Monday, January 25, 2010

ఎవరి పిచ్చి వాళ్లకి ఆనందం

"నేను కవిని కాదన్న వాణ్ణి కత్తితో పొడుస్తా
నేను రచయిత్రిని కాదన్న వాణ్ని రాయెత్తి కొడతా"
అని చంటబ్బాయ్ లో శ్రీలక్ష్మి అనే డైలాగ్ గుర్తుందా?

అచ్చు అలాగే నేను కూడా "నేను పైంటర్ ని కాదన్నవాణ్ని పెన్నెత్తి పొడుస్తా" అన్న టైపులో...
ఎవరేమన్నా సరే... నాకు చేతకాకపోయినా సరే... బొమ్మలు వేయటం మాత్రం ఆపను :D
ఈమధ్య చాలా కాలం గ్యాప్ వచ్చింది.
ప్రతి సంవత్సరం సంక్రాంతి టైంలో మా ఆఫీసు కాంపస్ లో రంగోలి competition ఉంటుంది. ఈసారి పెయింటింగ్, ఫోటోగ్రఫి contests కూడా పెట్టారు. దాంతో మళ్ళీ నా చేతికి దురద పుట్టేసింది. కానీ చాలా కాలమయ్యే సరికి అనుకుంట... ఎంత ప్రయత్నించినా సరైన బొమ్మ ఒక్కటి కూడా వేయలేకపోయాను.
చివరికి ఇది వేసి... ఏదో వేసాననిపించాను...



నాకైతే అంత నచ్చలేదు. మరీ ఫస్ట్ క్లాసు బాబు వేసినట్టుగా ఉంది కదూ?
watercolors మాత్రమే వాడాలి అన్నారు. అది తెలియగానే ఎగిరి గంతేసాను. ఎందుకంటే నాకు watercolors అంటేనే ఇష్టం (వేరేవి అసలు ప్రయత్నించలేదనుకోండి ఎప్పుడూ.. అది వేరే విషయం). కానీ A3 సైజు చార్ట్ పేపర్ మీద మాత్రమే వేయాలి అన్నారు. అది తెలియగానే... ఎగిరినదాన్ని అలాగే ధబేల్ మని పడిపోయాను. చార్ట్ పేపర్ మీద watercolors... నా మొహంలా వస్తుంది.. అని అనుకుంటూనే ఏదో ట్రై చేసాను. నేను అనుకున్నట్టే నా మొహం లానే వచ్చింది.
ఈరోజు తెలిసింది submission డేట్ extend చేసారని. రేపెలాగు సెలవే కాబట్టి... వీలైతే మళ్ళీ ఒకసారి ప్రయత్నించి చూడాలి.

18 comments:

శ్రీనివాస్ said...

ఈ పైయిన్టింగ్ లో ఒక అర్ధం ఉంది. బహుస వేసిన వాళ్ళకే అది తెలీదు. చెట్టు నరికేశారు . అప్పుడు సర్జీ ఆత్మ చెట్టులో దూరింది. అప్పుడు అయన ప్రజలకి ఐడియా సెల్ ఫోన్ ఇచ్చాడు. మొక్క మొలిచింది .... పక్షులు వాట్ యాన్ ఐడియా సర్జీ అనడానికి ఎగురుతున్నాయి. సూర్యుడు ఉదయించాడు. మొక్కలు మొలిచాయి.

Unknown said...

Are you working in VBIT,Hyderabad?

శ్రీకర్ బాబు said...

మీ painting శ్రీనివాస్ గారు మంచి అర్థాలు ఇచ్చారు. ఇదేదో బాగుందే ముందు బొమ్మ గీచి తర్వాత అర్థాలు వెతుక్కోవడం.

thinker said...

mee moham chaalaa baaagundandi

చైతన్య.ఎస్ said...

హ్మం ...
రేపటి ప్రయత్నానికి ఆల్ ది బెస్ట్
ఆదరగోట్టేయండి మరి ... ఎల్లుండికి మరి బ్లాగ్లో పెట్టేయండి దాన్ని కూడా.

మధురవాణి said...

బొమ్మ నాకైతే నచ్చింది.. ఈ లెక్క ప్రకారం మీ మొహం కూడా బాగుంటుందేమో అనిపిస్తుంది ;-)

శరత్ కాలమ్ said...

పెయింటింగులో మీకంటే రెండో గ్రేడ్ చదువుతున్న మా చిన్న పాప బెటరేమో తెలియదు గానీ అందులోని సందేశం బావుంది.

కత పవన్ said...

"నేను పైంటర్ ని కాదన్నవాణ్ని పెన్నెత్తి పొడుస్తా"

మీరు పేయింటర్ కాదు మాహా పేయింటర్ ..అ పేన్ను తో పోడవకండి బాబు :))

చైతన్య said...

@ శ్రీనివాస్
నేను వేసిన అర్థం అయితే నాకు తెలుసు కాని... మీరు చెప్పిన అర్థం ఏంటో నాకు అర్థం కాలేదు !

@ sree
yes

చైతన్య said...

@ శ్రీకర్ బాబు
పైటింగ్ వేసాక అర్థాలు వెతుక్కోవటం కాదండి... నేను కాన్సెప్ట్ అనుకున్నాకే అది వేసాను. నా కాన్సెప్ట్ ఏంటో ఆ బొమ్మ క్రిందే వ్రాసాను కూడా :)
శ్రీనివాస్ గారు ఏదో కొత్త అర్థం చెప్పారు అంతే :)

@ thinker
హి హి హి...

చైతన్య said...

@ చైతన్య ఎస్
థాంక్స్ అండి :)

@ మధుర వాణి
మీరేదో మొహమాటానికి అంటున్నారని అర్థమైంది లెండి :)

చైతన్య said...

@ శరత్
నేను ముందే చెప్పాను కదండీ... ఇది ఫస్ట్ క్లాసు బాబు వేసినట్టుందని... మీ పాప సెకండ్ క్లాసు అంటే తప్పకుండా బెట్టేరే అయి ఉంటుంది మరి :)

@ పవన్
పొడవను లెండి... ఆ భయంతో మీరు అంత 'మహా' అబద్దాలు చెప్పకండి :D

anveshi said...

Hi chaitanya

how r u??

బావుంది.మంచి అలోచన.ఇది కూడా ఒక సారి చూడండి.:)
http://img202.imageshack.us/img202/7384/1000982.jpg

Unknown said...

Go green concept ఐతే, ఇంకా బాగా తప్పకుండ ప్రయత్నించచ్చు ఏమో. మీకు తప్పకుండా ఆ talent ఉంది.
వృక్షో రక్షతి రక్షితః !! అని caption పెట్టి ఈ లింక్ లో photo వంటి ది గీయచ్చు.
http://www.indrajit.in/images/save-tree.jpg
లేదా భారత దేశ map/earth green గా , with trees and without -dry గా గీయచ్చు.

చైతన్య said...

@ అన్వేషి
సూపర్ గా ఉండండి పైంతింగ్... లవ్ ఇట్!

@ శ్రావ్య
మీరు చెప్పిన కాప్షన్, ఆ ఫోటో... just wonderful... గ్రేట్ ఐడియా!

Anonymous said...

చైతన్య గారు చదివారా మరి రమేష్ కందుకూరి గారి రచనలు.
అన్నట్లు మీ పైన్టింగ్ బావుంది.
శ్రీనివాస్ గారు జోక్ చేసారు ఎందుకలా ఉడుక్కుంటారు

kiraN said...

చార్ట్ పేపర్ మీద వాటర్ కలర్స్ వేస్తే ఇలా ముడతలు పడుతుంది అని కూడా చెప్పండి మీ పెయింటింగ్ ని సబ్మిట్ చేసేటప్పుడు.
బాగుందా బాలేదా అనేది ప్రశ్నే కాదు, ప్రయత్నించామా లేదా అనేదే ముఖ్యం.

- కిరణ్
ఐతే OK

చైతన్య said...

@ మనోశ్రీ
లేదండి... ఇంకా చదవలేదు :(

@ కిరణ్
అవును... ఎలా అయినా participate చేయాలన్న ఉద్దేశంతోనే ప్రయత్నించాను.