' ఏంటా జీవితం ఇంత ప్రశాంతంగా గడిచిపోతుంది' అనుకుంటున్న టైములో ఒక పాత బ్లాగు ఫ్రెండ్ కనిపించారు. అలా కనిపించి వెళ్ళిపోకుండా తనకి కనిపించిన ఒక వీడియోని నాకు చూపించారు.
చూసాను. బాగుంది. (ఇప్పటి వరకు కూడా జీవితం ప్రశాంతంగానే గడిచిపొతూ ఉంది)
అప్పుడు మళ్ళీ ఆడియో వింటూ చూడమన్నారు... వింటూ చూసాను.
వెంటనే ఆఫీసుకి హాఫ్-డే లీవ్ పెట్టి వెళ్లి అతని మీద '
అటెంప్ట్ టు మర్డర్ ' కేసు పెట్టాను.
కేసు పెట్టానని కక్ష పెంచుకున్నారో ఏంటో ఆ తర్వాతి రోజు ఒక ఆడియో ఫైల్... నాకు ఇష్టమైన పాట పేరుతో సేవ్ చేసి పంపించారు. 'ఆహా ఈ పాట విని చాలా రోజులైంది...' అనుకుంటూ ఆ ఆడియో ఫైల్ ఓపెన్ చేసి విన్నాను.
ఎంతసేపు పట్టిందో తెలీదు కోమాలో నుండి బయటకి రావటానికి! వచ్చాక వెంటనే వెళ్లి ఈసారి ఏకంగా మర్డర్ కేసు పెట్టి వచ్చాను.
'నేను మర్డర్ చేయబడ్డాను. Find attached case filed.' అని ఆఫీసుకి మెయిల్ చేసి ఒక రోజు లీవ్ పెట్టాను.
లీవ్ అయితే పెట్టాను కానీ ఇంట్లో ఏం చేయాలో తోచటం లేదు. పోనీ కాసేపు టీవీ చూద్దామా అంటే... పాపం అత్తయ్య జెమిని, మా టీవీ, ఈ టీవీ లో సీరియల్స్ అన్నీ మార్చి మార్చి చూస్తూ మల్టీ-టాస్కింగ్ చేస్తున్నారు.
ఆ సీరియల్స్ చూస్తూ మళ్ళీ రెండో సారి మర్డర్ అవ్వటం ఇష్టంలేక ... సరే చాలా రోజులయింది కదా బ్లాగులు చుద్దామనిపించి ఇటు వచ్చాను. ఒకటి రెండు బ్లాగులు చదివాక... 'పోనీ మళ్ళీ బ్లాగు రాయటం మొదలు పెడదామ' అని ఆలోచన వచ్చింది.
'చాలా కాలం గ్యాప్ వచ్చిందే... మళ్ళీ రాయగలనా' అని ఆలోచిస్తుంటే... 'హా మరి నువ్వో పేద్ద రచయిత్రివి... నువ్వు రాసేవో ఆణిముత్యాలు.. ఎలాగు రాసేది చెత్తే కదా... దానికి రాయలేకపోవటం ఏముంది' అని సీరియల్ మధ్యలో వచ్చే యాడ్ లో కనిపించిన కరీనా కపూర్ ఒక వెకిలి నవ్వు నవ్వేసి వెళ్ళింది.
'ఛి ఛి ఆఖరికి కరీనా కపూర్ తో కూడా చెప్పించుకోవాల్సి వచ్చింది... ఎదవ జీవితం' అని తిరిగి బ్లాగు రాద్దామని అర్జెంటుగా డిసైడ్ అయిపోయాను.
అందుకే మళ్ళీ ఇక్కడికి వచ్చాను. వచ్చాను కానీ ఉంటానో లేదో... ఉంటే ఎన్ని రోజులు ఉంటానో మాత్రం చెప్పలేను.
'తొక్కలే నువ్వుంటే ఎంత లేకపోతే ఎంత'... అంటుంది
సీరియల్ మధ్యలో మళ్ళీ వచ్చిన కరీనా కపూర్...
ఉండండి వెళ్లి టీవీ పగలకోట్టేసి వస్తా...
9 comments:
ఏది అయితేనేం మొత్తానికి బ్లాగ్లోకం లోకి మళ్లీ వచ్చారు ఎల్కం బేక్.. పునః స్వాగతం :)
అన్నట్టు పాపం కేసులు వెనక్కి తీసుకోండి :P
ha ha .. we do remember you - welcome back.
తెలుగు బ్లాగు పాఠకులంత క్షమాహృదయులు ప్రపంచంలో లేరు!
@చైతన్య.ఎస్ ... అది మేము మేము చూసుకుంటాములెండి.... ఒక శాంతియుత ఒప్పందానికి వచ్చాము...
@Narayanaswamy ... క్షమాహృదయులా... ఇప్పుడు నేనేం తప్పు చేసాను :(
హహహహహ :-)
బ్లాగ్లోకానికి పునరాహ్వానం..
:):) మీకున్న బ్లాగులో పోస్ట్ ఈ రేంజిలో ఉంటుందని ఇప్పుడేగా తెలిసింది :)
మీరు ఏ వీడియోలు చూశారు.. ఏ ఆడియోలు విన్నారు అన్న విషయం మాకు తెలిసిపొయింది లేండి.. :))
Anyway, Glad to see you back!
హిహిహిహిహిహి ఎల్కం ఎల్కం :))
ఆ విధంగా మీరు బలయ్యారన్నమాట. మేమూ ఒకప్పుడు బలైనవాళ్ళమే. బలి గ్రూపుకి స్వాగతం :))
వెల్కం చెప్పిన అందరికీ thanks :)
Welcome back...
Post a Comment