Sunday, April 12, 2009

ఇలా చేస్తే!? - 1

మన దేశంలో కావలసినన్ని సమస్యలున్నాయి... అన్నిటికి పరిష్కారం ఉందో లేదో నాకు తెలీదు కానీ... నా చిన్ని మెదడులోకి వచ్చిన కొన్ని ఆలోచనలు చెప్పాలనుకుంటున్నాను.

***

మనలో దాదాపు అందరూ రోజూ ఎదుర్కొనే సమస్య... గతుకుల, గుంటలు పడిన రోడ్లు.

అదేంటో గాని... ఇలా మన R&B వాళ్ళు రోడ్లు వేయగానే... అలా మన టెలికాం శాఖా వారికో, మున్సిపాలిటీ వారికో, మరోకరికో సడన్ గా లైట్ వెలుగుతుంది. వెంటనే పారలు, పలుగులు పట్టుకుని రెడీ అయిపోతారు... వేసిన రోడ్డు త్రవ్వటానికి.
ఎప్పుడో విన్నాను... అలా ఎవరైనా రోడ్డు త్రవ్వితే మళ్లీ ఆ రోడ్డుని అలాగే బాగుచేసి వేయాలి అనే రూల్ ఏదో ఉంది అంట... కానీ నేనెప్పుడు ఎక్కడా అలా త్రవ్వేసిన రోడ్డుని వాళ్ళే బాగుచేసి వేయటం చూడలేదు మరి! మహా అయితే ఏదో దయ తలచి అలా పై పైన పూడ్చేసి వెళ్ళిపోతారు అంతే. మరి ఆ సంబంధిత అధికారులు త్రవ్వటానికి పర్మిషన్ ఇస్తారు కానీ ఇలా తర్వాత వాళ్ళు ఆ రోడ్ బాగు చేసారా లేదా అనేది ఎందుకు పట్టించుకోరో ఏంటో!
ఇంకా... ఎంతో ఖర్చు పెట్టి హుంగామాగా రోడ్లు వేస్తారు... అవేమో ఒక్క వర్షం రాగానే ఠపీమని కొట్టుకుపోతాయి.

ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే... రోడ్లు అలా ఒకే దెబ్బకి పాడైపోకుండా గట్టిగా ఉండాలంటే ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే... ఇప్పుడు రోడ్లు వేయటానికి కాంట్రాక్టు ఎవరో ఒకరికి ఇస్తారు కదా... వాళ్ళేమో డబ్బంతా తినేసి నాసి రకం రోడ్లు వేస్తారు. అలా కాకుండా... వేసిన రోడ్డుకి minimum గారెంటీ ఇవ్వాలి ఆ కాంట్రాక్టర్. అంటే ఉదాహరణకి ఒక సంవత్సరమో, రెండు సంవత్సరాలో లేక అయిదు సంవత్సరాలో... దాని పరిమితిని బట్టి.
ఈలోగా కనుక ఆ రోడ్డు పాడైపోయిందంటే ఆ కాంట్రాక్టర్ మొత్తం ఖర్చు భరించి మళ్లీ రోడ్డు వేయించాలి.
ఇలా చేస్తే చచ్చినట్టు మంచి రోడ్లు వేస్తారని నా ఆలోచన.
ఇంకా రోడ్లు త్రవ్వమని పర్మిషన్ ఇచ్చిన అధికారే ఆ రోడ్లు మళ్లీ బాగుచేసారా లేదా అనేది చూసుకోవాలి. ఆ త్రవ్విన వాళ్ళు మళ్లీ రోడ్లు వేయలేదంటే... ఆ అధికారి వేయించాల్సి ఉంటుంది.

ఈ విషయాల్లో కాస్త స్ట్రిక్ట్ గా ఉండగలిగితే... మనకి మంచి రోడ్లు వస్తాయని నా ఆలోచన.

మరి మీరేమంటారు?

9 comments:

నాగప్రసాద్ said...

>>"వేసిన రోడ్డుకి minimum గారెంటీ ఇవ్వాలి ఆ కాంట్రాక్టర్. అంటే ఉదాహరణకి ఒక సంవత్సరమో, రెండు సంవత్సరాలో లేక అయిదు సంవత్సరాలో..."

ప్రస్తుతానికి ఈ విధానం అమల్లో ఉందనుకుంటున్నాను. నాకు తెలిసి రోడ్డుకి మినిమమ్ గ్యారెంటీ మూడు సంవత్సరాలు. కాని విచిత్రమేమిటంటే, ఆ మూడు సంవత్సరాలూ ఏదో ఒక కారణం చెప్పి కాంట్రాక్టర్ రోడ్డు వేయిస్తూనే ఉంటాడు. :).

శ్రీనివాస్ said...

అనుకుంటాం గాని.... ప్రతి చిన్న పొరపాటు విషయం లోను తీవ్రంగా స్పందించే గుణం ప్రజల్లో రావాలి.... గారంటీ లేకుండా చేసిన పనులను చట్ట పరం గా ప్రజలందరూ ప్రశ్నిస్తే .... పోను పోను ఈ గోల పడలేక కాస్తన్నా నాణ్యత అందిస్తారేమో చూద్దాం

Kathi Mahesh Kumar said...

నాగప్రసాద్ అన్నట్లు ప్రస్తుతం చాలా కాంట్రాక్టులు construction and maintenance కాంట్రాక్టులే.

మురళి said...

మీరు చెప్పిన గ్యారంటీ పధ్ధతి అమలు లో ఉందండి.. ఎన్ని నిబంధనలు ఉన్నా తామూ చేయదల్చుకున్నది చేసేయడమే మన పాలకుల గొప్పదనం..

sivaprasad said...

chala bagundi.
ఇలా చేస్తే!? - 2" eppudu?

చైతన్య said...

@నాగప్రసాద్, కత్తి మహేష్ కుమార్, మురళి
ఓ... ఈ విధానం ఇప్పటికే అమలులో ఉన్న సంగతి నాకు తెలీదు.
అయితే ఇలాంటి పద్ధతి ఉన్నా కుడా ఇంత నాసిరకం రోడ్లు వేస్తున్నారంటే... తప్పు కాంట్రాక్టర్స్ ది కాదు... వాళ్లకి ఆ అలుసు ఇచ్చిన అధికారులది, వాళ్ళని ప్రశ్నించని మనది.

@శ్రీనివాస్
hmm అవును... మారాల్సింది వాళ్ళే కాదు మనం కుడా!

@sivaprasad
2 కుడా వస్తుందండీ త్వరలోనే... ఇలాంటి ఆలోచనలు చాలా ఉన్నాయి... అవి అమలులోకి రావని తెలుసు... కాని ఎలా అయిన ఎవరో ఒకరికి చెప్పాలనే తపన... అందుకే ఇక్కడ ఇలా...

krishna rao jallipalli said...

వాళ్ళేమో డబ్బంతా తినేసి నాసి రకం రోడ్లు వేస్తారు...మీకు తెలియదనుకుంటా... కొంతమంది అధికారులు, ప్రజా ప్రతినిదులు, కాంట్రాక్టర్లు కుమ్ముక్కయి అసలు రోడ్లు వేయకుండానే ఫండ్సు మిగ్గేస్తుంటారు. ఒట్టి కాగితాల మీద మాత్రమె ఉంటాయి రోడ్లు.

పరిమళం said...

తప్పు ప్రశ్నించని మనది :(

చైతన్య.ఎస్ said...

అధికారులు కాంట్రాక్టర్లు కుమ్ముక్కు అయ్యి పంచుకుంటున్నారు. మనమే చురుకైన పాత్ర పోషించాలి.