Sunday, May 10, 2009

అమ్మ

"కరుణా... టీ పెట్టివ్వు"
"అమ్మా... నా టవల్ ఎక్కడ?"
"మమ్మీ... నాకు నిమ్మరసం చేసివ్వు"
..
"అమ్మా... నా చున్నీ ఏది... ఆఫీసు కి టైం అవుతుంది"
"మమ్మీ... టిఫిన్ రెడీ ఐందా"
..
"బాక్స్ కట్టావా అమ్మా? ఆఫీసు టైం ఐపోయింది"
..
"కరుణా... టిఫిన్ పెట్టటానికి ఎంతసేపు?"
......

ఇవీ మా ఇంట్లో పొద్దున్నే వినిపించే డైలాగులు... నాన్నగారికి, నాకు, అన్నకి అమ్మ లేకపోతే ఒక్క క్షణం కూడా గడవదు...
అమ్మ రెండు రోజులు ఊరెళ్తే... అవి మాకు రెండు యుగాల్లాగా గడుస్తాయి...

అమ్మ కేమైనా నాలుగు చేతులిచ్చాడా ఆ దేవుడు... అని అనుమానం వస్తుంది అప్పుడప్పుడు...
రోజు అన్ని పనులు ఒక్కత్తే ఎలా చేస్తుంది... తనకి విసుగు రాదా రోజు అవే పనులు చేయటానికి... వారంలో రెండు సెలవులు ఉండే మా పనే మాకు అప్పుడప్పుడు బోర్ గా అనిపిస్తుందే... మరి అసలు సెలవే లేని అమ్మకి బోర్ అనిపించదా ఈ పనులు చేయటానికి!?

అమ్మకి ఆదివారం లేదు... పండగ సెలవు లేదు... వేసవి సెలవులు లేవు... అయినా అమ్మకి విసుగు రాదు.
చిన్నపనిలో ఉన్నప్పుడు ఎవరైనా పిలిచినా ఎంత చిరాకు వస్తుందో నాకు... మరి ఎన్ని పనులు చేస్తున్నా... "అమ్మా నాకు అది కావాలి" అని అడిగితే చాలు... ఏమాత్రం చిరాకు పడకుండా నవ్వుతూ చేసిపెడుతుంది!
అమ్మకి అంత ఓపిక, సహనం ఎలా వచ్చాయి!?

అమ్మంటే అదేనేమో!

అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది.... ఇంకా ఏదో మిగిలిపోయినట్టు అనిపిస్తుంది...
అమ్మ గురించి అంతా వివరంగా చెప్పాలంటే అది "అమ్మ" అనే ఒక్క పదానికే సాధ్యం!

Happy Mothers' Day అమ్మ :)

13 comments:

మాలా కుమార్ said...

చైతన్యం గారు,
బొమ్మ ముద్దుగా వుంది.

పరిమళం said...

ధరిత్రి తరువాత అంత ఓర్పు, క్షమా ..అమ్మకే సొంతం ! అమ్మకు పండుగ శుభాకాంక్షలు .

sivaprasad said...

chala bagundi.
nenu kuda naa blog lo post chesanu. give me ur feedback.
http://sivaprasad-sivaprasad.blogspot.com

మధురవాణి said...

"అమ్మ గురించి అంతా వివరంగా చెప్పాలంటే అది "అమ్మ" అనే ఒక్క పదానికే సాధ్యం!"
ఇంతకంటే అమ్మ గురించి ఎవరమైనా ఏం చెప్పగలం.?

Narendra Chennupati said...

చైతన్య గారు,

నిజమే అమ్మ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది....

మాతృదినోత్సవ శుభాకాంక్షలు........

kiraN said...

అమ్మ గురించి చక్కగా చెప్పారు.

చైతన్య.ఎస్ said...

>>అమ్మ గురించి అంతా వివరంగా చెప్పాలంటే అది "అమ్మ" అనే ఒక్క పదానికే సాధ్యం!


నిజమే... బాగా చెప్పారు

anveshi said...

a mother never uses words, she just uses Mother's Glue..

kolavalEnidi/velakattalenidi talli prema..nijamE enta cheppina takkuvE anipistundi. :)!

convey my wishes to her ..!
happy mother's day :)

నేస్తం said...

చాలా బాగుంది :)

Bolloju Baba said...

హృద్యంగా వ్రాసారు.

anveshi said...

knock knock..

చైతన్య గారు ఎక్కడ వున్నా రావాలి అహో!

Unknown said...

mee avatar/profile lo topi pettukunna ammai bomma meere geesaara :)

చైతన్య said...

@మాలా కుమార్
థాంక్స్... అది ఇంటర్నెట్ నుండి తీసుకున్నాను!

@పరిమళం, శివప్రసాద్, మధురవాణి, నరేంద్ర చెన్నుపాటి, కిరణ్, చైతన్య ఎస్, అన్వేషి, నేస్తం, బొల్లోజు బాబా
థాంక్స్!

@అన్వేషి
హ్హ వచ్చానండి :)

@శ్రావ్య
అవునండి... అది నేనే వేసాను!