Monday, December 28, 2009

ఆ రాత్రి...


నిన్ను కలిసిన క్షణం...
స్వర్గం నుండి తారల వర్షం కురిసింది
చంద్రుడు వెన్నెల వెలుగులు కురిపించాడు
చల్లటి గాలులు పూల గంధంలా వీస్తున్నాయి
అంతా అందమైన కలలా... నమ్మలేని నిజంలా ఉంది!

కానీ ఉన్నట్టుండి...
ఒక్కసారిగా తుఫాను మొదలైంది
చంద్రుడు మబ్బుల చాటుకు మరుగైపొయాడు
ఎటు చూసినా కటిక చీకటి!
అదొక భయంకరమైన రాత్రిలా మారింది!

ఏదో పోగొట్టుకున్న భావన...
ఏదో తెలియని బాధ...

దూరంగా వెలుగు కనిపిస్తోంది...
మెల్లిగా తెల్లవారుతోంది...
తెరిచిన కనురెప్పల వెనుక.. కల కరిగిపోయింది!


Note: ఇంటర్నెట్ లో చదివిన ఒక ఆంగ్ల కవిత ప్రేరణతో...

7 comments:

శిశిర said...

Nice. :)

చైతన్య.ఎస్ said...

బాగుంది :)

మధురవాణి said...

అందమైన కలలా.. బావుంది మీ కవిత. బొమ్మ అయితే simply superb :)

పరిమళం said...

చైతన్య గారూ ! చాన్నాళ్ళకి ! పునః ప్రవేశం బావుంది .

చైతన్య said...

@ సుజ్జి, శిశిర, చైతన్య, మధురవాణి, పరిమళం...
థాంక్స్! :)

మురళి said...

"తెరిచిన కనురెప్పల వెనుక.. కల కరిగిపోయింది" ...నాకు బాగా నచ్చిన వాక్యమండీ ఇది..

రసజ్ఞ said...

చల్లని వెన్నెలలో తడిసినంత బాగుంది!