Monday, January 24, 2011

నేతాజీ సుభాష్ చంద్ర బోస్ - 114వ పుట్టినరోజు


నిన్న నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గారి 114వ పుట్టినరోజు.
ఏ దినపత్రికలో అయినా ఏదో ఒక మూల చిన్న వార్తైనా కనిపించిందా ఎవ్వరికైనా?
పనికిరాని వార్తలని పదే పదే బూతద్దంలో చూపించే ఈ వార్తా చాన్నెల్స్ లో... ఎందులోనైనా మాటవరసకైనా ప్రస్తావించారా?

అదే అతని పేరు 'నేతాజీ సుభాష్ చంద్ర గాంధీ' అయి ఉంటే !?

ప్రతి దినపత్రిక లోనూ... పేజీలు పేజీలు ఫోటోలు, ప్రకటనలు...
ప్రతి వార్తా ఛానల్ లోనూ... పదే పదే అదే వార్తలు...

కాదంటారా?

Saturday, January 8, 2011

ఓ వర్షం కురిసింది


ఓ వర్షం కురిసింది...
గతం పెరటిలో పాతిపెట్టిన జ్ఞాపకాలు కొద్ది కొద్దిగా బయటపడ్డాయి!
వర్షం వెలిసింది...
జ్ఞాపకాల శిధిలాలు కళ్ళ ముందు మిగిలాయి!



**అదే వర్షం... అదే స్థలం(హాల్లాండ్)... అవే జ్ఞాపకాలు...