బాపు గారి మిస్టర్ పెళ్ళాం సినిమాలో ఆమని డైలాగ్ గుర్తుంది కదా...
"కలలు కాదండీ గోపాల్ గారూ కళలు... fine arts"
దాన్నే మనం తారుమారు చేసాం అన్నమాట. ఎందుకంటే మన పోస్ట్ 'కల'ల గురించి కాబట్టి :D
(ఈ పోస్ట్ చేయాలి అనుకోగానే... ఎందుకోగాని ఆ డైలాగ్ గుర్తొచ్చింది... అందుకే అలా పెట్టేసా టైటిల్ :D)

నాకు ఒక్కోసారి నిద్రలో వచ్చే కలలు (ofcourse ఎవరికైనా కలలు నిద్రలోనే వస్తాయనుకోండి :P) అలా గుర్తుండిపోతాయి. కొన్ని ఆ రోజంతా గుర్తుంటాయి... కొన్ని ఎన్ని రోజులైనా గుర్తుంటాయి! అన్నిటికీ కాకపోయినా మనకి వచ్చే కొన్ని కలలకి తప్పకుండా ఏదో ఒక అర్థం ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఈ విషయం మీద ఆల్రెడీ చాలా మంది చాలా బుక్స్ కూడా వ్రాసేసారు (నేనేం చదవలేదనుకోండి, అది వేరే విషయం).
కొన్ని కలలైతే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు తప్పకుండా వాటికి ఏదోఅర్థం ఉంది అనిపిస్తుంది.
కలలని అనలైస్ చేయటం చాలా పెద్ద విషయం. నాకైతే అందులో కొంచం కూడా అనుభవం లేదు.
కానీ మొన్న ఒకరోజు మా ఫ్రెండ్ కి ఒక కల వచ్చింది. అది చాలా విచిత్రంగా ఉందని చెప్పింది. మా ఇద్దరికీ కామన్ ఫ్రెండ్ ఇంకో అమ్మాయికి డెలివరీ అయినట్టు (ఆ అమ్మాయి ఆల్రెడీ క్యారీయింగ్) ... తనకి ముగ్గురు పిల్లలు పుట్టినట్టు.

ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. అబ్బాయి చాలా అందవిహీనంగా ఉన్నట్టు, కానీ కాసేపట్లోనే మంచిగా అయిపోయినట్టు... అంతలోనే ఏదో సముద్రం... ఇంకా నీళ్ళల్లో చేపలు. ఇలా అర్థం పర్థం లేని combination లో ఉంది ఆ కల. సరే దాని అర్థం ఏంటో తెలుసుకుందామని గూగులమ్మని అడిగితే... అలాంటి కల వస్తే దాని అర్థం తను ప్రేగ్నంట్ అయి ఉండొచ్చు అని ఉంది. మేము పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు కానీ, సరిగ్గా అది జరిగిన నాలుగు రోజులకి తెలిసింది తను నిజంగానే క్యారీయింగ్ అని!
ఇలాంటివి జరిగినప్పుడు ఇంకా నమ్మకంగా, ఆసక్తిగా అనిపిస్తుంది. అందుకే నాకు తరచుగా వచ్చే కొన్ని కలల మీద గూగుల్ చేసి చూసాను. కానీ పెద్దగా ఏమీ సమాచారం దొరకలేదు. ప్చ్...

ఇవి నా కలలు... గూగుల్ చేస్తే నాకు దొరికిన వాటి అర్థాలు...
౧. మా ఊరులోని మా పాత (అమ్మేసిన) ఇల్లు... ఎక్కువగా రాత్రి పూట, ఎవరూ లేకుండా... భయం భయంగా...
గూగుల్ చేస్తే తెలిసిన సమాచారం... disturbed childhood౨. ఆత్మలు (దెయ్యాలు)... ఒక్కోసారి ఏదో తెలిసినట్టు అనిపించే ఇంట్లో...

౩. ఏదో బస్సులో నుండో... మరో చోటనుండో పడిపోతునట్టు...
దీని అర్థం... మనలో ఏదో భయాలు ఉన్నట్టు అంట. ౪. రోడ్ క్రాస్ చేస్తూ... చేయ
లేకపోతున్నట్టు... రోడ్ మధ్యలో ఉండిపోయినట్టు...
౫. బస్సు కోసం లాస్ట్ మినిట్లో వచ్చినట్టు... అలా వస్తు ఏవేవో ముఖ్యమైన వస్తువులు మర్చిపోయినట్టు... వాటికోసం వెళ్తే బస్సు మిస్ అయిపోతుందేమో... అన్న confusion...
దీని అర్థం... ఆ బస్సు / ట్రైన్ జర్నీ మన లైఫ్ జర్నీ అంట. ఏదో oppurtunity వచ్చినట్టు... అది మిస్ అవుతున్నట్టు... లేదా మిస్ అవుతామేమో అన్న భయం ఉన్నట్టు.౬. బాగా తెలిసిన మనుషులు... ఒక్కోసారి ఎప్పుడో దూరమైపోయిన వారు... ఒక్కోసారి అస్సలు ఎప్పుడూ చూడని వారు...
౭. సాయి బాబా...
ఒక్కోసారి నన్ను చూసి నవ్వుతున్నట్టు... ఒక్కోసారి ఏమీ expression లేకుండా...
ఇది మన నమ్మకమంట. బాబా (లేదా ఎవరైనా దేవుడు) మాట్లాడుతుంటే దాని అర్థం తను మనకి ఏదో సలహా ఇస్తున్నట్టు అంట. తన expression ని బట్టి అర్థం చేసుకోవాలి. ఒక్కోసారి అది మనలో ఉన్న గిల్ట్ ఫీలింగ్ కూడా అవ్వొచ్చంట.౮. పాము... చిన్న చిన్నవి కొన్ని... లేదా పెద్దది...
ఇది అనలైస్ చేయటానికి చాలా కష్తం అంట. దీనిలో చాలా variations ఉండొచ్చు అంట. ఆ వ్యక్తికి పాములంటే ఉండే భయం కూడా అవ్వొచ్చంట.౯. కుక్క(లు)
దీని అర్థం సెల్ఫ్ క్యారెక్టర్ అంట. అవి against గా ఉంటే... మనం ఏదో పని మన క్యారెక్టర్ కి against గా చేస్తున్నట్టు అంట.౧౦. ఒక్కోసారి ఎవరో చనిపోయినట్టు... ఒక్కోసారి పెళ్లి జరుగుతున్నట్టు...
ఇంకా ఉన్నాయేమో... ప్రస్తుతానికి ఇవే గుర్తొచ్చాయి.
నాకు దొరికిన ఆ అర్థాలన్నీ నిజమో కాదో, అసలు నిజంగా వీటికేమైనా అర్థాలు ఉన్నాయో లేదో నాకు తెలీదు కానీ... తరచుగా వస్తుండటం వల్లన ఏదో అర్థం ఉండే ఉంటుందేమో అని నా నమ్మకం. తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంటుంది. హ్మ్మ్...
Picture Courtesy: Internet