeandarikosam.blogspot.com
మరోమాట కొన్నాళ్ళ కింద అనూష అనే అమ్మాయి మీద దాడి జరిగినప్పుడు మనం ఇంత కన్నా బాగా అరిచాం ... ఫాస్ట్ ట్రాక్ కోర్టు లో విచారణ అన్నారు తర్వాత అంతా మారిపోయింది.
It is very very sad. I heard of such things happening in backward areas or slums of Rio de Janeiro and Tribal Africa where there is no proper law and order.
What about India?
Why is it that India is unable to provide security to its people? On the other hand, there seems to be a general lack of fear in law!
@Srinivas: There is no value for life in "non-media covered" population.
Sreenivaas gaaru aka Vikatakavi, Well Said.
______________________
వైష్ణవి మరణం పై sms కాంటెస్ట్ పెడుతున్న వీళ్ళు మాత్రం మనుషులా? ఆ హంతకులకి, వీళ్ళకి ఏంటి తేడా?
_______________________
Isn't it? I didn't see news channels from the past few days. This is Really shame.
@ శ్రీనివాస్
సాధారణంగా మనకి తెలిసిన విషయాలకే మనం రియాక్ట్ అవుతాము. వైష్ణవి మరణం గురించి మనకి తెలిసింది, కాని మీరు చెప్పిన గిరిజన వాడల్లో జరుగుతున్నా దారుణాల గురించి ఎంతమందికి తెలుసు? తెలియని విషయాలకి రియాక్ట్ ఎలా అవ్వగలం?
ఇక్కడ వైష్ణవి మరణానికి డ్రైవర్ మరణం కంటే ఎక్కువగా జనం స్పందించటానికి ప్రధాన కారణం మీరు చెప్పినట్టు వైష్ణవి తండ్రి ధనవంతుడు కావటం మాత్రం కాదు (అతను అంతటి శ్రీమంతుడని నాకైతే తెలీదు). వైష్ణవి పసిపాప కావటం, ఇంకా తనని చంపిన తీరు... ఇవి కారణాలు. అదే వైష్ణవి స్థానంలో ఒక పేదవాడి కూతురు ఉన్నా... తను అలాంటి దారుణానికి గురైనా... జనం ఇలాగే స్పందిచేవారు.
"వైష్ణవి హంతకులను చంపితెనో లేక వరంగల్ లో స్వప్నిక మీద యాసిడ్ పోసిన వాడిని కాల్చి చంపితే సమస్య తీరిపోదు."
అలా చేయటం వలన సమస్య తీరదని ఎలా చెప్పగలరు? తప్పు చేసినవాల్లని కఠినంగా శిక్షిస్తేనే కదా అలాంటి తప్పు మరోసారి జరగకుండా అలాంటి నేరస్థుల్లో భయం పుడుతుంది? సమస్య తీరినా తీరకపోయినా అలాంటివాళ్ళకి కఠినంగా శిక్ష మాత్రం పడాల్సిందే.
ఈ విషయంలో పోలిసుల అసమర్ధత ఎంత వరకు ఉందొ నాకైతే తెలీదు. కానీ ఏదైనా తప్పు జరిగిన ప్రతిసారి అందరు ప్రభుత్వాన్ని, పోలీసులని తిట్టటం మాత్రం ఫాషన్ అయిపోయింది. అక్కడ కిడ్నాప్ జరుగుతుందని పోలీసులు ముందుగా ఊహించలేరు కదా! ఇప్పటికైనా పోలీసులు నిందితుల్లో ఒకరిని పట్టుకుంటే, అతను ఇచ్చిన సమాచారం వల్లనే కదా ఈ దారుణం బయటకి వచ్చింది?
సాధారణం గ తెలిసిన విషయాలకే మనం ప్రాధాన్యం ఇస్తాం ............ ఏంటండి ఇది విషయాలు తెలుస్కునే ప్రయత్నం చేయరా ???? ఏదో టీవీల్లో పేపర్లలో లొల్లి అయితే లేదా సదరు లింక్ ఎవరన్న ఫార్వార్డ్ చేస్తే అప్పుడు తెలుసుకుని స్పందిస్తే ఇంకా మానవత్వం అనేదానికి అర్ధం ఏముంది. పేపర్లో టీవీ లలో బాగా ఫేమస్ అయిన వార్తని మాత్రమె తెలుసుకుని దానికి మాత్రమే స్పందించే మనం " మనం బతుకుతుంది మనుషుల మద్యనేనా " అని హెడ్డింగ్ పెట్టకూడదు .
పసిపాప గాబట్టి ఇంత స్పందన ????
ముద్దులోలికె చిన్ని పాపలవే ప్రాణాలా???? ఇంకేవరివీ కావా ? చంపిన తీరు బట్టి స్పందనలా ????? అంటే నొప్పి తెలీకుండా చంపి ఉంటె మీ స్పందన వేరేలా ఉండేదా ????????? మనిషి ప్రాణాలకి విలువ ఇవ్వాలి ... పసిగుడ్డు అయిన పండు ముసలి అయినా ప్రాణం ప్రాణమే ....అందరి విషయంలో ఒకేలా స్పందించాలి మనం. నేను ఈ మాటకి ఎప్పుడూ కట్టుబడి ఉంటా
మీచివరి పాయింట్ చూస్తేనే .. మీకు ప్రస్తుత సమాజం లో సమస్యల మీద అవగాహన తక్కువ ఉన్నట్టు గోచరిస్తుంది.
@@@ఈ విషయంలో పోలిసుల అసమర్ధత ఎంత వరకు ఉందొ నాకైతే తెలీదు. కానీ ఏదైనా తప్పు జరిగిన ప్రతిసారి అందరు ప్రభుత్వాన్ని, పోలీసులని తిట్టటం మాత్రం ఫాషన్ అయిపోయింది. అక్కడ కిడ్నాప్ జరుగుతుందని పోలీసులు ముందుగా ఊహించలేరు కదా! ఇప్పటికైనా పోలీసులు నిందితుల్లో ఒకరిని పట్టుకుంటే, అతను ఇచ్చిన సమాచారం వల్లనే కదా ఈ దారుణం బయటకి వచ్చింది?
నేను అన్నది కింది స్థాయి పోలీసులు అని పోలీసులు అందరూ అని కాదు ... మీరు మరో మారు చదువుకోండి. సదరు ముద్దాయి విజయవాడ దాటే దాక చెక్ పోస్టులు మానేజ్ చేశాడు అది అసమర్ధత కాదా ???
ఇంకా మీరన్నారు ప్రభుత్వాన్ని ... పోలీసులను తిట్టడంఫాషన్ ఐపోయింది అని ... ముందు ప్రభుత్వం విషయం తెసుకుంటే అయేషా మీరా అనే ఒక యువతి హత్య గావించబడి సంవత్సరం దాటిపోయింది. హత్య చేసిన వారి పేరు ఆయేష తల్లి నెట్టి నోరు గోట్టుకున్నా ప్రభుత్వాన్మికి వినపడదా ?? స్ట్రిక్ట్ గా పని చేసే ఆ నాటి కమీషనర్ని ప్రభుత్వం హడావుడిగా ఎందుకు బదిలీ చేసింది ????? కేవలం వైష్ణవి హత్య చుట్టూ గిరి గీయకండి .. అనూష అనే అమ్మాయి మీద దాడి చేసి ఆమె తల్లి దండ్రులను అత్యంత కిరాతకంగా చంపిన వాడిని వదలం అని అనూషకి బాసట గా నిలుస్తాం అని ప్రభుత్వం ఆ రోజు హామీ ఇచ్చింది. మొన్నే ఆ హంతకుడు బెయిల్ మీద బయటకు వచ్చాడు. హామీ ఇచ్చిన ప్రభుత్వం మర్చిపోతే టీవీ చానల్స్ లో ఆమె ప్రోగ్రాం చూసి జనాలు ఫండ్ ఇచ్చారు ... సరేనా ఇలాంటి కొన్ని వందల అంశాల మూలంగా ప్రభుత్వాన్ని తిట్టే ఫాషన్ మీము అలవాటు చేసుకున్నాం .
@ శ్రీనివాస్
"విషయాలు తెలుస్కునే ప్రయత్నం చేయరా ???? ఏదో టీవీల్లో పేపర్లలో లొల్లి అయితే లేదా సదరు లింక్ ఎవరన్న ఫార్వార్డ్ చేస్తే అప్పుడు తెలుసుకుని స్పందిస్తే ఇంకా మానవత్వం అనేదానికి అర్ధం ఏముంది."
పేపర్ లో, టీవీలో, ఇంటర్నెట్ లో రాని వార్తలను తెలుసుకోవటం ఎలాగో తెలియచేయగలరు.
మీరు చెప్పిన గిరిజిన వాడల్లో జరిగిన/జరిగే దారుణాలని వివరంగా జనాల్లోకి తీసుకువచ్చే ప్రయత్నం (మీ ద్వార కాని, మీడియా ద్వార కాని) జరిగిందా?
అసలు ఏదో ఒకటి జరిగిందని తెలిస్తేనే కదా ఏదో రకంగా స్పందించగలం?
న్యూస్ లో కవర్ కాని విషయాలు తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఒక జర్నలిస్ట్ కావాలి. అది ఎంత వరకు సాధ్యం అంటారు!
"పసిపాప గాబట్టి ఇంత స్పందన ????
ముద్దులోలికె చిన్ని పాపలవే ప్రాణాలా???? ఇంకేవరివీ కావా ? చంపిన తీరు బట్టి స్పందనలా ????? అంటే నొప్పి తెలీకుండా చంపి ఉంటె మీ స్పందన వేరేలా ఉండేదా ?????????"
మీరు ప్రతీది స్ట్రైట్ గా కాకుండా మరోలా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఆ పాప ఎలా చనిపోయినా అందరూ స్పందిస్తారు... నేను చెప్పింది అది కాదు.
చిన్నపాపకి ఏదైనా దెబ్బ తగిలిందంటేనే "అయ్యో" అంటాము... అది అతి సహజం. అలాంటిది ఒక పసిపాపని అంత దారుణంగా బలి తీసుకుంటే...! దానిగురించి ఆ మాత్రం అతిగా స్పందించటం మీకు సహజంగా అనిపించకపోవటం... హ్మ్మ్.
ప్రాణం ఎవ్వరిదైనా ఒకటే... ఒప్పుకుంటాను.
"అందరి విషయంలో ఒకేలా స్పందించాలి మనం. నేను ఈ మాటకి ఎప్పుడూ కట్టుబడి ఉంటా"
మొన్నామధ్య బోరు బావిలో పడి ఒక బాలుడు మరణించినప్పుడు మీ బ్లాగ్ లో మీ స్పందనకి సంబంధించిన టపా ఉంది. ప్రతి రోజూ ఎంతో మంది చనిపోతున్నా... వాటి గురించి మీ స్పందనలేమి కనపడటం లేదే?
ఒక చిన్నారికి ఏదైనా జరిగింది అనగానే మనసు స్పందించటం చాలా సహజం. దాన్ని మీరు బూతద్దంలో ఎందుకు చూస్తున్నారో నాకు అర్థం కావటంలేదు.
"ముందు ప్రభుత్వం విషయం తెసుకుంటే అయేషా మీరా అనే ఒక యువతి హత్య గావించబడి సంవత్సరం దాటిపోయింది."
నేను కేవలం వైష్ణవి విషయం గురించి మాత్రమే ప్రస్తావించాను. ప్రభుత్వం, పోలీసులు ఫెయిల్ అయిన కేసులు చాలా ఉన్నాయి. వాటి గురించి చర్చించటమో, వాళ్ళని సమర్ధించటమో నా ఉద్దేశం కాదు.
మానవత్వం మంటగలిసింది దారుణం !
చిన్నారి వైష్ణవి కొలిమిలో మసైన తరువాత పరిశీలనలో తేలిన విషయాలుఃప్రకాశం బ్యారేజి, కనకదుర్గవారధి,కృష్ణానది ఎన్నో హత్యలకు మూగసాక్షులుగా ఉన్నాయి.
విజయవాడ నగర నేరగాళ్లు హత్యలు చేసి మృతదేహాలను తాడేపల్లిమండలం సీతానగరం లో పడవేస్తున్నారు.మహిళలను వంచించి, మోసగించి వారిని శారీరకంగా, ఆర్థికంగా దోచుకుని తాడేపల్లి ఏరియావైపు తీసుకువచ్చి దారుణంగా హతమారుస్తున్నారు.విజయవాడ-మంగళగిరి బైపాస్‌రోడ్డు వెంబడి మృతదేహాలను కాల్చివేస్తున్నారు.కృష్ణానది దాటించి కృష్ణాయపాలెం వద్ద మృతదేహాలను గోనెసంచిలో కుక్కి కొండవీటివాగులో గిరాటేసి వెళ్లిపోతున్నారు. కృష్ణానదిలో తేలియాడే శవాలను ఇటునుంచి అటు, అటు నుంచి ఇటు నెట్టివేసుకుంటూ తమ పరిధి కాదంటూ తప్పించుకుంటున్నారు.మంగళగిరి నుంచి కృష్ణాకెనాల్ జంక్షన్ వరకు హతుల మృతదేహాలను రాత్రివేళల్లో రైల్వేట్రాక్‌పై పడవేస్తున్నారు.కిడ్నాప్ చేసి తాడేపల్లి బకింగ్‌హామ్ కెనాల్ వద్ద వాహనాలు మార్చి తీసుకువెళుతున్నారు. తాడేపల్లిని కూడా విజయవాడ పోలీసు పరిధిలోకి తేవాలి.
"మనం బ్రతుకుతుంది మనుషల మధ్యేనా!?" నాకు వచ్చిన మొదటి ఆలోచన ఇదేనండి. ఇది అమానుషమైన చర్య.
అవును శ్రీనివాస్,
ఆ డ్రైవర్ గురించి ఒక్క ఛానెల్ అన్నా చూపిస్తుందేమో అని చూశాను. ఈ రోజు ఉదయం ఒక ఛానెల్ మాత్రం వాళ్లంతా ఇళ్ళకు తాళం వేసి బంధువుల ఇళ్లకు వెళ్ళిపోవడంతో ఎవరూ అందుబాటులో లేరని మాత్రం చెప్పారు.
అతనిదీ ప్రాణమే కదా! అతనికీ కుటుంబం, పిల్లలు ఉన్నారు. ఈ గొడవంతా సర్దుకున్నాక ప్రభాకర్ ఫామిలీ అతని వారికి ఏదైనా సహాయం చేస్తారేమో చూడాలి!
అలాగే కొన్ని ఛానెళ్ల వాళ్ళు మా ఖాకీల పనికి మాలిన తనాన్ని క్షమించమ్మా అని కవిత్వం చదివారు. కిడ్నాప్ చేసిన గంటలోనే పిల్లను చంపేస్తే పోలీసులు ఏం చేయగలుగుతారు? వాళ్ల ప్రయత్నం వాళ్ళూ చేశారు. పిల్ల తండ్రి కూడా కుటుంబ కలహాల గురించి చివర్లో చెప్పటం కూడా ఒక కారణమే!
నిజంగానే ఈ వ్యవస్థను బాగు చేసుకోకపోతే ఏదో ఒక రోజు టీవీ చూస్తూ మనమూ గుండెపోటు తెచ్చుకోవలసి వస్తుందేమో!
ఏదేమైనా కూతురు, తండ్రి కొన్ని గంటల వ్యవధిలో మరణించడం ఎంతో ఎంతో విషాదం! ఆ పాపను ఎంతగా ప్రేమించాడో ఆ తండ్రి, ఆమెలేని ప్రపంచంలో ఉండటానికి ఇష్టపడలేదు.
మనం ఖచ్చితం గా మనుషుల మధ్యే జీవిస్తున్నాం.. కాబట్టే ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఇంతగా స్పందిస్తున్నాం..
"ఒక పసిపాపని అంత దారుణంగా, కేవలం డబ్బు కోసం, చంపినా వాళ్ళు మారతారని మీరు అనుకుంటున్నారా?" అని అడిగారు కదా ..
విజవాడ లో MCA అమ్మాయి ని క్లాసు రూం లోనే హత్య చేసిన మనోహర్ గుర్తున్నాడా ... అతనికి మరణ శిక్ష పడింది.. తరువాత అది జీవిత ఖైది గా మారింది.. ఇప్పుడు అతను మానసిక వికాసానికి పుస్తకం రాయడమే కాకుండా .. జైలు సిబ్బంది మానసిక ఉల్లాసానికి .. వికాసానికి. ద్రుడత్వానికి జైలు లో క్లాసు చెప్తునాడు.. నేను అనేది మారే అవకాశం ఇమ్మని.. అలా అని నేను ఉరి శిక్ష వద్దు అని కుడా అనట్లేదు. ఏదైనా చట్ట పరిధి లో జరగాలి అని అంటున్నా...
http://epaper.sakshi.com/Details.aspx?id=373788&boxid=28596068
Good discussion..so far..
We are discussing on mentally retarted people. They don't have control on their actions and what they are doing to others. It is very much important that one should keep in mind that how one's actions are effecting the society.. pity..
They should be taken to mental hospital.
Post a Comment