ఒకసారి అధికార పక్షం ఇలా చెప్పింది "రాత్రిపూట అక్కడి నుండి ఎవరైనా ఆ వస్తువులు దొంగిలిస్తారేమో".
దానికోసమని Govt ఒక రాత్రి వాచ్ మాన్ ని నియమించింది.

అప్పుడు అధికార పక్షం ఇలా అంది "వాచ్ మాన్ కి సూచనలు ఏమి ఇవ్వకుండా ఎలా పనిచేస్తాడు?"
దానికి Govt ఒక ప్లానింగ్ డిపార్టుమెంటుని నియమించి ఇద్దరినీ ఉద్యోగులుగా తీసుకుంది. ఒకరు సూచనలు వ్రాయటానికి, ఇంకొకరు టైం ప్లానింగ్ చేయటానికి.
అప్పుడు అధికార పక్షం మళ్లీ ఇలా అంది "ఆ వాచ్ మాన్ సరిగా పని చేస్తున్నాడని మనకెలా తెలుస్తూంది?"
దాని కోసం Govt ఇద్దరు క్వాలిటీ కంట్రోల్ ఉద్యోగులని నియమించింది. ఒకరు వాచ్ మాన్ స్టడీ చేయటానికి, ఒకరు రిపోర్ట్స్ తయారు చేయటానికి.
అప్పుడు అధికార పక్షం ఇలా అంది " వీళ్ళందరికీ జీతాలు ఎలా ఇస్తాము?"
దానికి Govt ఇద్దరినీ నియమించింది.. ఒకరు వీళ్ళు ఎంత సమయం పని చేస్తున్నారో గమనించటానికి, ఇంకొకరు వీళ్ళకి జీతాలు ఇవ్వటానికి.
అప్పుడు మళ్లీ అధికార పక్షం ఇలా అంది "వీళ్ళందరిని ఏ ఎకౌంటు లోకి తీసుకోవాలి?"
దానికోసం Govt ఒక administrative డిపార్టుమెంటుని నియమించి, ఒక administrative ఆఫీసర్ ని, ఒక అసిస్టంట్ ఆఫీసర్ ని, ఒక సెక్రటరీ ని నియమించింది.

కొన్నాళ్ళకి అధికార పక్షం మళ్లీ ఇలా అంది "ఇప్పటికి ఒక సంవత్సరం గడిచింది, ఈ కొత్తగా నియమించబడిన డిపార్టుమెంటుల వలన ఈ సంవత్సరం 5 లక్షల లోటుబడ్జెట్ వచ్చింది. మనం దీన్ని ఎలా అయిన తగ్గించాలి"
దానికోసం వాళ్ళు రాత్రి వాచ్ మాన్ ని ఉద్యోగం నుండి తొలగించారు.
"ప్రస్తుతం IT పరిశ్రమ ఇలాంటి స్థితిలోనే ఉంది."
note : this is translated from an e-mail forward.