అమ్మమ్మ, తాతయ్య చాలా సంతోషంగా ఉన్నారు... వాళ్ల పాత రోజులని గుర్తుచేసుకుని! రేపటిని తమ 'నిన్న' లాగా మార్చాలనుకున్నారు. కొంతకాలం వెనక్కి వెళ్లి... ఒక రోజంతా తమ పెళ్ళికి ముందు ఎలా ఉండేవారో అలా ఉండాలనుకున్నారు.
పెళ్లికి ముందు అప్పుడప్పుడు గోదావరి ఒడ్డున కలుసుకునే వారు.. ఇప్పుడు కూడా తమ 'డేట్' కి ఆ గోదావరి ఒడ్డునే ఎంచుకున్నారు.
తాతయ్య తెల్లారి పొద్దున్నే లేచి... మంచిగా రెడీ అయి... ఒక గులాబిపూల బొకే తీసుకుని సూర్యోదయానికి ముందే గోదావరి తీరానికి వెళ్ళాడు. అక్కడ నది ఒడ్డున కూర్చుని తన ప్రియురాలి కోసం ఎదురుచూస్తూ పాత జ్ఞాపకాలని నెమర వేసుకుంటున్నాడు. తన ఎదురు చూపుల్లోనే సూర్యోదయం కాస్తా సూర్యాస్తమయం అయిపోయింది. అంతసమయం గడిచినా బామ్మ మాత్రం రాలేదు.
ఎదురు చూసీ ఎదురు చూసీ అలసిపోయిన తాతయ్య కోపంగా ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో తన మంచంపై పడుకుని కూనిరాగాలు తీస్తున్న బామ్మని చూసి... కోపంగా తన చేతిలోని గులాబిలని నేల మీదకి విసిరేసి అడిగాడు "ఎందుకు నువ్వు మన 'డేట్' కి రాలేదు?"
బామ్మ సిగ్గు పడుతూ చెప్పింది "మా అమ్మ పంపించలేదు".
!!
11 comments:
హ హ్హా హ్హా.. అయినా ఆడాళ్ళందరూ ఇంతే అని రుజువు చేసారు. పాపం తాతయ్య గారు..
- కిరణ్
ఐతే OK
ha..hha..hhaa...
హ్హ హ్హ హ్హా...
భలే చెప్పారండీ..!! చాలా బావుంది :))))
హ హ్హ హ్హా భలే ఉంది. :)
ha ha ha good joke
Good One Chaitanya :D
wow. good joke.
ha.haa super :)
హహ్హాహ్హహ్హాఅహహ.....
finishing touch అదిరింది :-)
hahahahah rofl .good one
@ కిరణ్, పరిమళం, మధురవాణి, జీడిపప్పు, నేస్తం, లక్ష్మి, భవాని, చైతన్య, పిచ్చోడు, అన్వేషి...
ధన్యవాదాలు!
Post a Comment