Showing posts with label పరిచయం. Show all posts
Showing posts with label పరిచయం. Show all posts

Friday, February 6, 2009

తొలి పలుకు

బ్లాగు గురించి:
'చైతన్యం' అంటే ఎవరిలోనో, ఏదో విషయంలోనో చైతన్యం తీసుకురావటం కోసం బ్లాగ్ మొదలుపెట్టాను అనుకునేరు... తప్పు తప్పు... నా పేరు చైతన్య... నా బ్లాగ్ పేరు చైతన్యం అంతే... అంతకుమించి ఇందులో గూఢార్ధలు ఏమీ లేవు.

బ్లాగు సినిమాల కోసమో... సాహిత్యం కోసమో... సంగీతం కోసమో... రాజకీయాల కోసమో... వంటల కోసమో... మరిదేని కోసమో ప్రత్యేకంగా రాయటానికి కాదు... ఇందులో నేను నాకు తోచింది రాస్తాను... అది చెత్త కూడా కావచు... సుత్తికూడా కావచ్చు...పైన చెప్పిన సినిమా, సాహిత్యం, సంగీతం, రాజకీయం ఏదైనా కావచ్చు. బ్లాగు కంటూ ప్రత్యేకతఏమీ లేదు... శతకోటి బ్లాగుల్లో ఇదో బోడి బ్లాగు... అంతే.

అయితే colors, camera టాబ్స్ లో పోస్ట్ చేసేవి మాత్రం నా వర్క్సే. ఇంతకుముందు వేరే వేరే బ్లాగుల్లో పోస్ట్ చేసేదాన్ని. ఇప్పుడు అవన్నీ తీసుకొచ్చి ఇందులోనే పెడుతున్నా.

నా గురించి:
నా పేరు చైతన్య. నాలుగు సంవత్సరాలుగా బ్లాగింగ్ చేస్తున్నాను. రాగంలో నాకు నచ్చిన పాటలు పోస్టు చేస్తున్నాను. మధ్యనే కొత్త పాటలు కూడా పోస్ట్ చేయటం మొదలుపెట్టాను. నా బ్లాగ్ కి సందర్శకులు తక్కువే, నేను సందర్శించే బ్లాగ్లుతక్కువే. మధ్య ఇతరుల బ్లాగ్లు చదవటం కాస్త పెరిగింది. అందరూ రాసే విధానం నచ్చింది. దాంతో నాకు కూడా మరోబ్లాగ్ మొదలుపెట్టాలని దురదా పెరిగింది. దాని ఫలితమే బ్లాగు.

చదవండి... నచ్చితే మళ్లీ రండి... నచ్చకపోతే మళ్లీ మళ్లీ రండి... నచ్చేదాకా ;) ... సింపుల్!