Wednesday, April 15, 2009

పార్టీ చూసి వోట్ వేయాలా? అభ్యర్ధిని చూసి వేయాలా?



నిన్న సాయంత్రం టీవీలో ఎన్నికల వార్తలు చూస్తుంటే... అమ్మ వచ్చి 'మనం వోట్ ఎలా వేయాలి' అని అడిగింది. 'అదేం ప్రశ్న... ఇప్పటికి ఎన్నిసార్లు వేసావ్... మొన్న కుడా వేసాం కదా' అన్నాన్నేను (PJR పోయినప్పుడు అసెంబ్లీ ఎలెక్షన్ జరిగింది కదా)
'అది కాదు వోట్ వేయటానికి... మజారాజ్యం పార్టీ వాళ్ళు, భారతీయ ఉడతా పార్టీ వాళ్ళు చిట్స్ తెచ్చి ఇచ్చారు కాని... కంగారుస్ పార్టీ వాళ్ళు ఇవ్వలేదు... మరెలా ఒటెయ్యాలి' అని అడిగింది అమాయకంగా.
'అది కాదమ్మా... అవి ఎవరు ఇస్తే వాళ్ళకే వోట్ చేయాలనీ కాదు... అవి పట్టుకెళ్ళి ఎవరికైనా వోట్ చేయొచ్చు' అని చెప్పా.
'ఒహో అలాగా' అంటూ అక్కడి నుండి వెళ్లిపోబోయింది.
అంతలో నాకేదో బల్బు వెలిగింది... అమ్మని ఆపి... 'అంటే నువ్వు కంగారుస్ పార్టీ కి వేస్తున్నావా వోట్?' అని అడిగాను.
ఏంటి కొత్తగా అడుగుతున్నావ్ అన్నట్టు నావైపు చూసి... ' అంతే కదా మరి' అంది.
'అది కాదమ్మా... ఇంతకుముందు వేరు ఇప్పుడు వేరు... ఇప్పుడు 'జన సత్తా' పార్టీకి వేయమ్మా' అని చెప్పాను.
'అదేం కుదరదు... నాకు వోట్ హక్కు వచ్చినప్పటి నుండి నేను కన్గారూస్ పార్టీ కే వేసాను... ఇప్పుడూ అంతే' అంది మొండిగా.
'అదేంటమ్మా... అప్పుడు ఉన్న పార్టీ జనాలు ఇప్పుడు ఉన్నారా... అప్పటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా... పార్టీ పేరు ఉంది కాని... జనాలంతా మారిపోయారు కదా' అన్నాను
'అదంతా నాకు తెలిదు... నేను కన్గారూస్ పార్టీ నే' అంది... తను పట్టిన కంగారుకి మూడే కాళ్ళు అన్న రీతిలో.
ఇంకా తనతో ఎంత వాదించినా ప్రయోజనం లేదని అర్థమైపోయింది.
'సరే నీ ఇష్టం... ఎప్పుడైనా చదువుకున్న వాళ్లకి వోట్ వేయాలి... అంతే కాని పార్టీ చూసి కాదు' అని చెప్పాను.
'...' తన వైపు నుండి మౌనం.
అది నే చెప్పినదానికి అంగీకారమో... నేను మారను అన్న మొండితనమో నాకు అర్థం కాలేదు!

***
నా అభిప్రాయం ప్రకారం అభ్యర్ధిని చూసి... అతను ఎలాంటి వాడో తెలుసుకుని... అతనికి కనీస అర్హత(చదువు) ఉందొ లేదో తెలుసుకుని వోట్ వేయాలి కానీ... ఇలా పార్టీని చూసి కాదు.
ఒక పార్టీలో అందరు మంచివారే , చదువుకున్నవారే ఉంటారా? మరి అలా ఉండనప్పుడు పార్టీని చూసి ఎవరికంటే వారికి వోట్ చేయలేము కదా!

అలా ఆలోచిస్తుంటే మెదడులో ఇంకో బల్బు వెలిగింది...
మరి జన సత్తా పార్టీలో అభ్యర్దులు ఎవరో అసలు ఎంతమందికి తెలుసు? మా నియోజకవర్గంలో అంటే జన సత్తా నాయకుడే నిలబడ్డారు కాబట్టి... ఆయన గురించి తెలుసు కాబట్టి వోట్ చేస్తాం. మరి మిగత నియోజక వర్గాల సంగతి ఏంటి? అప్పుడెప్పుడో 'జీడిపప్పు' గారు అన్నట్టు... ముక్కు మొహం తెలియని అభ్యర్దికి వోట్ ఎలా వేస్తారు. అలా వేస్తే... ఇక్కడ కుడా పార్టీని చూసి వేసినట్టే కదా!

అంటే ఇప్పుడు పార్టీని చూసి వోట్ వేయాలా? లేక అభ్యర్థిని చూసి వేయాలా?

(నేనయితే ప్రస్తుతానికి రెండూ చూస్తున్నాను... అసెంబ్లీకి అభ్యర్థిని చూసి... పార్లమెంటుకి పార్టీని చూసి (అభ్యర్ది గురించి కూడా కొంచం తెలుసుకున్నానులెండి) వేయబోతున్నాను)

picture courtesy: internet

12 comments:

kiraN said...

పార్టిలో ఉండే అభ్యర్ధిని చూసి ఓట్ చెయ్యాలి.
పార్టీ, మంచిదైతే అభ్యర్ధులు కూడా మంచివాళ్ళే ఉంటారు.
అందరూ అందరికీ తెలియాలని రూలేమీ లేదు కదా.
తెలిసిన వెధవని ఎన్నుకోవడం కంటే తెలియని మంచివాడిని ఎన్నుకోవడం ఉత్తమం.



- కిరణ్
ఐతే OK

పెదరాయ్డు said...

ఇద్దరిలో(పార్టీ నాయకుడు, అభ్యర్థి) ఒక్కరైనా మ౦చివారు౦టే చాలు. ఇద్దరూ వెధవలైతే నిస్స౦కోచ౦గా తిరస్కరి౦చ వచ్చు. మనకున్న చాయిస్ తో ఈ సూత్ర౦ సులభ౦గానే పనిచేస్తు౦ది.

నేను said...

చాలా మంది అసంబ్లీకి పార్లమెంటుకి విడిగా ఏమి చూస్తాం అన్నట్టుగా..రెండిటికీ ఒకటే గుద్దేసొచ్చేసాం అంటారు...అలాంటప్పుడు పార్టీకే ప్రాముఖ్యత వుందేమో అనిపిస్తుంది...కానీ మొన్న కంగారూస్ పార్టీలోంచి నిన్న భారతీయ ఉడతా పార్టీలోకి దూకి, నేడు మజారాజ్యం లో వుంటే ఆ మనిషిని చూసి వెయ్యాలా లేక పార్టీనా

srujana said...

party abyardini chusi vote veyali.
prastutam vunna parties lo mudu enduku panikiraniviga vunay. entha panikivache party elect iyna.. panikirani abyardi ni ennukunte em labam??

కొత్త పాళీ said...

మంచి ప్రశ్న. (మీర్రాసిన శైలి కూడ బాగుంది).
అభ్యర్ధీ, పార్టీ రెండూ ముఖ్యమే.
ఇప్పుడు ఏర్పడినటువంటి పరిస్థితుల్లో పార్టీకే వెయ్యాలని నాకనిపిస్తోంది.

సిరిసిరిమువ్వ said...

"తెలిసిన వెధవని ఎన్నుకోవడం కంటే తెలియని మంచివాడిని ఎన్నుకోవడం ఉత్తమం"---కిరణ్ గారూ బాగా చెప్పారు.

శేఖర్ పెద్దగోపు said...

చైతన్య గారు,
మీ మమ్మి లానే మా పక్కిన్టి ఆంటీ గారు కూడా అన్నారు.
నాకు తెలిసి ఎక్కువ మేరకు పార్టీ చూసి వెయ్యాలి. పార్టీ అధినేత మంచి వాడు,సమర్దుడు అయితే వాడి పార్టీ తరపున నిలబడే అభ్యర్ది చెడ్డ వాడు అయినా రేపు వాడు ఎదైనా చెత్త పని చేస్తే పార్టీ అధినేత తప్పకున్డా చర్య తీసుకుంటాడు. ఇదే విషయాన్ని రివర్స్ లో ఆలోచిన్చామనుకోండి.....ఎలా అంటే..నాయకుడు అవినీతి పరుడు అయితే ఎమ్.ఎల్.ఏ ఏదైనా మంచి పని చేద్దామనుకున్న పార్టీ అధినేత సహకారం లేకపోతే సాధ్యం కాదు.

నేను అనుకున్న మొదటి కేస్ లోకి ఒక్క జనసత్తా మాత్రమే వస్తుంది...అదేనండి...గురువుగారు జే.పీ. గారి పార్టీ...అందుకే దానికే నా వోటు.

ఇది నా అభిప్రాయం. చర్చలకు దిగే ఉద్దేశం లేదు.

శ్రీనివాస్ పప్పు said...

ఉన్న వెధవల్లో ఒక మంచి వెధవని ఎన్నుకోవాలి.ప్రస్తుతానికి ఆ జయప్రకాష్ ఒక్కడే కొంచం మంచివాడిలా కనపడుతున్నాడు కాబట్టి వాడికే ఓటేసేస్తే ఓ పనైపోద్ది.వాడు కూడా కొంప ముంచేస్తే ఇంక మిగిలేది ఏదీ ఉండదు. ఓతంతావ్.

sivaprasad said...

no comment

చైతన్య.ఎస్ said...

పార్టీని చూసే వేస్తున్నా .

Brahmi said...

Party ni Choosi...

Loksatta ki hyd lo bagane padutunnay ani news..

చైతన్య said...

@కిరణ్
తెలిసిన వెధవని ఎన్నుకోవడం కంటే తెలియని మంచివాడిని ఎన్నుకోవడం ఉత్తమం.నిజమే!

@పెదరాయ్డు
అవును...

@నేను
కానీ మొన్న కంగారూస్ పార్టీలోంచి నిన్న భారతీయ ఉడతా పార్టీలోకి దూకి, నేడు మజారాజ్యం లో వుంటే ఆ మనిషిని చూసి వెయ్యాలా లేక పార్టీనాఇది ఆలోచించాల్సిందే!

@సృజన
నిజమే... కానీ పనికొచ్చే పార్టీలో పనికిరాని అభ్యర్థులని కుడా పనికొచ్చేలా చేసే లీడర్ ఉంటే...!

@కొత్తపాళీ
నా శైలి మీకు నచ్చినందుకు సంతోషం
ప్రస్తుతానికి నేనయితే రెండిటిని చూసే వేసాను!

@సిరిసిరిమువ్వ
అవును :)

@శేఖర్ పెద్దగోపు
కరెక్ట్ గా చెప్పారు... నా వోట్ కుడా ఆ పార్టీకే :)

@శ్రీనివాస్ పప్పు
ఏమంటాను... కరక్టే అంటాను :)

@శివప్రసాద్
మీరెందుకు నో కామెంట్ అన్నారో నాకు అర్థమైంది :)

@చైతన్య ఎస్
ఓకే... కానీ ఆలోచించే వేసి ఉంటారని అనుకుంటున్నాను!

@పార్థు
అదే నిజమైతే అంతకంటే ఏం కావాలి :)