Monday, April 20, 2009

ఇలా చేస్తే!? - 2

మనకి ప్రస్తుతం ఉన్న సమస్యల్లో అతి ముఖ్యమైనది.... మన environment కాపాడుకోవటం...
రకరకాల కాలుష్యాల కారణంగా మన తర్వాతి తరాల మనుగడ కుడా ప్రశ్నార్ధకమయ్యే పరిస్థితి వచ్చింది.
అన్నిటికి మనం పరిష్కారం చూపించలేకపోయినా.... కొన్ని విషయాల్లో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకుని ఈ కాలుష్యాన్ని కొంతవరకు తగ్గించొచ్చు.

ప్లాస్టిక్ సంచుల వాడకం ఎంత ప్రమాదకరమైనదో... దాని వలన వాతావరణం ఎంతగా పాడైపోతుందో... మనలో చాలా మందికి తెలుసు. కాని దాన్ని తగ్గించటానికి మనమేం చేస్తున్నాం? అసలేమైనా చేస్తున్నామా?

చిన్నతనంలో ఏ షాప్ కి వెళ్ళినా ఒక బాస్కెట్ పట్టుకుని వెళ్ళినట్టే గుర్తుంది నాకు. కూరగాయలైనా, సరుకులైనా అన్నీ తీసుకెళ్ళిన బాస్కెట్ లేదా బ్యాగ్ లో తెచ్చుకునేవాళ్ళం.
నెమ్మదిగా ప్లాస్టిక్ కవర్స్ usage మొదలైంది... అవి కుడా మొదట్లో డబ్బులు తీసుకుని కవర్స్ ఇచ్చేవారు... డబ్బులెందుకులే పెట్టటం దానికోసం అని అప్పట్లో కుడా బ్యాగ్ లే తీసుకెళ్ళేవాళ్ళం.
కానీ నెమ్మదిగా ఈ ప్లాస్టిక్ కవర్స్ వాడకం బాగా పెరిగిపోయింది... ఎక్కడికి వెళ్ళినా కవర్స్ ఊరికే ఇవ్వటం కుడా దీనికి ఒక కారణం అనుకుంటున్నాను.
కొంతమంది పెద్దవాళ్ళయితే... కొన్ని షాప్స్ కి వెళ్ళినప్పుడు అడిగి మరీ కొన్ని కవర్స్ ఎక్కువ తీసుకుంటారు కూడా!

ఈ కవర్స్ వాడకం ఎంత ప్రమాదకరమైనదో... అందరికీ ఇంకా పూర్తిగా తెలీదు. దీనిగురించి సరైన అవగాహన కూడా ఎంతో మందిలో లేదు.
వీటి వాడకం ఎలా తగ్గించాలో అని ఒక ఫ్రెండ్ తో కలిసి discuss చేసినప్పుడు మాకు తట్టిన కొన్ని పాయింట్స్:

-> ఏ షాప్ లో కూడా కవర్స్ ఊరికే ఇవ్వకూడదు
-> ప్రతి షాప్ లోను కవర్స్ బదులుగా క్లాత్ బ్యాగ్ ఇవ్వాలి (ఇప్పటికే కొన్ని షాప్స్ లో ఇలా చేస్తున్నారు)
-> ఆ షాప్ కి ఇంకొకసారి వెళ్ళినప్పుడు మనం ఆ క్లాత్ బ్యాగ్ తీసుకెళ్తే ఆ షాప్ వాళ్ళు ఎంతోకొంత డిస్కౌంట్ ఇచ్చేలా ఉండాలి
-> ప్రస్తుతానికి ఇది ఒక్కో షాప్ కి విడివిడిగా చేసినా... ముందు ముందు ఒక సెంట్రల్ డేటాబేసు పెట్టి... ఏ షాప్ కైనా బ్యాగ్ ఒకటే ఉండేలా చూడాలి... అంటే ఒక షాప్ లో ఏదైనా కొన్నప్పుడు వాళ్ళు ఒక బ్యాగ్ ఇస్తే... మనం ఆ బ్యాగ్ తీసుకుని ఇంకే షాప్ కి వెళ్ళినా మనకి కొంత డిస్కౌంట్ లభించాలి. (ఇది ఎంత వరకు ఆచరణ సాధ్యమో సందేహమే)

ఇవన్నీ షాప్స్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలైతే... మనం కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి...
-> ఎక్కడికి వెళ్ళినా ఒక క్లాత్ బ్యాగ్ దగ్గర ఉంచుకోవాలి. ఏది కొన్నా ఆ బ్యాగ్ లోనే తెచ్చుకోవాలి... కవర్ ఇచ్చినా వద్దు అని చెప్పాలి.
-> చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి ఈ కవర్స్ వాడకం ఎంత ప్రమాదకరమైనదో వివరించి చెప్పాలి.
-> ఇరుగు పొరుగు వాళ్లకి ఒక క్లాత్ బ్యాగ్ ఇచ్చి, వాళ్ళని కూడా ప్లాస్టిక్ కవర్స్ వాడటం తగ్గించమని చెప్పాలి.
-> కొన్నాళ్ళ క్రితం ఎలా అయితే మార్కెట్ కి బాస్కెట్ తో వెళ్ళేవాళ్ళమో అలా ఇప్పుడు కూడా బాస్కెట్ తీసుకుని వెళ్ళాలి.
-> ఎగ్గ్స్ తెచ్చుకోవటానికి ఒకప్పుడు వాడిన బాక్స్ లాంటివి వాడాలి.

ఇవన్నీ మనం చేయగలిగినవే... ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే... ప్లాస్టిక్ కవర్స్ వాడకం చాలా వరకు తగ్గుతుందని నా అభిప్రాయం.

14 comments:

kiraN said...

బాగా చెప్పారు..
ఇంతకీ ప్లాస్టిక్ నివారణ చర్యలు ఇక్కడ చెప్పడమేనా మీరేమైనా చేస్తున్నారా??



- కిరణ్
ఐతే OK

ప్రకృతి కాంత said...

nice tips
pedda shaapulaloe pursulu tappa manam pattukellae gonusanchulu [ippudu istylugaa jute carry bags antunnaarule vaatini :)]lopaliki tesukellanivvaru vari security reasons vaarivi, maralaantappudu em cheyyaali.....
meeru gamanincharo ledo kaani,
kavarlu atyadhika plaastik viniyogaaniki oka kaaranam aite..ippudu perigina plastic vaadakamlo raase "pen" okati idivaraku inku pennulu vaadaevaaru, vatikannaa ballpoint pens saukaryanga vundadam to vaatiloeki maaraaru. aite vachina kottalo andaroo refill marchevaaru kaanee ippudu ade quality ink to 2rupees ke pens vaccestunte inka refill evarikee alochanaki koodaa raavatledu..e add gel pens vade vaariko tappa...

కొత్త పాళీ said...

good show.

Some time ago, some 20+ bloggers had an online discussion on this subject. The transcripts of that session are posted on my blog somewhere.

మురళి said...

ఇరవై మైక్రాన్ల కన్నాతక్కువ మందం ఉండే ప్లాస్టిక్ కవర్లు తయారు చేసే యూనిట్లను మూసివేయించ వలసిందిగా హైకోర్ట్ అందరు మునిసిపల్ కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చింది. ఇది జరిగి సుమారుగా రెండేళ్ళు అవుతోంది. తీర్పు వచ్చిన కొత్తలో నగరాల్లో మునిసిపాలిటీ వాళ్ళు కొంచం హడావిడి చేశారు. యూనిట్లు కొన్నాళ్ల పాటు పని చేయలేదు.. తర్వాత కథ మామూలే. తక్కువ మందం కల సంచులలో సరుకులు ఇచ్చే షాపులపై మనం మునిసిపాలిటీ వాళ్లకి ఫిర్యాదు చేయవచ్చు. ఒకటి, రెండు ఫిర్యాదులకి వాళ్ళు స్పందించక పోవచ్చు కాని, పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తే పట్టించుకుంటారు. క్లాత్ బ్యాగులతో పాటుగా కాగితపు సంచులను కూడా వాడొచ్చు. ఉపయోగించిన న్యూస్ పేపర్లతో తయారు చేస్తారు వీటిని. ప్లాస్టిక్ సంచులకన్న ధర కొంచం మాత్రమే ఎక్కువ. ఇలా రాస్తూ పొతే ఇదో టపా అయ్యేలా ఉంది. ఆలోచింపచేసే టపా రాశారు. అభినందనలు.

నాగప్రసాద్ said...

తాడిపత్రి లో చేసినట్లు, అన్ని చోట్లా ప్లాస్టిక్ కవర్లను నిషేధిస్తే సరిపోతుంది.

asha said...

మంచి విషయాలు చెప్పారు.
మేం సంచులు కొన్నాం. కానీ అప్పుడప్పుడూ మరిచిపోయి షాపింగ్‌కి వెళిపోతుంటాం. కొంచెం స్పృహ కలిగి నడుచుకోవాలి.

SAVE THE SPARROWS said...

great!really nice and thought provoking and pragmatic suggestions

sivaprasad said...

ఇలా చేస్తే!? - 2 super hit ayindi . ippatiki chala comments vachhayi kada.waiting for 3 part

నేస్తం said...

చాలా ముఖ్యమైన విషయం చెప్పారు..నేను తుక్కు అంతా ప్లాస్టిక్ బేగ్ లలో వేసి పడేసే ప్రతీసారి అనుకుంటాను.. షాపు వాడు కాగితపు బేగ్స్ ఇస్తే బాగుండును కదా అని.. ఇక్కడ గవర్నమెంట్ బుధవారం ఒక్క సారే ఎవరి బేగ్లను వాళ్ళను తెమ్మని ఆదేశించిది.. ఒక వేళ మర్చిపోయి షాప్ కి వస్తే కొనాలి .. ఇలా ఎంత వాడకం తగ్గిస్తారు??.. కాని తుక్కువేయడానికి వేరే మార్గంలేక ప్లాస్టిక్ బేగ్స్ తప్పని సరి ఆశ్రయిస్తాను.. తప్పని సరిగా ఇది గవర్నమెంట్ పొరపాటే .. వారు గట్టిగా ఉంటే ఈ సమస్య నివారించడం సులభం

పరిమళం said...

మంచి టపా!

Aari said...

good post.free ga covers ivvakunDa Dabbulu peDithe/paper bags vADakam
amalulOki vastE bavunTundi.awareness kOsam tv ads lo ekkuva cupinchaali.

చైతన్య.ఎస్ said...

మంచి సందేశం. నేను చాలా వరకు వీటిని వాడకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నా కాని కొన్ని సార్లు విఫలమవుతున్నా :( మీ సూచనలు బాగున్నాయి.

చైతన్య said...

@కిరణ్
నాకు వీలైనంతలో చేస్తున్నానండి

@hello
కరెక్ట్!

@కొత్తపాళీ
ఓకే

@మురళి
అవును... కాగితపు సంచులు కుడా వాడొచ్చు (కాని వీటి కోసమే కాగితం తయారు చేసే స్థాయికి పోకూడదు)

@నాగప్రసాద్
పూర్తి నిషేధం ఎంత వరకు సాధ్యమో అనుమానమే...! కానీ అదే మంచిది!

@భవాని
మర్చిపోకుండా ఎప్పుడూ దగ్గరే ఉంచుకోండి మీ సంచిని!

@SAVE THE SPARROWS
థాంక్స్!

@శివప్రసాద్
హిట్స్ కోసమో, కామెంట్స్ కోసమో రాయలేదండి ఈ టపా!

@నేస్తం
కొన్నిసార్లు ప్రత్యామ్నాయం లేకపోయినా... వీలైనంతలో వాడకం తగ్గిస్తే మంచిది

@పరిమళం
థాంక్స్!

@ఆరి
టీవీ లో ప్రకటనలు మంచి ఆలోచన!

@చైతన్య ఎస్
పూర్తిగా మానేయటం కుదరకపోయినా... వీలైనంతలో వాడకం తగ్గించటం మంచి విషయమే!

అరుణాంక్ said...

ఎంతో ఉపయోగ పడే విషయం గురించి రాసారు.I appreciate you .ప్లాస్తిక్ ఎందుకు వాడకూడదో మా పాప ఒక పొస్టర్ తయారు చేసింది ఒక కాంపిటీషన్ గురించి.దాన్ని పొస్త్ చేస్తాను.