బాపు గారి మిస్టర్ పెళ్ళాం సినిమాలో ఆమని డైలాగ్ గుర్తుంది కదా...
"కలలు కాదండీ గోపాల్ గారూ కళలు... fine arts"
దాన్నే మనం తారుమారు చేసాం అన్నమాట. ఎందుకంటే మన పోస్ట్ 'కల'ల గురించి కాబట్టి :D
(ఈ పోస్ట్ చేయాలి అనుకోగానే... ఎందుకోగాని ఆ డైలాగ్ గుర్తొచ్చింది... అందుకే అలా పెట్టేసా టైటిల్ :D)
నాకు ఒక్కోసారి నిద్రలో వచ్చే కలలు (ofcourse ఎవరికైనా కలలు నిద్రలోనే వస్తాయనుకోండి :P) అలా గుర్తుండిపోతాయి. కొన్ని ఆ రోజంతా గుర్తుంటాయి... కొన్ని ఎన్ని రోజులైనా గుర్తుంటాయి! అన్నిటికీ కాకపోయినా మనకి వచ్చే కొన్ని కలలకి తప్పకుండా ఏదో ఒక అర్థం ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఈ విషయం మీద ఆల్రెడీ చాలా మంది చాలా బుక్స్ కూడా వ్రాసేసారు (నేనేం చదవలేదనుకోండి, అది వేరే విషయం).
కొన్ని కలలైతే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు తప్పకుండా వాటికి ఏదోఅర్థం ఉంది అనిపిస్తుంది.
కలలని అనలైస్ చేయటం చాలా పెద్ద విషయం. నాకైతే అందులో కొంచం కూడా అనుభవం లేదు.
కానీ మొన్న ఒకరోజు మా ఫ్రెండ్ కి ఒక కల వచ్చింది. అది చాలా విచిత్రంగా ఉందని చెప్పింది. మా ఇద్దరికీ కామన్ ఫ్రెండ్ ఇంకో అమ్మాయికి డెలివరీ అయినట్టు (ఆ అమ్మాయి ఆల్రెడీ క్యారీయింగ్) ... తనకి ముగ్గురు పిల్లలు పుట్టినట్టు. ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. అబ్బాయి చాలా అందవిహీనంగా ఉన్నట్టు, కానీ కాసేపట్లోనే మంచిగా అయిపోయినట్టు... అంతలోనే ఏదో సముద్రం... ఇంకా నీళ్ళల్లో చేపలు. ఇలా అర్థం పర్థం లేని combination లో ఉంది ఆ కల. సరే దాని అర్థం ఏంటో తెలుసుకుందామని గూగులమ్మని అడిగితే... అలాంటి కల వస్తే దాని అర్థం తను ప్రేగ్నంట్ అయి ఉండొచ్చు అని ఉంది. మేము పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు కానీ, సరిగ్గా అది జరిగిన నాలుగు రోజులకి తెలిసింది తను నిజంగానే క్యారీయింగ్ అని!
ఇలాంటివి జరిగినప్పుడు ఇంకా నమ్మకంగా, ఆసక్తిగా అనిపిస్తుంది. అందుకే నాకు తరచుగా వచ్చే కొన్ని కలల మీద గూగుల్ చేసి చూసాను. కానీ పెద్దగా ఏమీ సమాచారం దొరకలేదు. ప్చ్...
ఇవి నా కలలు... గూగుల్ చేస్తే నాకు దొరికిన వాటి అర్థాలు...
౧. మా ఊరులోని మా పాత (అమ్మేసిన) ఇల్లు... ఎక్కువగా రాత్రి పూట, ఎవరూ లేకుండా... భయం భయంగా...
గూగుల్ చేస్తే తెలిసిన సమాచారం... disturbed childhood
౨. ఆత్మలు (దెయ్యాలు)... ఒక్కోసారి ఏదో తెలిసినట్టు అనిపించే ఇంట్లో...
౩. ఏదో బస్సులో నుండో... మరో చోటనుండో పడిపోతునట్టు...
దీని అర్థం... మనలో ఏదో భయాలు ఉన్నట్టు అంట.
౪. రోడ్ క్రాస్ చేస్తూ... చేయలేకపోతున్నట్టు... రోడ్ మధ్యలో ఉండిపోయినట్టు...
౫. బస్సు కోసం లాస్ట్ మినిట్లో వచ్చినట్టు... అలా వస్తు ఏవేవో ముఖ్యమైన వస్తువులు మర్చిపోయినట్టు... వాటికోసం వెళ్తే బస్సు మిస్ అయిపోతుందేమో... అన్న confusion...
దీని అర్థం... ఆ బస్సు / ట్రైన్ జర్నీ మన లైఫ్ జర్నీ అంట. ఏదో oppurtunity వచ్చినట్టు... అది మిస్ అవుతున్నట్టు... లేదా మిస్ అవుతామేమో అన్న భయం ఉన్నట్టు.
౬. బాగా తెలిసిన మనుషులు... ఒక్కోసారి ఎప్పుడో దూరమైపోయిన వారు... ఒక్కోసారి అస్సలు ఎప్పుడూ చూడని వారు...
౭. సాయి బాబా... ఒక్కోసారి నన్ను చూసి నవ్వుతున్నట్టు... ఒక్కోసారి ఏమీ expression లేకుండా...
ఇది మన నమ్మకమంట. బాబా (లేదా ఎవరైనా దేవుడు) మాట్లాడుతుంటే దాని అర్థం తను మనకి ఏదో సలహా ఇస్తున్నట్టు అంట. తన expression ని బట్టి అర్థం చేసుకోవాలి. ఒక్కోసారి అది మనలో ఉన్న గిల్ట్ ఫీలింగ్ కూడా అవ్వొచ్చంట.
౮. పాము... చిన్న చిన్నవి కొన్ని... లేదా పెద్దది...
ఇది అనలైస్ చేయటానికి చాలా కష్తం అంట. దీనిలో చాలా variations ఉండొచ్చు అంట. ఆ వ్యక్తికి పాములంటే ఉండే భయం కూడా అవ్వొచ్చంట.
౯. కుక్క(లు)
దీని అర్థం సెల్ఫ్ క్యారెక్టర్ అంట. అవి against గా ఉంటే... మనం ఏదో పని మన క్యారెక్టర్ కి against గా చేస్తున్నట్టు అంట.
౧౦. ఒక్కోసారి ఎవరో చనిపోయినట్టు... ఒక్కోసారి పెళ్లి జరుగుతున్నట్టు...
ఇంకా ఉన్నాయేమో... ప్రస్తుతానికి ఇవే గుర్తొచ్చాయి.
నాకు దొరికిన ఆ అర్థాలన్నీ నిజమో కాదో, అసలు నిజంగా వీటికేమైనా అర్థాలు ఉన్నాయో లేదో నాకు తెలీదు కానీ... తరచుగా వస్తుండటం వల్లన ఏదో అర్థం ఉండే ఉంటుందేమో అని నా నమ్మకం. తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంటుంది. హ్మ్మ్...
Picture Courtesy: Internet
17 comments:
మేలకువాగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు మనకి వచ్చే ఊహలకి సెకండ్ హాఫ్ కలలు
నిద్రపొయెప్పుడు మన ఊహల మీద మనకి కంట్రోల్ ఉండదు కనుక కలలని అదుపు చేయలేము అదన్నమాట
very interesting..!
మీ స్నేహితురాలికి జరిగిన సంఘటన మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంది. నాక్కూడా ఏవేవో కలలు వస్తుంటాయి. గూగుల్ చేయాలనిపిస్తోంది మీలాగా ;)
పాములు ... నాకు తరచూ వచ్చేస్తుంటాయి :(
ఇక ఏవైనా లాంగ్ జర్నీలు చేసేటప్పుడు ముందు రోజు ఖచ్చితంగా కల వస్తుంది .. అందులో నేను టికెట్ మర్చిపోయినట్టు :)
అరిసెలు = కజ్జాయిలు
గారెలు = వడలు
కారప్పూస = కార బూంది
ఆవడ = పెరుగు వడ
ప్రసాదు ఇవి అన్ని గుర్తు చేసినందుకు ... అన్ని తిని బిల్ మీకు పంపుతా ;)
మా పెద్ద పాపకి కలల మీద చాలా అవగాహన వుంది. రోజూ వాటి మీద చాలా ప్రయోగాలే చేస్తోంది. ల్యూసిడ్ డ్రీంస్ శాస్త్రాన్ని బాగా అవపోసన పట్టి ఆ కలల కోసం బాగా శ్రమిస్తోంది కానీ ఇంతవరకూ విజయం లభించలేదు. ఈ మధ్య కాస్త నిస్పృహకు లోనయ్యి నా సహాయం అడిగింది. నేనేం చేయగలను నాకేమీ అలాంటి విషయాలు తెలియదు కదా అన్నాను. ల్యూసిడ్ డ్రీంస్ గురించి చదివి, ప్రాక్టీసు చేసి, తనని గైడ్ చేయాలంటా. బాప్రే బాప్. నా వల్ల కాదని చెప్పాను.
నాకు కూడా చాలా చాలా కలలు వస్తాయి.అదేమిటో కాని చాలా మటుకు గుర్తు కూడా ఉంటాయి. ఒక్కోసారి కొత్త కొత్త మొహాలు కూడా కనిపిస్తాయి ఏంటో.ఈ book చదవండి చైతన్యా..Interpretaion of dreams by Sigmund Freud. I am sure it would be an interesting read for you.
@ శ్రీనివాస్
అది కూడా ఒకరకంగా నిజమే. మన ఊహలు, ఆలోచనలు మనకి తెలీకుండానే మన sub -concious మైండ్ లో రిజిస్టర్ అయిపోయి ఉంటాయి... ఒక్కోసారి అవే కళల రూపంలో వస్తాయి... అని ఎక్కడో చదివాను.
@ మధురవాణి
అవును... తనకి అలా జరిగినప్పటి నుండే ఈ subject మీద ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది :)
@ చైతన్య ఎస్
హ్మం పాములు నాక్కూడా తరచుగా వస్తుంటాయి. ఈ మధ్య కొంత కాలం నుండి రావటం లేదు.
మీ అరిసెల కామెంట్ నాగ ప్రసాద్ గారి బ్లాగ్లో పడాల్సింది అనుకుంట... :)
@ శరత్
అవునా... మీ పాపకి కూడా ఇంట్రెస్ట్ ఆ... అయితే తన దగ్గర చాల సమాచారం ఉండే ఉంటుంది ఈ సబ్జెక్టు మీద! కాస్త నా కలలకి అర్ధాలేంటో కనుక్కుని చెబుదురూ...
@ శ్రావ్య
తప్పకుండా ఆ బుక్ సంపాదించి చదవటానికి ప్రయత్నిస్తాను. మీరు ఆ బుక్ చదివారా? కలల గురించి ఏమైనా interesting సంగతులు తెలుసుకున్నారా?
ఇలాంటి కలలు తరుచూ చాలా మందికి వస్తుంటాయి . అఫ్ కోర్స్ నాకూ చాలా సార్లు వచ్చాయి . మా పిన్ని వాటి అర్ధాలు భలే చెప్పేది . అన్నిటికీ ఒకే చివరి అర్ధం అభధ్రతాభావం . రెస్ట్ లెస్ నెస్ అంతే .
నాకు ఎక్కువగా సైంటిఫిక్ ఫిక్షన్ కలలు వస్తాయి, కొత్త రకాల ఫ్లయింగ్ జెట్స్ ఎక్కినట్టు, గాగుల్స్ పెట్టుకుంటే మనం చూసే వస్తువులు ఇంకా తిరిగే రోడ్ల వివరాలు వాటిలో కనిపిస్తున్నట్టు, అన్నీ ఇటువంటివే వస్తుంటాయి.
ఇంకా నాకు ఎత్తైన ప్రదేశాలంటే ఇష్టం, అవి కూడా కలలో వస్తాయి కాని హఠాత్తుగా వాటిపై నుంచి పడిపోయినట్టు వస్తాయి.
- కిరణ్
ఐతే OK
చదివాను చైతన్య ! చాలానే విషయాలు ఉన్నాయి.India లో ఉన్నప్పుడు చదివా. మీరు కూడా చదివి చెప్పండి ,softcopy బహుశా esnips మీద ఉండచ్చు . ప్రయత్నించండి.
నేను అనారోగ్యంతో బాధపడేటప్పుడు, ప్రతిరోజూ నాకు చాలా రకాల కలలొచ్చేవి. అప్పట్లో తినడానికి నాలుగు గంటలు మినహాయించి మిగతా ఇరవై గంటలూ నిద్రపోయేవాడిని. :)))
ఆరోగ్యం కుదుటపడ్డాక, కలలు రావడం తగ్గిపోయాయి. :(((
మీ మూడోకల ఒకప్పుడు చాలా రోజులు వెంటాడింది నన్ను.. కలల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి లేనివాళ్ళు అరుదుగా ఉంటారేమో బహుశా..
@ మాలా కుమార్
నిజమేనేమో!
@ కిరణ్
నాకు మీలో ఒక పేద్ద సైంటిస్ట్ కనిపిస్తున్నాడు :D
@ శ్రావ్య
తప్పకుండా ప్రయత్నిస్తానండి చదవటానికి :)
@ నాగ ప్రసాద్
కలలు రావటం తగ్గాయో, లేదా మీకు గుర్తు ఉండటం లేదో! ఏదైనా సరే దాని అర్థం మీకు మంచి నిద్ర పడుతుందని... గుడ్ :)
@ మురళి
ఆ మూడో కల చాలా మందికి కామన్ అనుకుంట... వేరే ఫ్రెండ్ కూడా ఒకరు చెప్పారు అటువంటి కల వస్తుందని!
నిజమే... ఆ ఆసక్తి లేని వారు చాలా అరుదుగా ఉంటారేమో!
Post a Comment