జోరున కురిసే వర్షం ...
దుడుకుగా దూకే జలపాతం ...
వేల చుక్కల మధ్యలో చిక్కిన నెలవంక ...
అందమైన సూర్యాస్తమయం ...
రంగు రంగుల హరివిల్లు...
ఇవన్ని చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? అసలు ఏమైనా అనిపిస్తుందా?
మనం వాటి అందాన్ని 'చూస్తూ' ఎంజాయ్ చేస్తాం... కానీ వాటిని 'చూడగలుగుతున్నందుకు' ఎప్పుడైనా సంతోషించామా?
ఈ అందాలేవి చూడలేని... వాటిని ఆనందించలేని వాళ్ళు మన మధ్యలోనే ఎంతోమంది ఉన్నారు...
కానీ వాళ్ళేమి మనకంటే తక్కువ కాదు... ఎందులోనూ కాదు...
ఇంకా చెప్పాలంటే మనమే వాళ్ళకంటే ఎన్నో విషయాల్లో తక్కువ!
వాళ్ళు ఈ లోకాన్ని మనలాగా కళ్ళతో చూడలేకపోవచ్చు... కానీ అన్నిటిని తమ 'సెన్సెస్' తో గెలవగలరు...
అలాంటి ప్రతిభని అందరికీ చూపించాలనే ఉద్దేశంతో 'సహాయ ఫౌండేషన్' ఒక ఈవెంట్ జరుపుతుంది...
వివరాలు:
ఈవెంట్: 'రాగం' - a musical event by visually challenged
స్థలం: హరిహరకళాభవన్, సికందరాబాద్
సమయం: 6 30 PM, 8th ఆగష్టు
టికెట్స్: Rs. 100 , Rs. 200 , Rs. 500 & Rs. 1000
కాంటాక్ట్: onlychaitu@gmail.com
9000344644 (కిరణ్)
9989057887 (బాలచంద్ర)
9177093999 (శ్రీనివాస్)
మన సానుభూతి ఏమి వాళ్ళకి అవసరం లేదు... వాళ్ళ ప్రతిభకి తగిన గుర్తింపు లభిస్తే చాలు...
మన మొత్తం జీవిత కాలంలో... వారి కోసం... ఒక సాయంత్రం... ఓ మూడు గంటలు కేటాయించలేమా?
ఒక పూట విలాసంగా బయట భోజనానికి చేసే ఖర్చు... వీరి కోసం ఖర్చు పెట్టలేమా?
ఇది మనం చేసే త్యాగం కాదు... సహాయం అంతకంటే కాదు... ఇది మన బాధ్యత.
కొన్ని క్షణాలు ఆలోచించండి...
కొన్ని గంటలు కేటాయించండి...
కొన్ని కళ్ళల్లో వెలుగు నింపండి!!
***
మీరు ఈవెంట్ కి రాలేకపోయినా కూడా టికెట్ కొనడం ద్వారా సపోర్ట్ చేయవచ్చు.
5 comments:
how to buy the tickets....
ఇంతకుముందే విశ్వామిత్ర బ్లాగు లో చదివానండి ఈ కార్యక్రమం గురించి.. ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రాం కోసం హైదరాబాద్ వెళ్ళాలనిపించేలా రాశారు.. అక్కడున్న నా మిత్రులకి చెప్పాను, కార్యక్రమం మిస్ కావొద్దని..
@sivaprasad
పైన పోస్ట్ లో నేను ఇచ్చిన ఏదైనా నెంబర్ కి కాల్ చేయండి...
లేదంటే నా మెయిల్ id కి... మీకు ఎన్ని టికెట్స్ కావాలో... మీకు ఎక్కడ అందచేయలో details మెయిల్ చేయండి...
లేదంటే మీ ఫోన్ నెంబర్ మెయిల్ చేయండి... మేమే కాంటాక్ట్ చేస్తాము...
@మురళి
థాంక్స్ అండి...
నాతో పాటు ఓ పది టికెట్లు తీసుకుంటాను..
ఇంకా ట్రై చేస్తా...
- Pardhu
మంచి ప్రయత్నం !
Post a Comment