అవును... నేను ఖండిస్తున్నాను. మాములుగా కాదు... తీవ్రంగా.
ఇంతకీ దేన్ని ఖండిస్తున్నానో చెప్పలేదు కదూ...
ఒక విషయంలో తరతరాలుగా ఆడవాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని.
ఆ విషయం ఏంటంటే... ఒక అమ్మాయిని చూడగానే ఆమెకి పెళ్లి అయిందో లేదో చాలా తేలిగ్గా చెప్పేయొచ్చు. కాని ఒక అబ్బాయిని చూసి అలా చెప్పగలమా!
ఇది ఆడవాళ్లకు ఎంత పెద్ద అన్యాయం!?
అబ్బాయిలకి ఒక అమ్మాయి నచ్చిందంటే... కాలు వేలు చూసో, పాపిట్లో సింధూరం చూసో, మెడలో తాళి చూసో ఆమెకి పెళ్లి అయిందో లేదో confirm చేసేసుకుంటారు.
కానీ అమ్మాయిలకి ఆ ఫెసిలిటి లేదు! అబ్బాయి నచ్చినా... అతనికి పెళ్లి అయిందో లేదో తేలిక... ఎందుకొచ్చిన గొడవలే అని వదిలేయాల్సి వస్తుంది. అంతే కాదు... వాళ్ళకి పెళ్లైందని చెప్పే గుర్తులేమి లేకపోవటం వలన... ఈ మగాళ్ళంతా పెళ్ళయ్యాక కుడా వెర్రి వేషాలు వేసే అవకాశం ఇచ్చినట్టవుతుంది. హుహ్... ఇది అన్యాయం కాదా!
ఈ అన్యాయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.
అబ్బాయిలకి కూడా పెళ్లి అయింది అని చెప్పటానికి ఏదో ఒక గుర్తు ఉండాలి. మొన్నామధ్య వరకు బట్ట తల ఉంటే... వాళ్ళకి పెళ్లి అయింది అనుకునే వాళ్ళం (భార్య చేతిలో పడి జుట్టు ఊడిపోతుంది కదా). కానీ ఇప్పుడు అది కుడా కన్ఫ్యూజనే... ఇప్పుడు బట్టతల అందరికి వచ్చేస్తుంది కదా మరి...!
కాబట్టి నే చెప్పొచ్చేది ఏంటంటే... పెళ్ళయిన మగాళ్ళకి కూడా ఏదో ఒక గుర్తు ఉండాలి ఆ సంగతి తెలియటానికి.
కొన్ని దేశాల్లో అయితే... పెళ్లి ఉంగరం పెట్టుకోవటం అనేది ఒక సెంటిమెంట్... అది చూసి ఇట్టే చెప్పేయొచ్చు అతనికి పెళ్ళైపోయింది అని. కానీ మన దగ్గర అదేమీ compulsory కాదు కదా!
ఈ మధ్య టీవీ లో 'భరణి' సినిమా చూసాను. అందులో ప్రభుకి నదియా కాలికి మెట్టెలు పెడుతుంది... ప్రభు పెళ్ళయిన వాడని... అతని వంక అమ్మయిలెవరు తప్పుగా చూడకూడదు అని. అదేదో బాగానే ఉంది అనుకున్నా కానీ... అదంటే సినిమా కాబట్టి ఏం మాట్లాడకుండా పెట్టుకున్నాడు ప్రభు... బయట ఏ అబ్బాయి అలా పెట్టుకుంటాడు.
అసలు ఈ పద్దతులన్నీ కనిపెట్టింది కుడా మగాళ్ళే... అందుకే వాళ్ళకి అనుకూలంగా ఉండేలాగా చూసుకున్నారు... స్వార్థపరులు..హుహ్.
అందుకే నే చెప్పేదేంటంటే... పెళ్ళయిన అబ్బాయిలని గుర్తించేలాగా ఏదో ఒక గుర్తు ఉండాలి... అది కాలి మెట్టైనా కావొచ్చు... చేతి ఉంగరమైనా కావొచ్చు... మరేదైనా కావొచ్చు.
"మార్పు మార్పు" అని మొత్తుకుంటున్న మజా రాజ్యం పార్టీ వాళ్ళు ఈ విషయంలో కుడా "మార్పు" తేవాలని నేను కోరుకుంటున్నాను. ఈ విషయాన్ని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాను.
అసలే ఇది ఎన్నికల టైం కదా... ఇప్పుడైతేనే ఇలాంటివి బాగా వర్కౌట్ అవుతాయి... కాబట్టి అమ్మాయిలూ... ఇక మొదలెట్టండి... రాస్తా రాకో చేసైనా... అవసరమైతే నిరాహార దీక్ష కుడా చేసైనా... ఎలాగైనా ఈ విషయంలో మనకి న్యాయం జరిగేలా పోరాడాలి.
అప్పటి వరకు తర తరాలుగా జరుగుతున్న ఈ ఘోరమైన అన్యాయాన్ని నేను ఖండిస్తూనే ఉంటాను!
28 comments:
మరావిధంగా ఎప్పటికీ ఖండిస్తూ ఉండాలని కోరుకుంటూ..
-- ఒక మగ రాజ్య సపోర్టర్.
మీకు కొన్ని విషయాల మీద అవగాహన లేనట్లు అనిపిస్తుంది.
పెళ్ళయిన మగవాడిని మీరెప్పుడన్నా గమనించారా. జుట్టు రాలి పోయి ఫేసు పాలిపోయి బక్క చిక్కి పోయి ఈ దేవదాసు వాలకం ఏమిటంటే ఆ దేవిదాసు కావడం వల్ల అంటూ ముక్కు చీదుకుంటూ గుక్క పెట్టుకుంటూ నోట్లో కర్చిఫ్ఫ్ కుక్కు కుంటూ కనిపిస్తారు. అదే గుర్తు.
అప్పడాల కర్ర దెబ్బలకి బొప్పు కట్టిన బుర్రలు .. పెళ్ళాల కోరికల గుర్రాల కింద నలిగి పోయి వంటి మీద గిట్టల గుర్తులు ( కోరికల గుర్రాల తాలూకు) పడి .... ఎక్కడో ఆలోచిస్తూ ఇస్త్రీ లేని బట్టలు నలిగిన జుట్టు జీవం లేని కళ్ళు
పాపం ఒకటా రెండా అన్ని చిహ్నాలు అతను పెళ్లి అయిన వాడని కన్పిస్తుంటే ఇంకా మీ స్త్రీ వాదులు ఆయనకి మెట్టెలు పెట్టాలని ఆయనకి తెల్ల పూసలు వేయాలని చూడడం అమానుషం ... వితండ ( మార్తాండ ) వాదం
హా హా ( కాసేపు రొప్పిన తర్వాత)
మీ చాలెంజ్ లు పెళ్లి కాని బ్రహ్మచారులం .,... పొట్ల గిత్తలం మాతో పెట్టుకోండి ,,, పెళ్ళయిన మా అన్నయ్యల జోలికి పోకండి అసలే మా వదినల చేతిలో కుక్కిన పేనుల్లాగా పడి ఉన్నారు
ప్చ్.. మీకో విషయం తెలియదనుకుంటా.. ఎవరైనా అబ్బాయి నవ్వుతు, తుళ్ళుతూ ఉన్నాడంటే అతనికి పెళ్లి కానట్టు. ప్రపంచం లో సర్వం కోల్పోయినట్టు దిగులుగా ఉన్నాడంటే పెళ్లైనట్టు.. వెరీ సింపుల్.. :)
ఇదేదో బాగుందే! :) విన్-విన్ లాగా పెళ్లికాబోయే అమ్మాయులకు, అబ్బాయులకు ఉపయోగం దీనివల్ల. :):):).
కొర్రు కాల్చి ఒక వాత పెడితే సరి.
అయినా అదెందుకండీ? దండగ. మొహంలో చావుకళ తన్నొచ్చినట్లు కనిపిస్తుంది, కళ్ళల్లో దిగులు, ఆఫీసు వదిలిపట్టకుండా పనిలో "నిమగ్న"మైపోవటం ఇలాంటివి సవాలక్షుండగా.
wat an idea.
హమ్మ, హమ్మ, అబ్బాయిలూ, ఎంత చక్కగా చెప్పేస్తున్నారో! శ్రీనివాస్, త్వరగా మీ శుభలేఖ మాకివ్వండి. ఆ తర్వాత మిమ్మల్ని చూసి అప్పుడు చెప్తాము మీరు చెప్పింది కరక్టో కాదో!
Indian minerva మీరు కూడా నండీ!
మురళీ, మీరెప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ ఉంటారో లేదో తెలుసుకోవాలనుందండీ!
మీరు భరణి సినిమాని గుర్తుచేయటాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నానండి. హాయిగా ఉన్నదాన్ని ఇలా బాధపెట్టటం మీకు తగునా?
హ హ్హ హ్హా బాగుంది బాగుంది.
అన్నట్టు ఈ మధ్య సిటీల్లో కొంతమంది మెట్టెలు, తాళి పెట్టుకోవడం లేదు.. సైట్ కొట్టే కుర్రాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నా(ము)రు....వా :)
శ్రీనివాస్ గారు, మార్తాండవాదం అదిరింది :)
మీరు ఖండించడాన్ని నేను ఖండిస్తున్నా :))
మజా రాజ్యం ఈ విధమైన చర్యలు తీసుకోదు అని ఆశిస్తూ.. ఒకవేళ తీసుకుంటే, వారికి మా మద్దతు విరమించుకుంటాం అని తెలియచేస్తూ .. జై మజా రాజ్యం
ఆ మధ్య ఒక కంపెనీలో జీతాలలో మగ పక్షపాతం వుందని - ఆడవారికంటే మగవారికి రోజుకి 10 రూపాయలు ఎక్కువ ఇస్తున్నారని ఆడ కార్మికులు సమ్మె చేసారు. తమకూ మగ వారితో సమానంగా జీతాలు పెంచాలని కోరారు. జీతాల విషయములో తేడాలు నిజమేనని యాజమాన్యం ఒప్పుకొని సమస్య త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పింది.
ఒక వారం రోజుల తరువాత మగవారి జీతం రోజుకి 10 రూపాయలు తగ్గించబడింది. మీ (ఆడవారి) సమస్యకూ పరిష్కారం అర్ధమయ్యింది అనుకుంటాను.
మురికి పట్టిన జీన్స్ ప్లేస్ లొ నీట్ గా ఉతికి ఇస్త్రి చెసిన పాంట్, నలిగిపొయిన టీ షర్ట్ ప్లేస్ లొ మడత నలగని ఫుల్ హాండ్స్ షర్ట్, పిచ్చుక గూడు లాంతి జుట్టు నీట్ గా కట్ చేసి దువ్వుకుని కనిపిస్తె ఆ అబ్బాయికి పెళ్ళి అయినట్టు. అంతె కదా :P
నేనేదో చైతన్య గారితో పాటు కలిసి ఘాట్టిగా..తీవ్రంగా.. ఖండించుదామని వస్తే..
క్రిందన బాలా కుమారులందరూ కామెంటులతో అదరగొట్టేస్తున్నారే..
అబ్బాయిలందరూ ఇవే మాటలు చెప్తారు.. పక్కన అమ్మాయి వెళ్తుంటే మాత్రం.. పొద్దు తిరుగుడు పువ్వులా తిరిగిపోతారు. ప్రేమలకీ, పెళ్లిళ్ళకూ ముందు తెర లేపేది అబ్బాయిలే కదూ..! తరవాతేమో.. ఇలాంటి మాటలన్నీ చెప్పడమా.. హన్నన్నా... ఎంత విడ్డూరం..!
అమ్మాయిలూ.. పనిలో పనిగా వీటిని కూడా ఖండిస్తే సరి. ఏమంటారూ?
@కిరణ్ గారూ..
ఏంటండీ మగ రాజ్యం అంటున్నారూ..
ఎన్నికల సందడిలో కొత్త పార్టీ గానీ పెట్టారా ఏమిటీ..?
అలాగే సుజాత గారు చెప్పినదాంతో నేను కూడా ఏకీభవిస్తున్నాను :)
రాణి గారు మీరు చెప్పింది పెళ్లి అయిన కొత్తలో సంగతి ... నేను చెప్పింది మిగతా జీవితమంతా
సుజాత గారు త్వరలో ఎలాగు ఇస్తా గా పెళ్లి శుభలేఖ మీకు చూద్దురు గాని చూద్దురు గాని
@కిరణ్... మగరాజ్య supporter ఆ... హుహ్... నేను ఖండిస్తున్నాను
@శ్రీనివాస్... పెళ్లి కాకుండానే చాలా తెలుసుకున్నారు... మీ కామెంట్ కి రిప్లై రాణి గారు ఇచ్చారు చూడండి... :)
@మురళి
మీరు కూడా రాణి గారి కామెంట్ చూడండి
@శివ బండారు
అబ్బాయిలకి ఉపయోగామేనంటారా! :)
@indian minerva
కొర్రు కాల్చి ఒక వాత పెడితే సరి.
ఇది బాగుంది :D
@sivaprasad
కదా!
@సుజాత
పెళ్ళయ్యాక ఇంకా మనకెందుకు కనిపిస్తారండి ఈ శ్రీనివాస్ గారు
@భావాన్ని
భరణి సినిమాలో అంతగా బాధపడాల్సింది ఏముంది చెప్మా!
@జీడిపప్పు
ఆహా... అవి పెట్టుకొని కొందరిని చూసే మీరు confuse అయితే... మరి ఇక మా పరిస్థితి ఏంటి చెప్పండి...
@చైతన్య.ఎస్
ఆ చర్యలు తీసుకోకపోతే మా మద్దతు విరమిస్తాం కదా!
@శరత్
హ్హ... అర్థమైందండి మీరు చెప్పిన solution... ఇదేదో బాగానే ఉంది :D
@రాణి
very well said
ఈ మగాళ్లందరికి సరైన జవాబు చెప్పారు :)
@మధురవాణి
పక్కన అమ్మాయి వెళ్తుంటే మాత్రం.. పొద్దు తిరుగుడు పువ్వులా తిరిగిపోతారు.
భలే చెప్పారండి :D
ఏ మగ శాల్తీ దొంగ చూపులు, బిత్తర చూపులు, పిచ్చి చూపులతో కనబడతాడో.. ఆ శాల్తికి ఖత్చితంగా పెళ్లి అయినట్లే లెఖ్ఖ. ఇక మన దేశంలోనే కాదు ఏ దేశంలో అయినా మగవాడికి పెళ్లి అయినట్లు గుర్తులు ఏమి లేవు. పెళ్లి అయినా కాకపోయినా మగాడిని Mr. అనే సంబోదిస్తారు. కాని అదే ఆడవారు అయితే Miss, Mrs. అనే తేడాలు చూపుతారు. ఆ మద్య జనరలిజే చేసి ఆడవారికి Ms. అని తగిలిస్తున్నారు కాని, అదంత popular కాలేదనుకుంటా.
బ్రదరు శ్రీనివాస్ - అదే మరి. పెళ్లికి పెళ్లైన దోస్తులను పిలవమా, వారు హెల్మెట్లు ఇవ్వరా. భలేవాడివి బాసూ. నాకు ఎనిమిది హెల్మెట్లు వచ్చినై, ఒకటి అట్టిపెట్టుకుని మిగతావి బ్లాకులో అమ్మేసా...:):)
హమ్మో !ఎంత చర్చ జరిగిపోయిందో ...ప్చ్ .....
జీడిపప్పు గారి కామెంట్ నిజమే కాని ఆ కొద్దిమందిని పక్కన పెడితే ఈ విషయం లో ఆడవాళ్ళకే ఓ పిసరు అన్యాయం ఎక్కువ జరిగిపోతున్నట్టు తోస్తోంది.. :)
పెళ్లి కాని బ్రహ్మచారులూ! క్షమించాలి నన్ను ...
@krishna rao jallipalli
హ్హ...Ms అనేది అమ్మాయికి పెళ్లి అయిందో లేదో తెలియనప్పుడు వాడుతున్నారండి
@భాస్కర్
ప్రస్తుతం మీరు హెల్మెట్ ఉపయోగిస్తున్నారా? నిజం చెప్పండి మీరు ఉపయోగించేది ఇంట్లో కాదు కదా? బయట అమ్మాయిల వెంట తిరిగెప్పుడు కదా?
@పరిమళం
ఓ పిసరు అంటారెంటండి బాబు.... చాలా ఘోరమైన అన్యాయం ఇది... అందుకే నేను అంత తీవ్రంగా ఖండిస్తున్నా...
అసలే అమెరికా/ s/w engineer అంటే పిల్లని ఇవ్వం/చేసుకొం అంటుంటే ఇలాంటి పొస్టు రాసినందు నేను ఖండిస్తున్నా అధ్యక్షా... !
@అన్వేషి
నేను పెళ్ళయిన అబ్బాయిల(అదే అంకుల్స్) గురించి మాట్లాడుతుంటే... మీరేంటి పెళ్ళికాని అబ్బాయిల గురించి మాట్లాడుతున్నారు...
నేను ఈ కంఫ్యూజన్ ని కుడా ఖండిస్తున్నా!
నేను కూడ ఖండ ఖండాలు గా ఖండిస్తున్నాను :)
హ హ మొత్తానికి భలే పోస్ట్ , భలే కామెంట్స్ ను
నాకు తెల్సినంత వరకూ ఏ అబ్బయి మెడలో నైనా కొత్త బంగారు గొలుసు తళ తళా మెరుస్తుందంటే ఆ అబ్బయికి కొత్తగా పెళ్ళైనట్టు. అరిగి నల్లబడ్డ గొలుసు వుంటే ఎప్పుడో పెళ్ళైనట్టు , మరి గొలుసు లేకపోతే పెళ్ళవనట్టా , అబ్బే ....కదండీ ఆ గొలుసు తాకట్టులో ఉన్నట్టు.
@కొత్తపాళీ
!!
@Sravya
గుడ్...
@నేస్తం
అలా అని ఊరుకుంటారా... మీరు కుడా ఈ మహోన్నతమిన ఉద్యమంలో పాలు పంచుకోవాలి
@లలిత
బాగానే చెప్పారు... అంటే మరి పెళ్ళికాని అబ్బాయిలని ఎలా కనిపెట్టాలంటారు!?
కేవలం ఖండిస్తూ ఉందాం..దాందేంబోయే!
@కత్తి మహేష్ కుమార్
కేవలం ఖండిస్తూ పోతే ఏమవుతుంది... :O
Post a Comment