చైతన్యం
Showing posts with label
వర్షం
.
Show all posts
Showing posts with label
వర్షం
.
Show all posts
Wednesday, August 26, 2009
ఓ వర్షం కురిసింది...
ఓ వర్షం కురిసింది...
గతం పెరటిలో పాతిపెట్టిన జ్ఞాపకాలు కొద్ది కొద్దిగా బయటపడ్డాయి!
వర్షం వెలిసింది...
జ్ఞాపకాల శిధిలాలు కళ్ళ ముందు మిగిలాయి!
Friday, March 20, 2009
వానా వానా వల్లప్ప
అబ్బా
...
ఏంటి
ఈ
ఎండలు
అప్పుడే
మొదలయ్యాయి
అనుకుంటుంటే
...
ఉన్నట్టుండి
ఈరోజు
వర్షం
కురిసింది
.
కానీ
అదేదో
పాటలో
చెప్పినట్టు
చుట్టంలా
వచ్చి
చూసెళ్లిపోయింది
.
ఆ
కురిసే
వానేదో
ఎంచక్కా
ఫుల్లుగా
కురిసేయోచ్చు
కదా
!
"
వర్షం
" -
ఆ
పదంలోనే
ఏదో
తెలియని
ఆకర్షణ
ఉందేమో
అనిపిస్తుంది
.
మరి
పేరే
అలా
ఉంటే
వర్షం
ఇంకెలా
ఉంటుంది
.
వర్షం
కురిసినప్పుడు
వచ్చే
కమ్మని
మట్టి
వాసన
నచ్చని
మనిషి
ఉంటాడా
అసలు
!
నీరెండలో
వర్షం
కురిసినప్పుడు
వచ్చే
ఇంద్రధనుసు
ఎంత
అందంగా
ఉంటుంది
!
అందుకే
వర్షానికి
అంతమంది
ఫాన్స్
.
నేనయితే
ఏ
సి
.
ఏంటో
...
దాన్ని
ఎంత
చూసినా
తనివి
తీరదు
.
నాకు
వానలో
తడవటం
అంటే
భలే
సరదా
.
కానీ
చలేసేస్తుంది
.
వర్షం
కొంచం
వెచ్చగా
పడొచ్చు
కదా
!
అప్పుడు
ఎంచక్కా
ఎంతసేపైనా
తడవొచ్చు
!
ఏం
చేస్తాం
...
అనుకుంటే
జరిగిపోదు
కదా
!
ఈ
దేవుడికి
కుళ్ళు
అనుకుంట
.
తనేమో
మేఘాల
కంటే
పైనెక్కడో
ఉంటాడు
మరి
...
తను
తడవలేడు
కదా
వర్షంలో
.
అందుకే
నన్ను
కూడా
(
మిమ్మల్ని
కూడానా
?)
తడవకుండా
చేస్తున్నాడు
.
తడిస్తే
చలి
వేయటం
,
జలుబు
,
జ్వరం
రావటం
లాంటి
reactions
పెట్టాడు
.
హుహ్
.
అందుకే
ఆ
కురిసే
వర్షాన్ని
అలా
చూస్తూ
సంతోషపడటమే
!
వర్షం
గురించి
ఎవరో
ఎక్కడో
చెప్పిన
ఒక
విషయం
గుర్తొస్తుంది
... "
వర్షం
ఎలాంటి
భావాన్నైనా
ప్రతిబింబించగలదు
"
అని
.
నిజమే
కదా
!
మనం
సంతోషంగా
ఉన్నప్పుడు
వర్షాన్ని
చూస్తుంటే
...
ఇంకా
సంతోషంగా
అనిపిస్తుంది
...
మన
ఆనందం
రెట్టింపు
అయిందేమో
అనిపిస్తుంది
.
అదే
బాధలో
ఉన్నప్పుడు
వర్షాన్ని
చూస్తుంటే
మన
మనసులోని
బాధే
అలా
వర్షంలా
కురుస్తుందేమో
అనిపిస్తుంది
!
నిజంగానే
వర్షం
ఏ
భావాన్నైనా
పలికించగలదు
!
అందుకే
అదంటే
నాకు
బోలెడు
ఇష్టం
.
***
"
వర్షం
"
మీద
నాకిష్టమైన
కొన్ని
పాటలు
: (
వరసక్రమంతో
సంబంధం
లేదు
)
> ఈ
వర్షం
సాక్షిగా
(
వర్షం
)
> ఆకాశ
గంగ
దూకావే
పెంకితనంగా
(
వాన
)
> స్వాతి
ముత్యపు
జల్లులలో
(
ప్రేమ
యుద్ధం
)
> జల్లంత
కవ్వింత
కావాలిలే
(
గీతాంజలి
)
> ఓ
ఓ
ఓ
వానా
వానా
వందనం
(
అడవి
దొంగ
అనుకుంట
)
> వర్షించే
మేఘంలా
నేనున్నా
(
చెలి
)
> గాలివానలో
వాననీటిలో
పడవ
ప్రయాణం
(
స్వయమ్వరం
)
ప్రస్తుతానికి
ఇవే
గుర్తొచ్చాయి
.
ఖచ్చితంగా
ఇంకా
ఉండే
ఉంటాయి
.
Photo Courtesy: Internet
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)