పేరు: నిర్మలమ్మ పుట్టిన తేది: 1927 పుట్టిన స్థలం: బందరు మరణం: 19th Feb, 2009 వృత్తి: నటి (1950 - 2002) మొదటి చిత్రం: గరుడ గర్వభంగం (1950) చివరి చిత్రం: ప్రేమకు స్వాగతం (2002)
నిర్మలమ్మగారు సినిమాలో కనపడగానే మా బామ్మని చూసినట్టే అనిపించేది. ఆవిడ సినిమాల్లో నటించటం మానేసాక కూడా ఎన్నోసార్లు ఇంకా తను నటించగలిగితే బాగుండు అనుకున్నాను. అంత సహజమైన నటన ఇంకెవరు కనబరచలేరేమో! ఆవిడ సినిమాల్లో హీరోలని ముద్దుగా తిడుతున్నా మన బామ్మ తిడుతున్నట్టే అనిపించేది. దాదాపు మూడు తరాలతో, 700 పైగా సినిమాల్లో నటించిన ఆవిడ నటన తెలుగు వారెవ్వరూ మర్చిపోలేరు. తెలుగు చిత్రసీమకి ఆవిడ లేని లోటు ఎప్పటికీ ఎవ్వరూ భర్తీ చేయలేరు.
ఆవిడ బామ్మగా నటించిన చిత్రాల్లో నాకు నచ్చిన కొన్ని మచ్చుతునకలు:
యమగోల (Sr.NTR) గ్యాంగ్ లీడర్ (చిరంజీవి) స్నేహం కోసం (చిరంజీవి) బిగ్ బాస్ (చిరంజీవి, రోజా) కిల్లర్ (నాగార్జున, నగ్మా) సుందరకాండ (వెంకటేష్, మీనా) దళపతి (రజనికాంత్) శుభసంకల్పం (కమల్ హస్సన్) స్వాతిముత్యం (కమల్ హస్సన్) మాయలోడు (రాజేంద్రప్రసాద్) ఆ ఒక్కటి అడక్కు (రాజేంద్రప్రసాద్) నాకు పెళ్ళాం కావాలి (రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్) శంకరాభరణం (చంద్రమోహన్) పదహారేళ్ళ వయసు (చంద్రమోహన్, శ్రీదేవి) శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ (నరేష్) రాత్రి (రామ్ గోపాల్ వర్మ)
కొద్దిసేపటి క్రితం పప్పుశ్రీను గారి బ్లాగు చదివనప్పుడు నాక్కూడా నా చిన్ననాటి సంగతులన్నీ రింగులు రింగులుగా గుర్తొచ్చాయి... వాటితో పాటే అప్పట్లో తీరని నా చిన్న చిన్న(అప్పట్లో పెద్దగా అనిపించేవి) కోరికలు కూడా ఒక్కొక్కటిగా గుర్తొచ్చాయి... సరదాగా అవన్నీ ఒకసారి బ్లాగుదామనిపించింది... చాలా చిన్నప్పుడు, అంటే నేను 2nd class అలా చదివేప్పుడు పెద్ద జడ కావాలని అనిపించేది... రోజూ చాలా పూలు పెట్టుకోవాలి... పూల జడలు వేసుకోవాలి అని అనిపించేది... కానీ అప్పుడు తిరుపతి మొక్కు వలన కొద్ది కొద్దిగా వచ్చిన జుట్టుతో బాబ్ కట్ ఉండేది. తర్వాత మెల్లిగా పెద్ద జడ వచ్చేసింది కాని... మళ్లీ కాలేజీలో చేరిన కొత్తలో మా పక్కంటి అమ్మాయిని, ఆమె పొట్టి జుట్టుని చూసి inspire అయి నేను కూడా నా జుట్టు కట్ చేసేసుకున్నాను... అదేంటో అప్పటి నుండి అందరూ పొడుగు జుట్టు వాళ్ళే కనిపించేవారు. తర్వాత రోజూ నుండే నాక్కూడా మళ్లీ పెద్ద జడ కావాలనిపించేది... hmm...!
మా స్కూల్ లో, class లో చాలా మంది వాళ్ళ బుక్స్ ని ఒక స్టీల్ బాక్స్ లో తెచ్చుకునేవారు... నాకు మాత్రం బాగ్ ఉండేది. నాక్కూడా అలా బాక్స్ లో బుక్స్ తీసుకెళ్లాలని కోరిక. అన్నకి మాత్రం బాక్స్ ఉండేది... ఎన్నిసార్లు అడిగినా నాకు మాత్రం బాక్స్ కొనివ్వలేదు మా అమ్మ. అన్న కూడా ఒక్కరోజు ఇవ్వమన్నా ఆ బాక్స్ ఇచ్చేవాడు కాదు. వాడు వాడినన్ని రోజులు వాడేసి పక్కన పడేసాడు. అప్పుడు మనం ఆ డొక్కు అయిపోయిన బాక్స్ ని మళ్లీ కొన్ని రోజులు వాడుకుని ఆ కోరిక అలా తీర్చేసుకున్నాం.
అప్పట్లో సైకిల్ మీద స్కూల్ కి వెళ్ళాలనే కోరిక కూడా ఉండేది... కానీ నాకేమో సైకిల్ తొక్కటం రాదు... 7th class లో ఒక స్నేహితురాలి సైకిల్ తీసుకుని కష్టపడి నేర్చుకున్న. అప్పటికే మా అన్నకి సైకిల్ ఉండేది, మరి వాడు అప్పుడు 10th class కదా. అదేంటో నేను సైకిల్ నేర్చుకోగానే మా నాన్నగారికి హైదరాబాద్ transfer అయిపొయింది. ఇక్కడేమో మేము ఉండే కాలనీకి స్కూల్ 10KM దూరంలో ఉండేది... ఇంక సైకిల్ ఎలా వేసుకేల్తం స్కూల్ కి... చచ్చినట్టు బస్ లో వెళ్ళేదాన్ని. ఆ సైకిల్ కోరిక ఇప్పటికీ తీరలేదు...hmm!
ఇంక ఇలాంటి చిన్న(పెద్ద) కోరికలు చాలా ఉండేవి.... లంచ్ బాక్స్ ని స్కూల్ బాగ్ లో కాకుండా ఒక బాస్కెట్ లో పెట్టుకుని తీసుకెళ్లాలని.... ఇంకా మంచి డిజైన్లు ఉన్న స్వెటర్లు వేసుకోవాలని (మరి మా స్కూల్ లో మరూన్ కలర్ తప్ప వేరేది వేసుకోనివ్వరు)... మా అన్నని నేను కొడితే వాడు ఏడవాలి కానీ తిరిగి నన్ను కొట్టకూడదని... ఇలా ఏవేవో కోరికలుండేవి... వాటిలో కొన్ని అప్పుడు తీరాయి... చాలా ఇప్పటికీ తీరలేదు!
అయితే colors, camera టాబ్స్లోపోస్ట్చేసేవిమాత్రంనావర్క్సే. ఇంతకుముందు వేరే వేరే బ్లాగుల్లో పోస్ట్ చేసేదాన్ని. ఇప్పుడు అవన్నీ తీసుకొచ్చి ఇందులోనే పెడుతున్నా.