Tuesday, April 7, 2009

తెలుగులో కొత్తపదాలు ఇష్టపడే వారికి...

ఈ పోస్టు అంకితం :D

గమనిక: ఈ పోస్టు ఎవరినీ ఉద్దేశించి, ఎవరినీ కించపరచటానికి రాసింది కాదు. కేవలం సరదాగా రాసింది. మరోలా భావించవద్దని మనవి.

అదొక ఆదివారం... అందమైన సాయంత్రం... కాకపోతే కాస్త గాలిదుమ్ము...
ఏదో పని మీద (నిజానికి బండి మీద) అబిడ్స్ వెళ్లాను ఒక ఫ్రెండ్ తో కలిసి. అక్కడ మేము వెళ్ళిన పని కావటానికి కొంత సమయం వెయిట్ చేయాల్సి వచ్చింది. సరే ఈలోగా అందమైన (ఇరుకైన) అబిడ్స్ వీధుల్లో (సందుల్లో) అలా తిరిగి వద్దామని... వ్యాహ్యాళికి వెళ్ళాము (వ్యాహ్యాళి అంటే తెలీకపోతే జంధ్యాల గారి "చూపులు కలిసిన శుభవేళ" సినిమా చూడండి).

అబిడ్స్ జగదీష్ మార్కెట్ కి ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళకపోతే ఒకసారి తప్పకుండా వెళ్ళండి... హైదరాబాద్ లో చార్మినార్ తర్వాత చూడదగ్గ గొప్ప ప్లేస్ అది. మీ జేబుకి తెలీకుండా మీ మొబైల్ కొట్టేసి మీకే అమ్మగల ఘనులుంటారు!
ఆ జగదీష్ మార్కెట్ పక్క వీధుల్లో అలా నడుస్తూ వెళ్తుంటే నా ఫ్రెండ్ సడన్ గా ఆగిపోయి అలా చూస్తూ ఉండిపోయాడు. ఎంటా అంత వింతైన విషయం అని నేను కుడా చూసాను. నేను కుడా అలాగే చూస్తుండిపోయాను. కొన్ని క్షనాలయ్యాక ఇద్దరం ఒకరినొకరం చూసుకున్నాం. ఇలా చుసుకోవటాలన్నీ అయిపోగానే... వెంటనే మొబైల్ బయటకి తీసి ఆ దృశ్యాన్ని బంధించాము.

అక్కడ మేము చూసింది... ఇక్కడ మీరు చూడండి...


ఇప్పుడు అర్థమయిందా ఈ పోస్టు తెలుగులో కొత్త పదాలు ఇష్టపడే వారికి ఎందుకు అంకితం చేసానో :P

15 comments:

శ్రీనివాస్ said...

kasta durghandapoorita hasyamunu

kiraN said...

హ హ్హ హ్హా హ్హా ....
ఎవరూ గేటు లోపలి వెళ్ళకండి..



- కిరణ్
ఐతే OK

జీడిపప్పు said...

పెంటాస్టిక్ :)

sivaprasad said...

అబిడ్స్ జగదీష్ మార్కెట్ కి ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళకపోతే ఒకసారి తప్పకుండా వెళ్ళండి... హైదరాబాద్ లో చార్మినార్ తర్వాత చూడదగ్గ గొప్ప ప్లేస్ అది. మీ జేబుకి తెలీకుండా మీ మొబైల్ కొట్టేసి మీకే అమ్మగల ఘనులుంటారు
nenu 2 times vellanu. abids jagadish market lo dorakani mobile undadu. konni rojulu iphone kuda akkada dorakavachhu. india lo jagadish market ki pedda name undi.

sivaprasad said...

అబిడ్స్ జగదీష్ మార్కెట్ కి ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళకపోతే ఒకసారి తప్పకుండా వెళ్ళండి... హైదరాబాద్ లో చార్మినార్ తర్వాత చూడదగ్గ గొప్ప ప్లేస్ అది. మీ జేబుకి తెలీకుండా మీ మొబైల్ కొట్టేసి మీకే అమ్మగల ఘనులుంటారు
nenu 2 times vellanu. may be akkada dorakani mobile undadu anukunta.konni rojullu iphone kuda dorukuthundi akkada.
chala bagundi.
miku e ideas ela vastayi. meeru emi tintunnaru cheppandi.
wat an idea.

శేఖర్ పెద్దగోపు said...

చైతన్య గారు,

హహ..హ్హహ్....
అలాంటి ప్రయోగాత్మక మైన తెలుగు పదాలు హైదరాబాద్ లో చాలానే కనిపిస్తాయి. మొత్తానికి ఆ బోర్డ్ ని ఫోటో తీసి మాతో పంచుకోవాలన్న మీ ఆలోచన బావుంది. :))))

చైతన్య.ఎస్ said...

ఇటువంటి బోర్డ్లు నా చిన్నప్పుడు తమిళనాడు లో (vellore) చూసినట్టు గుర్తు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బాగా అభివృద్ధి చెందింది కదా ! కాబట్టి ..

మురళి said...

:)

Unknown said...

హ హా హా...ఇంకా చాలా కొత్త పదాలు కొన్ని వాహానాల వెనక కూడ కనిపిస్తాయి...ఆటో వెనక అలా.."అమ్మ దీవెన" వంటి మాటలు కాబోలు ఉద్దేశం కాని వత్తులు దీర్ఘాలు లేకుండ ఏమిటబ్బా ఈ మాట కి అర్థం అనుకునేటట్టుగా ఉంటాయి.

పరిమళం said...

:) :)

చైతన్య said...

@శ్రీనివాస్
నాకేమి అర్థం కాలేదు... తెలుగులో చెప్పండి కొంచం!

@కిరణ్
ఆ బోర్డ్ చూసాక ఇంకెవరు వెల్తరండి గేటు లోపలికి :)

@జీడిపప్పు
థాంక్స్ :D

@sivaprasad
అదేంటి అలా అడిగారు... :O
అందరు తినేదే తింటానండి నేను కుడా!
అన్నట్టు జగదీశ్ మార్కెట్ లో iPhones ఇప్పటికే దొరుకుతున్నాయి :)

@శేఖర్ పెద్దగోపు
థాంక్స్ :)

@చైతన్య ఎస్
అవును కదా... అదేదో సినిమాలో కోటా గారు చెప్పినట్టు... హైదరాబాద్ బాగా డెవలప్ అయింది... ఏం కావాలన్నా ఇక్కడే దొరుకుతున్నాయి :D

@మురళి
:)

@Sravya
అవును నిజమే... అలాంటివి కూడా చాలా చూసాను నేను :)

@పరిమళం
:)

చదువరి said...

:) :)

నాగప్రసాద్ said...

భళే భళే!. వెయ్యండి రెండు వీరతాళ్ళు. :):).

కొత్త పాళీ said...

వ్యాహ్యాళి .. good one!
జగదీష్ మార్కెట్ అంటే ఎలకట్రానికి వస్తువులు అమ్మే సందులగొందుల ప్రపంచం, అదేనా?

చైతన్య said...

@చదువరి, నాగప్రసాద్
:)

@కొత్తపాళీ
హా... అవునండీ... అదే జగదీష్ మార్కెట్ :)