శ్రీకర్ కి ఈమధ్యనే పెళ్లయింది. అమ్మాయి పేరు అనిత. బాగా చదువుకుంది. అమ్మాయి నచ్చటానికి అదే ముఖ్యమైన కారణం. సంబంధం కూడా బాగా తెలిసిన వాళ్ళ ద్వారా రావటంతో వాళ్ళ గురించి పెద్దగా ఏమి వివరాలు కనుక్కోకుండానే పెళ్లి నిశ్చయించేసారు. అనిత వాళ్లు అంతగా డబ్బున్నవాళ్ళు కాకపోవటం తో సగం పైన పెళ్లి ఖర్చులు కూడా శ్రీకర్ వాళ్ళే పెట్టుకున్నారు. అంతా ఒక నెలలో జరిగిపోయింది.
అనిత ఇంట్లో ఎవరితో కలివిడిగా ఉండేది కాదు. పెళ్ళైన మరుసటి రోజు నుండే ప్రతి చిన్నవిషయానికి ఏదో ఒకగొడవ చేసేది. కొత్త మనుషులతో సర్దుకుపోవటానికి కాస్త సమయం పడుతుందిలే అనుకున్నారు.
కొంత కాలం విడిగా కాపురం పెడితే వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుందని మరో ఇల్లు చూడమని శ్రీకర్ కి చెప్పారు వాళ్ళ నాన్నగారు. దానికి అనిత ఒప్పుకోలేదు. కలిసే ఉండాలని పట్టుబట్టింది. తనకి అర్థమయ్యేలా నచ్చచెప్పాలని ప్రయత్నించేవారు.
ఒక రోజు ఉన్నట్టుండి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. శ్రీకర్, వాళ్ళ నాన్నగారు కూడా అనితని ఇంటికి తీసుకురావటానికి వెళ్ళారు. కానీ తను రాలేదు.
కొంత కాలం గడిచాక, ఉన్నట్టుండి ఒకరోజు శ్రీకర్ వాళ్ళ ఇంటికి పోలీసులు వచ్చారు. అనిత శ్రీకర్ పైన, శ్రీకర్ కుటుంబం పైన కంప్లైంట్ ఇచ్చింది... కట్నం కోసం వేదిస్తున్నారని. పోలీసులు శ్రీకర్ ని రిమాండ్ లో ఉంచారు. బెయిల్ రావటానికి మూడు రోజులు పట్టింది.
అనిత చదువుకుంది. తెలివైంది. చాలా తెలివిగా శ్రీకర్ కుటుంబాన్ని 498A సెక్షన్ లో ఇరికించింది. కట్నం వేదింపులకి బలైపోతున్న ఆడవాళ్ళ కోసం 1983 లో ఈ సెక్షన్ ని అమలులోకి తెచ్చారు.
ఈ సెక్షన్ ప్రకారం భార్య కంప్లైంట్ ఇవ్వగానే ఏ రకమైన ప్రాధమిక విచారణ జరపకుండానే భర్తని, వారి కుటుంబ సభ్యులని అర్రెస్ట్ చేయొచ్చు. అంతే కాదు... ఒకవేళ అది తప్పుడు కంప్లైంట్ అని తేలినా కూడా దానికి ఏ రకమైన ఫైన్ కానీ, మరే రకమైన action తీసుకోవటం కానీ ఉండదు.
స్టేషన్ లో ఉన్నా రెండు రోజుల్లో శ్రీకర్ కి ఈ రకమైన తప్పుడు కంప్లైంట్స్ కి బలైన మరికొందరు పరిచయం అయ్యారు. అందులో ఒకరు ఒక ప్రముఖ టీవీ ఛానల్ లో న్యూస్ రీడర్. మంచి పోసిషన్ లో ఉన్నా కూడా ఏమి చేయలేక చేయని తప్పుకి స్టేషన్ లో దోషి లాగా గడపాలిసి వచ్చింది అతనికి.
ఒకరు ప్రభుత్వ ఉద్యోగి. ఏ రకమైన కేసు లో అయినా ఇరుక్కుని జైలు లో ఉంటే అతని ఉద్యోగం పోతుంది. ఆ కేసు తప్పుడు కేసు అని ఎప్పటికో తేలినా, ప్రస్తుతం జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఇలాగే మరి కొంతమంది! ఆ ఒక్క స్టేషన్ లోనే రోజుకి కనీసం మూడు, నాలుగు కేసులు నమోదయ్యేవి. అందులో ఎక్కువ శాతం చదువుకున్న అమ్మాయిలు ఇచ్చినవే. వాటిలో తప్పుడు కేసులే ఎక్కువ. ఇలాంటి కేసుల్లో ఇరికించి డబ్బులు డిమాండ్ చేయటం ఒక బిజినెస్ లాగా మారింది.
The center for Social Research India వారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం... ఈ సెక్షన్ క్రింద నమోదు అయిన కేసుల్లో 60.5 శాతం తప్పుడు కేసులే అని తేలింది.
మరొక research ప్రకారం ఈ సెక్షన్ ఎక్కువగా abuse అవుతున్న రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మరియు పంజాబ్.
ఈ తప్పుడు కేసుల వలన ప్రతీ సంవత్సరం 52,000 కి పైగా అమాయక భర్తలు ఆత్మహత్యలకి పాల్పడుతున్నారు.
కట్నం వేధింపులకి, గృహ హింసలకి బలైపోతున్న ఆడవాళ్ళ కోసం రకరకాల చట్టాలున్నాయి. కానీ ఆ చట్టాల బారిన పడి... ఇటువంటి తప్పుడు కేసులకి బలైపోతున్న అమాయక భర్తల కోసం ఏ చట్టం ఉంది !?
***
External links:
1. Dowry law in India
2. Abuse of 498A
3. Misuse of 498A
16 comments:
ఎవరి క్షేమం కోసం ఐతే ఈ చట్టాలు రూపొందాయో వాళ్ళే దుర్వినియోగం చేయడం ..... మన దురదృష్టం.
హ్మం ..
ఇదే కాకుండా ఇంకా 'కొన్ని' చట్టాలు కుడా దుర్వినియోగం అవుతున్నాయి.
మన న్యాయవాదులు చట్టాలకు ఉన్న లొసుగులు పట్టు కోవటంలో ముందుంటారు.
వికటకవి గారి వ్యాఖ్యే నాదికూడాను.
this is so true. I have seen this in the case of one of my own friends. finally he ended up giving loads of money and got rid of her.
stupid law makers /judiciary should open their eyes.
ప్చ్...మగవాళ్ళు. :( :(
ఈమధ్యకాలంలో హిమాలయాల్లో రద్దీ పెరుగుతోందంటే ఏమో అనుకున్నా. నిజమేనన్నమాట.
త్వరలోనే మగాళ్ళను పురిట్లోనే చంపే రోజులొచ్చేలా ఉన్నాయి. :(
చట్టాలను దుర్వినియోగం చేసే స్త్రీలు నశించాలి. అమయాక మగవాళ్ళు వర్థిల్లాలి.
వామ్మో చాలా జాగ్రత్తగా ఉండాల్రా నాయనోయ్ :-)
@ నాగప్రసాద్:
You rock man :)
మీరు చెప్పేది నమ్మశక్య౦గా లేదు. లేక, మీరు సమగ్ర౦గా చెప్పలేదు. ఒక చదువుకున్న అమ్మాయి, అనవసర౦గా ఎ౦దుకు తన కాపురాన్ని చెడుపుకు౦టు౦ది.
కనీస౦ పుట్టి౦టికి కూడా చెప్పుకోలేని ఎన్నో బాధలు అనుభవిస్తూ, భర్తలను భరిస్తున్న ఎ౦తోమ౦ది నా కళ్ళెదురే ఉన్నారు. నిజ౦గా బాధపడే అమ్మాయిలు చాలామ౦ది, ఈ చట్టాన్ని వినియోగి౦చుకోవట౦ లేదు.
@ శ్రీనివాస్, చైతన్య, వీరుభోట్ల, బుడుగు
దీనిని ఎలా సరిదిద్దోచ్చో మీకేమైనా తెలుసా!?
@ నాగప్రసాద్, రవిచంద్ర
అవును... జాగ్రత్తగానే ఉండాలి! ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇలాంటివి మాత్రం తప్పించుకోవటం కష్టమే!
@ పెదరాయ్డు
నమ్మశక్యంగా లేకపోయినా... ఇదే నిజం!
మీరన్నట్టు నేను సమగ్రంగా చెప్పలేకపోయి ఉండొచ్చు. కానీ ఇది మాత్రం నూటికి నూరుపాళ్ళు నిజం. నేను పోస్ట్ లో ఉదాహరించిన కథ కూడా నిజానికి కథ కాదు... నిజంగా జరిగిందే... నేనే దానికి సాక్ష్యం. ఇదే కాదు, ఇదే తరహాలో జరిగిన మరో రెండు కేసులు కూడా తెలుసు నాకు.
చదువుకున్న అమ్మాయిలు ఎందుకు తమ కాపురం పాడు చేసుకుంటారంటే... అది వాళ్ళకే తెలియాలి. వారి భవిష్యత్తు కంటే వాళ్ళకి డబ్బే ప్రధానమైతే.. ఏమైనా చేస్తారు. ఇది నేను స్వయంగా చూసాను.
"నిజ౦గా బాధపడే అమ్మాయిలు చాలామ౦ది, ఈ చట్టాన్ని వినియోగి౦చుకోవట౦ లేదు."
ఇది నేను కూడా అంగీకరిస్తాను.
సరైన పద్దతిలో ఉపయోగించుకోవాల్సిన వాళ్ళు ఆ పని చేయటం లేదు కానీ... దుర్వినియోగం చేసేవాళ్ళ సంఖ్య మాత్రం చాలా ఎక్కువగానే ఉంది!
నిజమే అసలు బాధితులు ఈ చట్టం ఉపయోగించుకోవటం లేదు కాని చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న వాళ్లే ఎక్కువ కనపడుతున్నారు.
చైతన్య గారన్నట్లు చదువుకున్న అమ్మాయిలల్లో చాలా వింతపోకడలు కనిపిస్తున్నాయి..అది ఆర్థిక స్వతంత్రం ఇస్తున్న కిక్కో ఏమో తెలియదు కాని ఇలాంటి చాలా ఘటనలు వింటున్నాం. అమ్మాయిలూ..నేను అందరూ అంతే అనటంలేదు..ఎక్కువగా మాత్రం అలానే ఉంటున్నారు.
సరిదిద్దడం ప్రభుత్వం చేతిలోనే ఉంది.
ఇప్పుడెలా అయితే మానభంగం జరిగిన కేసుల్లో మహిళా జడ్జి సమక్షం లో భాదితురలికి రెండు నెలల్లో న్యాయం చేయాలనీ ఇంకా బాదితురాలి వాంగ్మూలం ఆమె ఇంట్లోనే తీసుకోవాలని చట్టం లో మార్పు చేసారో. అలాగే ఈ చట్టం లో కూడ దుర్వినియోగానికి పాల్పడితే అమ్మాయిలని కఠినంగా శిక్షించి .. అబ్బాయికి యుద్ధప్రాతిపదిక మీద విడాకులు మంజూరు చేసేలా మార్పులు చేయాలి.
ఎవరైన సరే చట్టాన్ని చూస్తె ఉలిక్కి పడేలా చట్టాలు ఉంటె దుర్వినియోగం కావు అని ణా అభిప్రాయం
@ సిరిసిరిమువ్వ
చదివిన చదువుని, వారు తెలివిని ఈరకంగా ఉపయోగించే వాళ్ళని ఏం చేయాలో!
@ శ్రీనివాస్
మీరు చెప్పింది కరెక్టే...
కానీ తక్షణం విడాకులు ఇప్పించటం ఒక్కటే దీనికి పరిష్కారం కాదని నా అభిప్రాయం!
చేయని తప్పుకి రెండు లేదా మూడు రోజులు (లేదా ఎక్కువ) రేమాండ్లో ఉంది వచ్చే అమాయకుల, వాటి కుటుంబ సభ్యుల మానసిక స్థితి ఎలా ఉంటుందో ఊహించండి. వారు పడిన/పడే మెంటల్ టోర్చర్ కి ఎవరు సమాధానం చెప్తారు?
ఒకవేళ అవమానం భరించలేని భర్త ఆత్మహత్యకి పాల్పడితే... కేసు తప్పు అని తేలిన తర్వాత అతన్ని తిరిగి తీసుకురాగలరా?
ధన్యవాదాలండీ మీరు అమ్మాయి అయివుండీ కూడా మా మగవారి పక్షాన కూడా ఆలోచిస్తున్నందుకు.
తప్పు లేకున్నా ఇలాంటి కేసు పెడితే వెంటనే విడాకులు ఇచ్చేయాల్సిందే - పిల్లలు వుంటే మాత్రం అలాంటి నిర్ణయం ఇబ్బందే కానీ కలిసి వుండి కొట్లాడుకుంటూ పిల్లల శాంతి దూరం చేసేదానికన్నా విడిపోతేనే పిల్లలకూ ప్రయోజనం అవుతున్నట్లయితే అలాంటి భార్యలతో విడిపోవడమే మంచిది.
ఇలాంటి కేస్ మాకు తెలిసినవాళ్ళలో కూడా జరిగింది . కాని విచిత్రమేమిటంటే ఎవరూ అబ్బాయి , అతని తల్లితండ్రుల మాట నమ్మరు .
పునః స్వాగతం, ఇదే మీ బ్లాగ్ చూడడం.. మీ బ్లాగ్ లో ఇంకొక టపా, ఈ టపా చూస్తూ, నా ఆలోచన ను ఈ టపా లో పంచుకొన్నాను
http://teepi-guruthulu.blogspot.co.uk/2012/05/blog-post.html
ఈ సెక్షన్ క్రింద నమోదైన కేసుల్లో అభియోగాలు ఎంతవరకు నిజమో ఎవరికీ తెలిదు ,వాళ్ళిద్దరికీ తప్ప.మనమే దానికిసాక్ష్యం కాబట్టి , అవతలి వాళ్ళదే తప్పు అనుకోవడం చాలాసార్లు సరి కాదు
అమ్మాయి ఈ సెక్షన్ లో చెప్పే కారణాలు నిజం కాకపోవచ్చు, పైకి నిరూపించలేని మరికొన్ని కారణాలు,సమస్యలు ఉన్నపుడు అవి చెప్పక కట్నం వేదిమ్పులో, ఇంకే కారణమో చెపుతారు.
ఏదేమైనా కేవలం రూపం, డబ్బు చూసి కుదుర్చుకొనే సంబంధాలలో ఇలాంటి రిస్క్ లు ఉంటాయి :)
Post a Comment