1994
ఒక రోజు స్కూల్ నుండి వచ్చేసరికి తెలిసింది ... అమ్మ పక్కింటి అక్కతో కలిసి సినిమాకి వెళ్ళింది అని.
మనకి మంచి వంక దొరికింది
నేను: అమ్మా... నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళారు... నేను కూడా చూస్తా సినిమా
అమ్మ: సరే ఈసారి సినిమాకి వెళ్ళేప్పుడు తీసుకెళ్తాలే
నేను: అదేం కుదరదు... మీరు ఇప్పుడు చూసిన సినిమానే నేను కూడా చూస్తా
అమ్మ: మళ్ళీ అదే సినిమానా ... మేము చూసేసాం కదా... ఇంకో రోజు ఇంకో సినిమాకి వెళ్దాంలే
నేను: ఉహు... నేను ఆ సినిమా నే చూస్తా...
అమ్మ: శుక్రవారం సినిమా మారిపోతుంది కదా...
నేను: అందుకే రేపు స్కూల్ మానేస్తా ... సినిమాకి వెళ్దాం
అమ్మ: ఈ సినిమా కోసం స్కూల్ మానేయటం ఎందుకు...అదేం అంత గొప్పగా లేదులే
నేను: ఉహు నేను చూడాల్సిందే
అమ్మ: ...
తర్వాత రోజు... స్కూల్ మానేసి మరీ మళ్ళీ అమ్మని, ఆ పక్కింటి అక్కని వెంట పెట్టుకుని ఆ సినిమాకి వెళ్ళా...
అదే... టాప్ హీరో !!!
ఆ తర్వాత చాలా కాలం నన్ను స్కూల్ కి పంపించి అమ్మ వాళ్ళు సినిమాకి వెళ్ళినా కూడా నేనేమి గొడవ చేయలేదు!
అమ్మకి గుండె ధైర్యం చాలా ఎక్కువని ఆ తర్వాత తెలిసింది ... టాప్ హీరో రెండు సార్లు చూసాక కూడా ఆ తర్వాత వచ్చిన 'కృష్ణబాబు' సినిమా చూసింది!!
కొన్ని రోజులు... నెలలు... సంవత్సరాలు... సినిమాలు గడిచాయి...
బాలయ్య బాబుని పెద్ద స్క్రీన్ మీద చూసే ధైర్యం చేయలేకపోయాను... అయినా ఏదో ఒక రూపంలో అమ్మని ఆ సినిమాకి రెండో సారి తీసుకెళ్ళిన పాపం వెంటాడుతూనే ఉంది! టీవీ చానెల్స్ లో 'అల్లరి పిడుగు' , 'సమరసింహా రెడ్డి' లాంటి సినిమాలు మార్చి మార్చి వేస్తూనే ఉన్నారు.
జీన్స్ ఎక్కడికి పొతాయి... కాస్త లేట్ అయినా అమ్మ ధైర్యం నాక్కుడా వచ్చింది ...
***
2014
మార్చ్ 28 సాయంత్రం
నేను హైదరాబాద్ లో లేను.
క్లైంట్ ఆఫీసులో ఉండగా... సడన్ గా గుర్తొచ్చింది ... వెంటనే హైదరాబాద్ లో ఉన్న మా ఆయనకి కాల్ చేసాను
నేను: ఎక్కడ ఉన్నావ్
తను: ఆఫీసు లో
నేను: అదేంటి ఈరోజు లీవ్ పెట్టలేదా
తను: ఉహు :(
నేను: సరే నేను సాయంత్రం ఫ్లైట్ కి వస్తునాను.... రేపు వెళ్దాం
తను: అలాగే
నేను: ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేస్తావా
తను: ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు... లైన్లో నిల్చుని టికెట్ కొనాల్సిందే ...
నేను: సరే అయితే
తను: బెనిఫిట్ షో చూడాల్సిందే
నేను: అదేంటి ఈరోజు రిలీజ్ అవ్వలేదా
తను: అయింది
నేను: మరి రేపు బెనిఫిట్ షో చూడటం ఏంటి
తను: అంతే బెనిఫిట్ షో చూడాల్సిందే
నేను: ఎహే సరిగ్గా చెప్పు... ఈరోజు సినిమా రిలీజ్ ఐపోతే రేపు బెనిఫిట్ షో ఎలా చూస్తావ్
తను: అంతే ... ఫాన్స్ ఇక్కడ ... బాలయ్య బాబు కి 24 గంటలు తిక్క ఆన్ లో ఉంటె ఫాన్స్ కి ఆ మాత్రం ఉండదా
నేను: ...
***
మార్చ్ 29
ఉదయాన్నే వెళ్లి లైన్లో గంటసేపు నిల్చుని టికెట్స్ తీసుకున్నాను.
11 గంటలు ... మార్నింగ్ షో
20 సంవత్సరాల తర్వాత బిగ్ స్క్రీన్ మీద బాలయ్య...
బ్యాక్ గ్రవుండ్ లో పాట...
సూర్యుడు చంద్రుడు రాముడు భీముడు
కృష్ణుడు విష్ణువు కలిసారంటే వీడు
ఏ మాటలు వాడాడు మౌనమే పేలుడు
ఎక్కడికక్కడ లెక్కలు తెలుస్తాడు
...
He is a legend ... He is a legend...!!
***
సినిమా చూసి ఇంటికి వచ్చాక...
అన్నయ్య: సినిమా ఎలా ఉంది
నేను: బాగుంది ... బాలకృష్ణ సినిమా లాగే ఉంది
అన్నయ్య: ఈ మధ్య నువ్వు oxymorons ఎక్కువ మాట్లాడుతున్నావ్ !

2 comments:
:)
మళ్ళీ బెనిఫిట్ షోకి వెళదామా :)
Post a Comment